Live Updates: ఈరోజు (సెప్టెంబర్-18) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శుక్రవారం | 18 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి మ.2-55 వరకు తదుపరి విదియ | ఉత్తర నక్షత్రం ఉ.9-35 తదుపరి హస్త | వర్జ్యం: సా.5-25 నుంచి 6-55 వరకు | అమృత ఘడియలు: రా.2-23 నుంచి 3-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.8-17 నుంచి 9-05 వరకు, తిరిగి మ.12-19 నుంచి 1-08 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-59

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 18 Sep 2020 8:30 AM GMT

    Pinipe Viswarup with HMTV: ఛలో అమలాపురం పై మంత్రి పినిపే విశ్వరూప్ hmtv తో..కామెంట్స్

    తూర్పుగోదావరి..

    మంత్రి పినిపే విశ్వరూప్..

    -ఇది కేవలం రాజకీయకోణంలోనే బిజేపీ ఛలో అమలాపురం పిలుపు

    -మా విచారణలో దోషులు దొరకనందునే సిబిఐ విచారణ కు ఆదేశించాం

    -చర్చిమీద రాళ్ళు రువ్విన ఘటన పోలీసులు ప్రత్యక్షం గా చూసి వాళ్ళను అరెస్టు చేశారు..చట్టప్రకారం చర్యలు తీసుకున్నాం

    -దేవాలయాలపై వరుస ఘటనలు వెనుక కుట్ర వుంది

    -అంతర్వేది రథం దగ్ధం ఘటనపై బిజేపీ ,జనసేన, తెలుగుదేశం డిమాండ్ చేసినట్టుగానే సిబిఐ-విచారణ వేశాం

    -సిబిఐ వారిచేతుల్లోనే వుంది.. విచారణలో వ్యాఖ్యలు చేయకూడదు.. వాస్తవాలు, కుట్ర ఏముందో విచారణలో వెలుగులోకి వస్తాయి

  • 18 Sep 2020 8:26 AM GMT

    Krishna District updates: బాపులపాడు మండలం మల్లవల్లిలో విషాదం..

    కృష్ణాజిల్లా..

    -పొలంలోని బావిలో రాళ్లు తొలగిస్తుండగా మట్టిపెళ్లలు పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు.

    -ఇద్దరు వ్యక్తులు నూజివీడు మండలం పోనసానిపల్లికి చెందిన వారుగా గుర్తింపు..

    -వారిని వెలికి తీసేందుకు చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం

  • 18 Sep 2020 8:25 AM GMT

    Srisailam Tour to Silpa: శ్రీశైలంలో శిల్ప పర్యటన..

    కర్నూలు జిల్లా..

    -శ్రీశైల దేవస్థానం ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

    -శ్రీశైలం గంటా మఠం పుననిర్మాణ పనులను, సచివాలయ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన శిల్ప

    -శ్రీశైల దేవస్థానం లో పనిచేసే సుండి పెంట గ్రామ కార్మికులకు దేవస్థానం బస్సును ప్రారంభించిన శిల్పా...

  • Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక..కె. కన్నబాబు..
    18 Sep 2020 8:22 AM GMT

    Prakasam Barrage updates: ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక..కె. కన్నబాబు..

    విజయవాడ..

     కె. కన్నబాబు విపత్తుల శాఖ కమిషనర్..

    -ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 4,05,736 క్యూసెక్కులు

    -కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :-విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్

    -లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి

    -వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదు

  • Amaravati updates: రామాయపట్నం పోర్టు టెండర్ ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపిన మారిటైమ్ బోర్డు..
    18 Sep 2020 8:17 AM GMT

    Amaravati updates: రామాయపట్నం పోర్టు టెండర్ ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపిన మారిటైమ్ బోర్డు..

    అమరావతి..

    -పోర్టు అభివృద్ధి కోసం చేపట్టనున్న కాంట్రాక్టు విలువను 2169 కోట్లుగా అంచనా

    -5.05 కిలోమీటర్ల బ్రేక్ వాటర్స్ తో పాటు 3 అధునాతన బెర్తుల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని నిర్ణయం

    -15.52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేసి లోతు తవ్వేలా ప్రణాళికలు

    -మొదటి దశ పోర్టు నిర్మాణాన్ని 36 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక

    -ఈ అంశాలతో కూడిన టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూ కు పంపించిన ఏపీ మారిటైమ్ బోర్డు

  • Visakhapatnam updates: నగరంలో మత్తు ఇంజక్ష న్ల కలకలం..
    18 Sep 2020 8:15 AM GMT

    Visakhapatnam updates: నగరంలో మత్తు ఇంజక్ష న్ల కలకలం..

    విశాఖ....

    -మత్తు ఇంజక్షన్లు కలిగిన ఉన్న ముగ్గురు వ్యక్తులు ను అరెస్టు చేసిన పోలీసులు

    -అప్పల రాజు (25), రవికుమార్(84), శ్రీనివాస్ (26)లు అనే వ్యక్తులను అరెస్టు చేసిన 2 టౌన్ పోలీసులు

    -68 మత్తు ఇంజక్షన్లు 5 వేల నగదు రెండు సెల్ ఫోన్లు స్వాదినం

    -నిందితులను రిమాండ్ కు తరలింపు

  • 18 Sep 2020 7:08 AM GMT

    Krishna River updates: ఈరోజు మధ్యాహ్నం నుంచీ కృష్ణానది వరద పెరిగే అవకాశం..

    విజయవాడ..

    -మొత్తం బ్యారేజీ అధికారులను బ్యారేజి వద్ద అందుబాటులో ఉండమని ఆదేశాలు

    -రివర్ కన్సర్వేటర్, ఈఈ, సీఈ, జెఈలు సహా అందరు అధికారులు బ్యారేజి వద్ద వరద నియంత్రణ చర్యలో

    -ఎగువ నుంచీ 4లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండడంతో చర్యలు..

  • Daggubati Purandeswari Comments: రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలపై జరుగుతున్న ధాడులకు నిరసనగా బీజేపీ చలో అమలాపురంకు పిలుపునివ్వండం జరిగింది..పురందేశ్వరీ..
    18 Sep 2020 7:02 AM GMT

    Daggubati Purandeswari Comments: రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలపై జరుగుతున్న ధాడులకు నిరసనగా బీజేపీ చలో అమలాపురంకు పిలుపునివ్వండం జరిగింది..పురందేశ్వరీ..

    ప్రకాశం జిల్లా..

    బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరీ కామెంట్స్..

    ఆలయాలకు ఏవిదంగా రక్షన కల్పిస్దున్నారనే విషయాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా తమలాంటి నాయకులను అరెస్ట్ లు చేయడాన్ని తాము ఖండిస్తున్నాం.

    విస్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు ఎక్కడ దాచారో ఎన్నిచోట్ల తిప్పారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది.

    ఆలయాలకు ప్రభుత్వం రక్షన కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తొంది.

    గుడి, గుడిలో లింగాన్ని మింగిన సామెతలా ప్రభుత్వం ఆలయ భూములను విక్రయించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.

    వీటికి సంభందించిన పూర్తి వివరాలు ప్రజలకు తెలపవలసిన భాద్యత ప్రభుత్వంపై ఉంది.

    విచారణకోసం సిబీఐని వేశాం...రధానికి ఇంన్సూరెన్స్ కల్పిస్తున్నాం..

    కొత్త రథం తయారు చేస్తున్నామనే హామీలు కాకుండా రాష్ట్రంలోని దేవాలయాల రక్షణ విషయంలో ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెలుతుందో ప్రజలకు తెలపడంతోపాటు ఆలయ ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాంగ్ చేస్తున్నాం.

  • 18 Sep 2020 6:57 AM GMT

    Visakha updates: కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అవినీతిలో సీఎం జగన్ కు పోటీ పడుతున్నారు..అయ్యన్నపాత్రుడు..

    విశాఖ..

    టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు కామెంట్స్

    -మంత్రి కుమారుడు ఈశ్వర్ కు, ఇప్పటికే ఈఎస్ ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ 14 కార్తీక్ కానుక ఇచ్చారు

    -ఖరీదైన కారును కానుక గా ఏ 14 కార్తీక్ మంత్రి కుమారుడుకి పుట్టినరోజున సందర్భంగా ఇచ్చారు

    -ఏ సంభంధంతో కార్ ను కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలి

    -ఏ 14 మంత్రి జయరాం కు బినామీ

    -అది పుట్టినరోజు కానుక కాదు...మంత్రికి ఇచ్చిన లంచం

    -కార్మిక శాఖ లో అవినీతి కి పాల్పడింది అచ్చెన్నాయడు కాడు, మంత్రి జయరాం నే

    -నేను ఆధారాలతో చూపిస్తున్నా..నిరూపిస్తా కూడా

    -దీనిపై విచారణ జరిపించాలి..న్యాయస్థానం తో విచారణ చేయించాలి

    -ముఖ్యమంత్రి కి ఆ దమ్ము ఉందా

    -మేము ప్రశ్నిస్తే మమ్మల్ని ముఖ్యమంత్రి బూతులు తిట్టిస్తున్నారు

    -రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ముఖ్యమంత్రి నోరు మెదపరు

    -జగన్ కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి జయరాం తో రాజీనామా చేయించాలి

    -మంత్రి మండలి నుంచి జయరాం ను తప్పించాల్సిందే

    -ముఖ్యమంత్రి ఎలా స్పందింస్తారో చూస్తా..

  • Visakha updates: విశాఖ నుంచి నేరుగా అవినీతి నిరోధక శాఖ కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు..
    18 Sep 2020 6:46 AM GMT

    Visakha updates: విశాఖ నుంచి నేరుగా అవినీతి నిరోధక శాఖ కాల్ సెంటర్ కి ఫోన్ చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు..

    విశాఖ..

    -కార్మిక శాఖ మంత్రి జయరాం, కుమారుడు ఈశ్వర్ కి ...

    ఈ ఎస్ ఐ కుంభకోణంలో 14 వ నిందితుడు కార్తీక్ కార్ బహుకరించిన అంశాన్ని కాల్ సెంటర్ కు తెలిపి   ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు.

Print Article
Next Story
More Stories