Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Aug 2020 3:10 PM IST
Sangareddy: తురకపలి గ్రామం చెందిన వ్యక్తి కి కారోన తో మృతి
సంగారెడ్డి జిల్లా:
- నారాయణఖేడ్ మండలం తురకపలి గ్రామం చెందిన వ్యక్తి కి కారోన తో హైదరాబాద్ ఆసుపత్రిలో మృతి
- 19 Aug 2020 2:48 PM IST
Secunderabad: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలు...
సికింద్రాబాద్:
- అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలు...
- అల్వాల్ సూర్యా నగ ర్ కాలనీలో రాత్రి అన్నా చెల్లెలు మధ్య గొడవ..మద్యం మత్తులో ఉన్న అన్న తన ఇద్దరి చెల్లాలు పైనా కూరగాయల కత్తితో దాడి..
- స్వల్ప గాయాలు కావడంతో అల్వాల్ పోలీసులకు పిర్యాదు చేసిన ఇద్దరు చెల్లాలు
- కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు...
- పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
- 19 Aug 2020 2:47 PM IST
Facebook Office: ఫేస్బుక్ కార్యాలయాన్ని ముట్టడించారు యూత్ కాంగ్రెస్ నాయకులు..
- గచ్చిబౌలి రహేజా పార్కులోని ఫేస్బుక్ కార్యాలయాన్ని ముట్టడించారు యూత్ కాంగ్రెస్ నాయకులు.
- ఫేస్ బుక్ కార్యాలయం ముందు ఆందోళన చేసిన యూత్ కాంగ్రెస్ నేతలు.
- ఫేస్ బుక్ డైరెక్టర్ అంకి దాస్ బిజెపి ముసుగులో కాంగ్రెస్ పార్టీ పై విద్వేష ప్రచారం చేస్తున్నారంటూ నినాదాలు.
- కాంగ్రెస్ పై అభ్యంతరకరమైన పోస్టింగ్ పెడుతూ రెచ్చిగోటే ప్రయత్నం చేస్తునందుకు ఫేసు బుక్ డైరెక్టర్ పదవి తొలగించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్.
- 19 Aug 2020 2:43 PM IST
Uttam Kumar Reddy: ట్విట్టర్ ద్వారా పీసీసీ అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి
- రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్
- గారి వ్యాఖ్యలు, కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతున్నాయి.
- చిన్న రాష్ట్రాలు కూడా రోజుకు లక్షల్లో టెస్టులు చేస్తుంటే తెలంగాణలో నిన్న చేసిన టెస్టులు కేవలం 19,579.
- కేసీఆర్ తీరుతో రాష్ట్రం మరియు హైదరాబాద్ అభాసుపాలవుతున్నాయి!
- 19 Aug 2020 2:12 PM IST
Khammam District: సత్తెంపేట గ్రామం లో ఫారెస్ట్ సిబ్బందికి,గిరిజనులకు మధ్య ఘర్షణ..
ఖమ్మం జిల్లా:
- సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామ పంచాయితీ లోని సత్తెంపేట గ్రామం లో ఫారెస్ట్ సిబ్బందికి,గిరిజనులకు మధ్య ఘర్షణ.
- పోడు భూముల్లో గిరిజనులు ఇళ్లు నిర్మించారని ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులు.పరిస్థితి ఉద్రిక్తం
- 19 Aug 2020 1:22 PM IST
Minister Satyavathi Rathore Tour: ముంపు గ్రామాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన
ములుగు జిల్లా: వాజేడు మండలం పేరూరు గ్రామాల్లో వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్న *మంత్రి సత్యవతి రాథోడ్,
- 19 Aug 2020 1:18 PM IST
Parvati Barrage Inflow Updates: పార్వతీ బ్యారేజ్ నుంచి నీరు విడుదల
పెద్దపల్లి జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతి బ్యారేజ్
పార్వతీ బ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి....
👉32 గేట్లు ఎత్తి 32636 క్యూసెక్కుల నీరు దిగువ గోదావరినది లోకి విడుదల.
👉 పూర్తి స్ధాయి నీటి నిల్వ సామర్థ్యం
8.83 టిఏంసిలు
👉 ప్రస్ధుతం నీటి నిల్వ సామర్ధ్యం 7.24 టిఏంసిలు
👉 వాటర్ లేవల్ +129.0/+130.000 మీటర్లు
👉 ఎల్లంపల్లి ప్రాజెక్ట్ & స్థానిక ప్రవాహంలో ద్వారా వచ్చే ప్రవాహం 32636 క్యూసెక్కులు...
- 19 Aug 2020 1:13 PM IST
Prof. Kodanda Ram supports to weavers: చేనేత కార్మికుల దీక్షలకు కోదండరాం సంఘీభావం
నల్గొండ: చండూరు లో చేనేత కార్మికులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపిన ప్రొపెసర్ కోదండరాం.
ప్రొపెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులు అర్పించి, చేనేత కార్మికులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న కోదండరాం.
- 19 Aug 2020 1:08 PM IST
Suicide in Yadadri: మూటకొండూరు మండలం లో విషాదం
యాదాద్రి జిల్లా: - మూటకొండూరు మండలం లో విషాదం.
ఒకే ఇంట్లో మామ , కోడలు ఉరి వేసుకొని ఆత్మహత్య..
-భర్త మరో వివాహం చేసుకున్నాడని మనస్తాపం తో బార్య మానస ఉరివేసుకుని ఆత్మహత్య ..
- కోడలి ఆత్మహత్య తో భయానికి లోనై మామ మారయ్య ఉరి వేసుకొని ఆత్మహత్య .
- 19 Aug 2020 1:04 PM IST
Sriram Sagar Project inflow: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ఉధృతి
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ఉధృతి
ఇన్ ఫ్లో 79 వేల క్యుసెక్కులు
ఔట్ ఫ్లో 2 వేల క్యూసెక్కుల
పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం 1082 అడుగులు
నీటి సామర్థ్యం 90 టీఎంసీ లు
ప్రస్తుతం 60 టిఎంసీ లు








