Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Aug 2020 10:24 AM IST
Nalgonda District: దామరచర్ల మండలం కొండ్రపోల్ లో లారీ ని డీ కొట్టిన అంబులెన్స్
నల్లగొండ జిల్లా :
- దామరచర్ల మండలం కొండ్రపోల్ లో లారీ ని డీ కొట్టిన అంబులెన్స్ ఇద్దరు మృతి, డ్రైవర్ తీవ్ర గాయాలు..
- మృతులు నెల్లూరు కి చెందిన కమలకర్ రెడ్డి (48),తండ్రి నందగోపాల్ రెడ్డి(75) గా గుర్తింపు.. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న తరుణం లో హైదరాబాద్ కి ఆస్పత్రికి తీసుకొని తీసుకోవెళ్తుండగా లారీ ని డీ కొట్టిన అంబులెన్స్ ..
- 19 Aug 2020 10:22 AM IST
Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్ కు పెరుగుతున్న వరద ప్రవాహం..
కర్ణాటక:
- డ్యాం ఇన్ ఫ్లో: 78,765
- ఔట్ ఫ్లో: 88,212
- డ్యాం లో నీటి నిల్వ: 97.047 టీఎంసీలు.
- డ్యాం పూర్తి సామర్థ్యం: 100.855 టీఎంసీలు.
- డ్యాం లో ప్రస్తుత నీటి మట్టం: 1632.01 అడుగులు.
- పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు.
- 19 Aug 2020 10:19 AM IST
Chegunta: ఇబ్రహీంపూర్ పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లి ముత్యాలు.
చేగుంట:
చేగుంట మండలం ఇబ్రహీంపూర్ పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లి ముత్యాలు. వరుణ్. అనే ఇద్దరు వ్యక్తులు గల్లంతు ముత్యాలు శవం లభ్యం వరుణ్ కోసం జాలర్లు
- 19 Aug 2020 8:55 AM IST
Heavy rains in Manchiryal : మంచీర్యాలలో భారీ వర్షాలు
మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు నస్పూర్,మందమర్రి, హజీపూర్ మండలాల్లో ఏడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం, ఉప్పొంగుతున్న వాగులు వంకలు, కాజువెలలో నిలిచిపోయిన రాకపోకలు,
శ్రీరాంపూర్,రామకృష్ణాపుర్, మందమర్రి సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో నిలిచిపోయిన 1,26,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి,
సుమారు 31 కోట్ల 50 లక్షల రూపాయలు నష్టం
- 19 Aug 2020 8:47 AM IST
Jurala project updates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
మహబూబ్ నగర్ జిల్లా :
- 39 గేట్లు ఎత్తి వేత
- ఇన్ ఫ్లో: 3 లక్షల 32 వేల 309 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 3 లక్షల 32 వేల 760 క్యూసెక్కులు.
- పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: 9.657 టీఎంసీ.
- ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.434 టీఎంసీ.
- పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
- ప్రస్తుత నీటి మట్టం: 317.910 మీ.
- 19 Aug 2020 8:45 AM IST
Nizamabad Sriramsagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ఉధృతి
- ఇన్ ఫ్లో 66 వేల క్యుసెక్కులు
- ఔట్ ఫ్లో 2 వేల క్యూసెక్కుల
- పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు
- ప్రస్తుత నీటి మట్టం 1082 అడుగులు
- నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు
- ప్రస్తుతం 58 టిఎంసీ లు
- 19 Aug 2020 8:44 AM IST
Adilabad tribal festival: ఆదిలాబాద్ గిరిజన గూడాలలో జాగై మాథూర్ పండుగ..
- రోగాలను ప్రారద్రోలేందుకు జాగై మాథూర్ పండుగ నిర్వహిస్తున్నా గిరిజనులు..
- శివారు బయటకు రోగాలను పారద్రోలుతున్నా గిరిజనులు..
- శివారు ప్రాంతంలో శివ జార్ కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నా గిరిజనులు..
- ప్రతిఏటా జాగై మాథూర్ పండుగ నిర్వహిస్తున్నా గిరిజనులు
- 19 Aug 2020 8:42 AM IST
Permission to covid hospitals: నిజామాబాద్ లో మరో రెండు ఆసుపత్రులకు అనుమతి
నిజామాబాద్ జిల్లాలో మరో రెండు ప్రైవేట్ ఆసుపత్రుల కు కోవిడ్ చికిత్స కు అనుమతి
ఇప్పటికే నాలుగు ఆసుపత్రుల్లో కొనసాగుతున్న కోవిడ్ చికిత్స.
నగరంలోని కివి, సిల్వర్ లైన్ ఆసుపత్రికి అనుమతి నిచ్చిన ప్రభుత్వం
- 19 Aug 2020 8:41 AM IST
Nizamabad rains update: భారీ వర్షాలకు కూలిన ఇళ్ళు
నిజామాబాద్ :
జిల్లాలో కురిసిన వర్షాలకు కూలిన 235 ఇళ్ళు.
మూడు ఇళ్ళు పూర్తిగా, మిగతా పాక్షికంగా కూలినట్లు నివేదిక.
పూర్తిగా నేల మట్టమైన ఇళ్లకు 95 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 5200 చొప్పున పరిహారం ఇవ్వనున్న అధికారులు
- 19 Aug 2020 8:39 AM IST
Hyderabad CP on Twitter: ప్లాస్మాను దానం చేసి ప్రాణాలను రక్షించండి.
- ట్విట్టర్లో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్..
- ప్లాస్మాను దానం చేసి ప్రాణాలను రక్షించండి.
- హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది ఇప్పటివరకు 150 మందికి పైగా ప్లాస్మా దానం చేశారు..
- మనిషి మాత్రమే మరో మనిషికి దానం చేయగలడు..
- మీకు సహాయం చేయడానికి సిటీ పోలీసులు ఉన్నారు..
- ప్లాస్మా విరాళం వాట్సాప్ కోసం లేదా 9490616780 కు కాల్ చేయండి...



