Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-19) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 19 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం అమావాస్య(ఉ. 8-22 వరకు) తదుపరి పాడ్యమి; మఘ నక్షత్రం (తె. 4-08 వరకు) తదుపరి పుబ్బ నక్షత్రం, అమృత ఘడియలు ( రా. 1-49 నుంచి 3-22 వరకు), వర్జ్యం (సా. 4-35 నుంచి 6-07 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-38 నుంచి 12.28 వరకు తిరిగి మ.03-00 నుంచి 3-50 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-21

రోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Superspeciality Courses in Kurnool Medical Hospital: కర్నూలు మెడికల్ కాలేజీలో కొత్తగా 5 సూపర్ స్పెషాలిటీ కోర్సులు
    19 Aug 2020 3:34 PM GMT

    Superspeciality Courses in Kurnool Medical Hospital: కర్నూలు మెడికల్ కాలేజీలో కొత్తగా 5 సూపర్ స్పెషాలిటీ కోర్సులు

    అమరావతి: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

    కర్నూలు మెడికల్ కాలేజీలో కొత్తగా 5 సూపర్ స్పెషాలిటీ కోర్సులు

    వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ జవహర్ రెడ్డిని అభినందించిన కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్

    అనుమతి లభించడంలో అన్ని విధాలా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ

    పూర్తి స్థాయిలో ప్రోత్సహించినందునే సూపర్ స్పెషాలిటీ కోర్సులు

    సాధించామన్న ఎంపీ

    యూరాలజీ , నెఫ్రాలజీ , పెడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, న్యూరో సర్జరీ విభాగాల్లో స్పెషాలిటీ కోర్సులకు అనుమతి

  • Kishan Rail:  అనంతపురం నుండి  కిసాన్ రైల్ స్పెషల్  నిర్వహణకు ప్రతిపాదన
    19 Aug 2020 3:30 PM GMT

    Kishan Rail: అనంతపురం నుండి ' కిసాన్ రైల్ స్పెషల్ ' నిర్వహణకు ప్రతిపాదన

    గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో రైతులు , వ్యాపారులు ఎగుమతిదారుల కోరిక మేరకు అనంతపురం నుండి ' కిసాన్ రైల్ స్పెషల్ ' నిర్వహణకు ప్రతిపాదన...

    2020 - 21 బడ్జెట్ ప్రకారం రైతులకు ప్రయోజనం కల్పించేందుకు సరైన మార్కెట్ మరియు ధరలను కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే కిసాన్ రైల్ స్పెషల్ లను ప్రకటించింది .

    దీనిలో భాగంగా గుంతకల్లు డివిజన్ పరిధిలో అనంతపురం నుండి ఉత్తరాది రాష్ట్రాలకు వ్యసాయ ఉత్పత్తులను రవాణా చేసే అంశంపై రైతులు ప్రజాప్రతినిధులు తో సమావేశం నిర్వహించారు...

    ఈ సమావేశంలో గుంతకల్లు డివిజన్ డిఆర్ఎమ్ అలోక్ తివారి అనంతపురం ఎంపీ తలారి రంగన్న , అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామి రెడ్డి , రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు...

    అనంతపురం లో ప్రధానంగా తీపి నిమ్మ , దానిమ్మ . పుచ్చకాయలు మొదలైన పండ్లతో పాటు కూరగాయలు సాగు చేస్తుంటారు..

    ప్రస్తుతం రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ , ఉత్తరప్రదేశ్ , మధ్య ప్రదేశ్ , రాజస్తాన్ , హర్యాన , పంజాబ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఈ సరుకు రవాణా చేయడం జరుగుతుంది...

    ఈ పండ్లు గమ్యస్థానం చేరేలోగా చెడిపోయే అవకాశం కూడా ఉంది..

    ఈ విషయంలో డివిజనల్ రైల్వే అధికారులు పండ్ల ఉత్పత్తులను రైల్వే ద్వారా రవాణా చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి సమావేశంలో వివరించారు ...

    అనంతపురం జిల్లాలోని వివిధ స్టేషన్లనుండి ఉత్తరాది రాష్ట్రాలకు కిసాన్ స్పెషల్ రైళ్ళను నడిపే అవకాశాల గురించి చర్చలు జరిగాయి.

    రైతులు , వ్యాపారులు ప్రధానంగా అక్టోబర్ - మే వరకు రోజువారి రైళ్లను నడపాలని కోరారు..

    మిగతా నెలల్లో వీక్లి లేదా బైవీక్లీ రైళ్ళను అనంతపురం , ధర్మవరం, తాడిపత్రి రైల్వే స్టేషన్ల నుండి నడపాలని వారు కోరారు .

    అదేవిధంగా ఈ రైళ్ళను మార్గ మధ్యంలో భోపాల్ మరియు ఝాన్సీల వద్ద లోడింగ్ / అన్లోడింగ్ కోసం ఆపాలని కోరారు..

    రైల్వే పరికరాల్లో శీతల గిడ్డంగులు మరియు రిఫ్రిజిరేటెడ్ ఫార్మల్ వ్యాన్లను వ్యవసాయ ఉత్తత్తులు పాడవకుండా రవాణకోసం ఏర్పాటుచేయాలని కోరారు

    ప్రస్తుతం రేణిగుంట నుండి పాల వ్యాగన్లను నడుపుతున్న రీతిలో అనంతపురం నుండి కూడా ఈ తరహా పాల వ్యాగన్లను నడపడానికి అవకాశాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అన్నారు.

  • ThungaBhadra Dam Updates: తుంగభద్ర కు తగ్గిన వరద ప్రవాహం
    19 Aug 2020 3:26 PM GMT

    ThungaBhadra Dam Updates: తుంగభద్ర కు తగ్గిన వరద ప్రవాహం

    కర్ణాటక: తుంగభద్ర డ్యాం అప్డేట్.

    తుంగభద్ర కు తగ్గిన వరద ప్రవాహం.

    కేవలం 12 గేట్లు మాత్రమే తెరిచిన అధికారులు.

    డ్యామ్ నుంచి 36,276 క్యూసెక్కుల నీరు కిందికి విడుదల

  • Corona Updates In AP: టెస్టులో ఏపీ ముందంజ
    19 Aug 2020 3:24 PM GMT

    Corona Updates In AP: టెస్టులో ఏపీ ముందంజ

    విజయవాడ: రాష్ట్ర జనాభాలో 5.65 శాతం మందికి కరోనా టెస్టులు చేసిన ఏపీ

    దేశంలోనే ముందంజలో ఏపీ

    ఒక మిలియన్ జనాభాకు 56541 టెస్టులతో మొదటి స్థానం

    ఇప్పటి వరకు 30 లక్షల 19 వేల 296 టెస్టులు చేసిన ఆంధ్రప్రదేశ్ 

  • 19 Aug 2020 3:20 PM GMT

    Phone Tapping: చంద్ర‌బాబు హ‌యంలోనే ఫోన్ ట్యాపింగ్‌: సజ్జల రామకృష్ణ

    అమరావతి: సజ్జల రామకృష్ణ రెడ్డి....ప్రభుత్వ సలహాదారు

    మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్సార్‌సీపీ నాయకుడిగా ఉన్న నాఫోన్‌ను చంద్రబాబుగారు ట్యాపింగ్‌ చేయించారని సజ్జల రామకృష్ణ రెడ్డి....ప్రభుత్వ సలహాదారు అన్నారు 

    దీనికి సంబంధించిన ఆధారం ఇది అని కాపీ పోస్ట్ చేసిన సజ్జల.

    దీన్ని న్యాయస్థానాలకూ సమర్పించాం.

    ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్న బాబుగారు ఇలా ఆధారాలు ఎందుకు చూపడంలేదు?

  • ChandraBabu online Meeting with  Vizak TDP Leaders: విశాఖ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో చంద్ర‌బాబు ఆన్‌లైన్ స‌మావేశం
    19 Aug 2020 2:45 PM GMT

    ChandraBabu online Meeting with Vizak TDP Leaders: విశాఖ టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో చంద్ర‌బాబు ఆన్‌లైన్ స‌మావేశం

    అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు కమిటీల బాధ్యులతో ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు.

    ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి, ఆర్ధిక రాజధాని విశాఖ అని ఆ రోజే అసెంబ్లీలోనే చెప్పాం

    విశాఖకు వచ్చే పెట్టుబడులన్నీ వైసిపి పోగొట్టింది

    పెట్టుబడుల గమ్యస్థానంగా మేము చేస్తే, రౌడీ దందాల అడ్డాగా వైసిపి చేసింది

    స్వంత దుకాణాలు, స్వంత బ్రాండ్లతో జనాన్ని లూటీ చేయడమే మద్య నిషేధమా..? 

    టిడిపి ఇచ్చిన రూ10,500కోట్ల విలువైన ఇంటిజాగాల్లో రూపాయి అవినీతి జరిగిందా..?

    ఈ రోజు కేబినెట్ లో కోవిడ్ పై కనీసం సమీక్ష చేయరా..?

    ప్రజల ప్రాణాలంటే వైసిపికి లెక్క లేదా..? ప్రజారోగ్యం పట్ల ఆమాత్రం బాధ్యత లేదా..?

    ఇది ప్రాణాలు కాపాడే సందర్భమా..? కక్ష సాధించే సందర్భమా..?

    ఎంత భయపెడితే అంత తిరగబడతారని వైసిపి గుర్తుంచుకోవాలి

    శాంత స్వభావులైన విశాఖ వాసులు వైసిపి అరాచకాలను చూసి భయపడే పరిస్థితి

    వైసిపి బాధిత ప్రజానీకానికి టిడిపి అండగా ఉండాలి

    రాబోయే 100రోజులు పార్టీ కార్యకలాపాలపై నిర్దేశం

  • TTD Employee died with Corona: టీటీడీలో కరోనాతో మరో ఉద్యోగి మృతి
    19 Aug 2020 2:36 PM GMT

    TTD Employee died with Corona: టీటీడీలో కరోనాతో మరో ఉద్యోగి మృతి

    టీటీడీలో కరోనాతో మరో ఉద్యోగి మృతి.

    అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురుమూర్తి స్విమ్స్ లో చికిత్స పొందుతూ మృతి.

    టీటీడీలో 6 కి పెరిగిన కరోనా మృతుల సంఖ్య


  • 19 Aug 2020 12:28 PM GMT

    Srikakulam: జిల్లాలో మరి 565 కరోనా కేసులు నమోదు..

    శ్రీకాకుళం జిల్లా:

    - జిల్లాలో మరి 565 కరోనా కేసులు నమోదు..

    - దీంతో 16,373 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య..

    - గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 446 మంది డిశ్చార్..

    - ప్రస్తుతం జిల్లాలో 5,333 ఆక్టీవ్ కేసులు..

  • 19 Aug 2020 12:27 PM GMT

    Drugs Gang: డ్రగ్స్ ముఠా అరెస్ట్..

    బ్రేకింగ్:

    - డ్రగ్స్ ముఠా అరెస్ట్..

    - మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేసిన డిఆర్ఐ అధికారులు...

    - నిషేధిత 52.5 కేజీల నార్కోటిక్ డ్రగ్స్ పట్టుకున్న డిఆర్ఐ...

    -  వీటి విలువ 6 కోట్లు ఉంటుందన్న డిఆర్ఐ.

  • 19 Aug 2020 12:25 PM GMT

    Kakinada: వినాయక చవితి సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

    తూర్పు గోదావరి:

    కాకినాడ: వినాయక చవితి సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

    - జిల్లాలో కరోన వైరస్ రోజు రోజు కు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా లో వినాయక పందిర్లు లకు అనుమతి లేదు

    - ఊరేగింపు లు,గుంపులుగా జన సమూహలుగా పూజలు చెయ్యకూడదు

    - దేవాలయం లో కోవిడ్-19 నియమలు పాటిస్తూ పూజలు జరుపుకోవాలి

    - రోడ్డు పై, విధుల్లో పందిర్లు వెయ్యడానికి అనుమతి లేదు

    - ఏ విధమైన సాంస్కృతిక కార్యకలాపాలకు అనుమతి లేదు.

Print Article
Next Story
More Stories