Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Aug 2020 5:53 PM IST
కరోనా వచ్చిన 5 నెలల్లో 4 రోజులు మాత్రమే ఏపీలో చంద్రబాబు ఉన్నాడు : ఎమ్మెల్యే వంశీమోహన్
కృష్ణాజిల్లా:
- కరోనా వచ్చిన 5 నెలల్లో 4 రోజులు మాత్రమే ఏపీలో చంద్రబాబు ఉన్నాడు : ఎమ్మెల్యే వంశీమోహన్
- ఏపీలో పనిలేని చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది : వంశీమోహన్
- ఆంధ్రా వదిలి రూంలో కూర్చుని చంద్రబాబు జూమ్ లో మాట్లాడుతున్నాడు : వంశీమోహన్
- చంద్రబాబు మానసిక బ్రా0తొలో ఫోన్ ట్యాప్ అయిందంటున్నాడు : వంశీమోహన్
- రమేష్ హాస్పిటల్ లో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో తప్పేముంది : వంశీమోహన్
- తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది : వంశీమోహన్
- రమేష్ హాస్పిటల్ కు ఆరోగ్యశ్రీ కింద నగదు చెల్లించినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి మంచితనం కనపడలేదా ? :వంశీమోహన్
- విశాఖ యల్.జి ఫాలిమర్స్ లో ప్రమాదం జరిగినప్పుడు యాజమాన్యం మీద చర్యలు తీసుకోమని చంద్రబాబు, లోకేష్ లేఖలు రాయలేదా : వంశీమోహన్
- తప్పు చేయని రమేష్ పారిపోవాల్సిన అవసరం ఏముంది : వంశీమోహన్
- 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో హాస్పిటల్ యాజమాన్యం పై కేసులు పెట్టడం ప్రభుత్వం విధి : వంశీమోహన్
- రమేష్ హాస్పిటల్ ఏమైనా పెదవాళ్ళకు ఉచితంగా వైద్యం చేసిందా? : వంశీమోహన్
- కోవిడ్ కేర్ సెంటర్ లు పెట్టి కరోనా లేని వాళ్ళ వద్దకుడా లక్షలు వసూళ్లు చేశారు : వంశీమోహన్
- తెలంగాణలో కేసీఆర్ కోవిడ్ హాస్పిటల్ లపై తప్పు చేస్తే చర్యలు తీసుకోలేదా ? : వంశీమోహన్
- చంద్రబాబు,లోకేష్ లు జాతీయ పార్టీ వాళ్లుగా తెలంగాణలో ఎందుకు మాట్లాడరు : వంశీమోహన్
- చట్టం ముందు అందరూ సమానులే : వంశీమోహన్.
- 19 Aug 2020 5:52 PM IST
కర్నూలు
కరోనా సోకిన వారిని హోం హైసోలేషన్ నుండి ప్రభూత్వ క్వరంటైన్ కి తరలించాలనే ఉద్దేశాన్ని కర్నూలు జిల్లా కలేక్టర్ విరమించుకొవాలని సి.పి.యం పార్టి నేతలు డిమాండ్..
- 19 Aug 2020 5:51 PM IST
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
కర్నూలు జిల్లా:
- శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు
- ఇన్ ఫ్లో : 3,85,880 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 66,954 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 881.10 అడుగులు
- నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు
- ప్రస్తుతం : 193.4090 టిఎంసీలు
- కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 19 Aug 2020 5:50 PM IST
JC Prabhakar Reddy: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు
అనంతపురం:
- తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి బెయిల్ మంజూరు
- ఈ నెల ఆరవ తేదీన కడప సెంట్రల్ జైలు నుంచి తాడిపత్రికి వస్తూ, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం, తాడిపత్రి రూరల్ సిఐని దూషించిన అభియోగలపై ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.
- అదే కేసులో మరుసటి రోజు అరెస్టు.. రిమాండ్ కి తరలింపు.
- ఆరోగ్యం సరిగా లేదన్న విషయం పై ఇవాళ కోర్టు లో బెయిల్ పిటిషన్ వేయగా బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి.
- 19 Aug 2020 5:49 PM IST
తూ.గో కొత్తపేట:
- కొత్తపేట మండలం కండ్రిక వద్ద గుర్తించిన గుర్తు తెలియని మృతదేహం బొబ్బర్లంక ముక్తేశ్వరం పంట గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- 19 Aug 2020 5:26 PM IST
Kurnool District: ఆదోని లో అక్రమ మద్యం స్వాధీనం
కర్నూలు జిల్లా:
- ఆదోని లో అక్రమ మద్యం స్వాధీనం
- సిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేసిన 1టౌన్ పోలీస్ లు
- కర్ణాటక నుండి అక్రమంగా ఆంధ్రకు మద్యం తరలిస్తున్న ఇద్దరు యువకులు అరెస్టు ..
- పంట పొలాల్లో ఉపయోగించే స్ప్రెయింగ్ మిషన్ లో, మరియు ద్విచక్ర వాహనం లో సుమారు 180 టెట్రా మద్యం ప్యాకెట్లు స్వాధీనం
- 19 Aug 2020 5:21 PM IST
Coronavirus in Nellore: నెల్లూరు జిల్లా లో కొనసాగుతున్న కరోనా విలయం.
నెల్లూరు:
-- నెల్లూరు జిల్లా లో కొనసాగుతున్న కరోనా విలయం.
-- గడచిన 24 గంటల్లో 755 మందికి సోకిన మహమ్మారి.
-- జిల్లాలో తాజా కేసులతో 19,300కి చేరిన బాధితుల సంఖ్య.
- 19 Aug 2020 5:20 PM IST
Disaster Management: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
అమరావతి:
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ
- వాయువ్య బంగాళాఖాతం అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు, రేపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం.
- గోదావరికి వరద ఉధృతి ఉన్నందున జిల్లా అధికారులను అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు
- లోతట్టు ప్రాంత , లంక గ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- తీరం వెంబడి గంటకు 40-50 కీ.మీ వెగంతో గాలులు వీస్తాయి.
- మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.
-విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు
3 రోజుల వాతావరణ వివరాలు:-
- ఆగష్టు 19వ తేదిన:-
- తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం.
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం.
- రాయలసీమ, నెల్లూరు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం
ఆగష్టు 20వ తేదిన:-
- తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం.
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం.
- రాయలసీమ, నెల్లూరు చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం.
ఆగష్టు 21వ తేదిన:-
- తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం.
- రాష్ట్రంలో మిగిలిన చోట్ల చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడే అవకాశం.
- 19 Aug 2020 5:18 PM IST
AP Cabinet Meeting: క్యాబినెట్ సమావేశం ముగిశాక మంత్రులు, సీఎం జగన్ మధ్య ఆసక్తికరమైన చర్చ
అమరావతి:
- క్యాబినెట్ సమావేశం ముగిశాక మంత్రులు, సీఎం జగన్ మధ్య ఆసక్తికరమైన చర్చ
- పార్టీకి కొంత సమయం కేటాయించాలని జగన్ ను కోరిన మంత్రి అవంతి.
- పార్టీ పరిస్థితిపై జిల్లాల వారిగా వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్య నేతలతో సమీక్ష చేయాలన్న మంత్రులు.
- నియోజకవర్గ పరిధిలో రోడ్లు దెబ్బతిన్నాయనీ, కొంత మేర నిధులు కేటాయించాలని కోరిన మంత్రులు.
- పంచాయతీ రాజ్, ఆర్&బి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుందామన్న సీఎం.
- 19 Aug 2020 5:08 PM IST
Guntur: తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం
గుంటూరు జిల్లా:
- గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల లో వాలంటీర్ ఆకుల గోపి ఇంట్లో 34 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు....
- పరారీలో వాలంటీర్ గోపి...
- గోపి తండ్రిని అదుపులోకి విచారిస్తున్న పోలీసులు....



