Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Aug 2020 8:38 AM IST
Ameenpur case updates: అమీన్ పూర్ బాలిక లైంగిక దాడి కేసులో ముగిసిన కష్టడీ విచారణ
- అమీన్ పూర్ బాలిక లైంగిక దాడి కేసులో ముగిసిన కష్టడీ విచారణ..
- నిందితుల విచారణ మొత్తం ఫోటో, విడియోగ్రాఫి ద్వారా విచారణ చేసిన పోలీసులు..
- 14 ఏళ్ల బాలిక తో పాటు మరి కొంత మంది బాలికలను లైంగికంగా ఇబ్బందులకు గురిచేసినట్లు విచారణ లో వెల్లడి..
- అమీన్ పూర్ లో ఉన్న మారుతి అనాధాశ్రమానికి అనుమతులు లేవని తేల్చిన పోలుసులు..
- పఠాన్ చెరువు డీఎస్పీ కార్యాలయం లో విచారణ చేసిన పోలీసులు..
- విచారణ లో వెల్లడైన అంశాలను హైపవర్ కమిటీకి అందజేత..
- 38 మంది చిన్నారులను విడివిడిగా విచారణ చేయాలని హైపవర్ కమిటీ నిర్ణయం..
- ఇప్పటికే మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ లు రికార్డ్ చేసిన హైపవర్ కమిటీ..



