Live Updates: ఈరోజు (ఫిబ్రవరి-20) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Live Updates: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..

K V D Varma
Updated on: 20 Feb 2021 12:19 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు పంచాంగం ఈరోజు శనివారం | 20 ఫిబ్రవరి, 2021 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. ఉత్తరాయణం | మాఘమాసం | శుక్లాపక్షం | అష్టమి 13:33:13 వరకు తదుపరి నవమి | రోహిణి నక్షత్రం పూర్తిగా | వర్జ్యం 07:27:05 నుండి 08:13:42 వరకు | అమృత ఘడియలు 12:06:45 నుండి 12:53:22 వరకు | దుర్ముహూర్తం 06:40:28 నుండి 07:27:05, 07:27:05 నుండి 08:13:42 వరకు | రాహుకాలం 09:35:16 నుండి 11:02:40 వరకు | సూర్యోదయం: 06:40:28 | సూర్యాస్తమయం: 18:19:39 ఈరోజు తాజా వార్తలు

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • 20 Feb 2021 11:06 AM IST

    Telangana Live Updates

    - వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆలంపల్లి లో బావిలో పడిన జింక...

    - జింకను బావిలో నుండి బయటకు తీసి కాపాడిన రైతు..

    - అనంతరం జింకను అనంతగిరి ఫారెస్ట్ లో విడిచి పెట్టిన రైతు...

  • 20 Feb 2021 11:06 AM IST

    Telangana Live Updates

    - వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల ఆలంపల్లి లో బావిలో పడిన జింక...

    - జింకను బావిలో నుండి బయటకు తీసి కాపాడిన రైతు..

    - అనంతరం జింకను అనంతగిరి ఫారెస్ట్ లో విడిచి పెట్టిన రైతు...

  • 20 Feb 2021 10:10 AM IST

    Telangana Live Updates

    * గౌలి దొడ్డి లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కోచింగ్ సెంటర్ లో అస్వస్థతకు గురి అయిన విద్యార్థుల కు కొనసాగుతున్న చికిత్స

    * 23 మంది విద్యార్థులలో ఒక విద్యార్థి కి కరోనా పాజిటివ్

  • 20 Feb 2021 10:09 AM IST

    Telangana Live Updates: జనగామ జిల్లా

    జనగామ జిల్లా:

    * వావిలాల ఫంక్షన్ హల్ దగ్గర ప్రమాదవశాత్తు రాత్రి బైక్ అదుపు తప్పి కింద పడడంతో అక్కడికక్కడే వ్యక్తి మృతి. మృతుడు పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ ముత్తినేని శ్రీనివాస్ గా గుర్తింపు.

  • 20 Feb 2021 8:57 AM IST

    Telangana live Updates: ఆదిలాబాద్ జిల్లా

    ఆదిలాబాద్ జిల్లా:

    -కేంద్రంలోని రిమ్స్ భవనంపై నుండి పడి వ్యక్తి మృతి

    -ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు

    -ఇటీవలే రిమ్స్ బిల్డింగ్ పై నుండి దూకి ఇద్దరు ఆత్మహత్య

  • 20 Feb 2021 8:51 AM IST

    Telangana live Updates: నిర్మల్ జిల్లా

    నిర్మల్ జిల్లా:

    - ఖానాపూర్ సమీపంలోని సదర్మాట్ బ్యారేజీ వద్ద ముంపు రైతుల ఆందోళన

    - భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుండి ఆందోళన చేపట్టిన బాధిత రైతులు

    - సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

    - సదర్మాట్ పనులు చేపట్ట వద్దంటూ కాంట్రాక్టర్ కు రైతుల అల్టిమేటం

    - పరిహారం చెల్లించని పక్షంలో పోరాటం మరింత ఉదృతం చేస్తామంటు వార్నింగ్

  • 20 Feb 2021 8:46 AM IST

    Telangana live updates: ఆదిలాబాద్

    ఆదిలాబాద్:

    - నేడు జిల్లాకు రానున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్

    - బోథ్ మండలంలోని పొచ్చేర గ్రామంలో నిర్వహించే బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్న అరవింద్

    - ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీలనుండి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ సమక్షంలో బీజేపీలో చేరనున్న నాయకులు

  • 20 Feb 2021 8:44 AM IST

    Telangana live updates: హైదరాబాద్

    హైదరాబాద్ లో షర్మిల ఆత్మీయ సమ్మేళనం

    - ఈ రోజు హైదరాబాద్ లో హైదరాబాద్ రంగరెడ్డి జిల్లాల వారితో మీటింగ్

    - భారీ ఎత్తున వైఎస్ అనుచరులు, అభిమానులు హాజరయ్యే అవకాశం

    - పార్టీ ఏర్పాటు పై షర్మిల స్పష్టత ఇస్తోందని ఎదురు చూస్తున్న అభిమానులు

  • 20 Feb 2021 7:46 AM IST

    Telangana live updates: నిజామాబాద్ జిల్లా

    నిజామాబాద్:

    - కాంగ్రెస్ నుండి బిజెపి లోకి బాన్సువాడ నేతలు

    - ఈ నెల 25 బండి సంజయ్ సమక్షం లో బిజెపి లో చేరనున్న బాన్సువాడ కాంగ్రెస్ అసంతృప్త నేత మాల్యాద్రి రెడ్డి

    - నేడు అనుచరులతో సన్నాహక సమావేశం

    - టీఆరెస్ కు బాన్సువాడ లో చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్న బిజెపి

  • 20 Feb 2021 6:45 AM IST

    Telangana live updates: నిజామాబాద్ జిల్లా

    నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఢీకంపల్లి లో ప్రతిష్ఠాపనకు సిద్ధంగా ఉన్న పెద్దమ్మతల్లి విగ్రహన్నీ గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాక్లూర్ ఎంపీపీ మస్తు ప్రభాకర్, టిఆర్ఎస్ నాయకులు ఘటనా స్థలానికి రావడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. విషయాన్ని గ్రామస్తులు మాక్లూర్ ఎంపీపీ కి చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఎమ్మెల్యే, ఎంపీపీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

K V D Varma

K V D Varma

Next Story