Live Updates: ఈరోజు (18 నవంబర్ , 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 18 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
Live Updates
- 18 Nov 2020 7:06 PM IST
Tirumala Updates: టిటిడి పరిపాలనా భవనంలో స్వల్ప పేలుడు కలకలం..
తిరుమల
- మొదటి అంతస్తులో ఈఓ సమావేశం జరుగుతుండగా భారీ శబ్దం వచ్చి పొగలు కమ్ముకోవడంతో పరుగులు తీసిన ఉద్వోగులు
- నిమిషాల వ్యవధిలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.
- అగ్నిమాపక పరికరాలతో కంట్రోల్ చేసిన భద్రతా సిబ్బంది.
- ఫ్యాన్ వైర్లు కాలి పేలుడు శబ్దం వచ్చినట్లు భావిస్తున్న అధికారులు
- పరిశీలిస్తున్న భద్రతా, ఇంజనీరింగ్ అధికారులు
- 18 Nov 2020 7:03 PM IST
Amaravati Updates: నంద్యాల అబ్దుల్ సలాం కుటుంభ కేసులో హైకోర్టులో పిల్ ధాఖలు...
అమరావతి...
* అబ్దుల్ సలాం కేసు సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిల్ ధాఖలు చేసిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఏపీ అధ్యక్షుడు
* కేసులో నిందితులుగా ఉన్న పోలీసులు విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావన్న న్యాయవాది శ్రావణ్ కుమార్
* కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరిన న్యాయవాది శ్రావణ్ కుమార్
- 18 Nov 2020 7:01 PM IST
Guntur District Updates: వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..
గుంటూరు...
- వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
- కొంతకాలంగా రైతుల వద్ద పట్టాదార్ పాస్ బుక్ లకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి రైతులు ఫిర్యాదు చేయడంతో ఆకస్మికంగా తనిఖీ
- వెల్దుర్తి తాహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తనిఖీ నిర్వహించే సమయంలో అందుబాటులో లేని అధికారులు, సిబ్బంది, సిబ్బంది పనితీరుపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపాటు
- 18 Nov 2020 5:51 PM IST
Anantapur District Updatess: ప్రభుత్వం, ఎస్ ఈ సి వ్యక్తిగత ప్రతిష్టకు పోతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు...
అనంతపురం:
* భారతీయ జనతా పార్టీ గతంలోనే ఎన్నికలను రద్దు చేయమని స్పష్టం చేసింది.
* గతంలో తక్కువ కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు...
* కేసులు నమోదు అవుతున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలు అంటున్నారు.
* స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల రూ.వేల కోట్ల నిధులు నష్టపోతాం
* కోర్టు ఆదేశాల మేరకే ఎస్ ఈసీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు.
* జనసేన తో చర్చించి తిరుపతి ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం.
* తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి క్షేత్రస్థాయిలో పని చేస్తోంది.
* మేము ముందు ఉన్నామని టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది
* తిరుపతి ఎన్నికలతో రెండు పార్టీలకు బుద్ధి చెబుతాం.
* గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో అన్ని పార్టీలు బిజెపి వైపు చూస్తున్నాయి.
* కనీస సమయం ఇవ్వకుండా దుబ్బాక ఎన్నికల అనంతరం ఆగమేఘాల మీద గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రకటన రిలీజ్ చేశారు.
* అధికార పార్టీ బిజెపిని చూసి భయపడుతోంది.
* హెచ్ ఎం టీవీ తో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.
- 18 Nov 2020 5:26 PM IST
Vijayawada Updates: సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో మైనర్ బాలుడు మిస్సింగ్ కలకలం..
విజయవాడ
* సెలూన్ కి వెళ్లి ఇంటికి తిరిగిరాని బాలుడు వెంకట కృష్ణ..
* పోలీసులకు పిర్యాదు చేసిన తల్లిదండ్రులు..
* కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు..
- 18 Nov 2020 5:24 PM IST
Guntur District Updates: సత్తెనపల్లి వినయ్ కిడ్నాప్ కేసులో కొత్త కోణం...
గుంటూరు :
* తండ్రి సెల్ ఫోన్ కోనివ్వలేదని కిడ్నాప్ డ్రామా ఆడిన వినయ్
* తండ్రి వద్ద పనిచేస్తున్న గుమస్తాతో కలసి డబ్బులు డిమాండ్ చేసిన వినయ్
- 18 Nov 2020 5:22 PM IST
Tirumala Updates: తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవం...
తిరుమల:
* తిరుమలలో ఈనెల 22న కార్తీక వనభోజన మహోత్సవం
* పాపవినాశనం మార్గంలోని పార్వేట మండపం వద్ద వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేసిన
* పార్వేట మండపంలో శ్రీదేవిభూదేవి సమేతంగా మలయప్పస్వామికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు
* పూజా కైంకర్యాలు అనంతరం కార్తీక వనభోజనం, భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ.
* ఈ సందర్భంగా శ్రీవారి అలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను రద్దు చేసిన టీటీడీ
- 18 Nov 2020 5:14 PM IST
Amaravati Updates: విశాఖ డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ...
అమరావతి...
* తుది నివేదిక సమర్పణకు రెండు వారాలు గడువు కోరిన సీబీఐ
* నిరాకరించిన హైకోర్టు ఈ నెల26 న సమర్పించాలని అదేశం
- 18 Nov 2020 5:12 PM IST
Amaravati Updates: హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్స్ పై విచారణ..
అమరావతి..
* పోలీసుల తరుపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ప్రతిసారీ వాయిదా కోరడం భావ్యం కాదన్న న్యాయమూర్తి రాకేష్ కుమార్
* ఇలా మరలా వాయిదాలు కోరితే అంగీకరించలేమన్న న్యాయవాది రాకేష్ కుమార్
* ఇలా వాయిదాలు కోరితే వాదనలు ముందుకు రావడం లేదన్న న్యాయమూర్తి
* ఈ కేసు ఇంతకాలం విన్న తరువాత సరైన తీర్పు ఇవ్వలేకపోతే రిటైర్మెంట్ తరువాత జీవితాంతం బాధపడాల్సి వస్తుందని భావోద్వేగానికి లోనైన న్యాయమూర్తి రాకేష్ కుమార్
* రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయా అన్న ధర్మాసనం
* రాష్టంలో రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం పరిస్థితులు ఉన్నాయో లేవో అన్న అంశంపై వాదనలు వినిపించాలన్న న్యాయమూర్తి రాకేష్ కుమార్
* తదుపరి విచారణ బుధవారానికి వాయిదా
- 18 Nov 2020 4:59 PM IST
Balineni Srinivasa Reddy Comments: రాష్ట్రంలో ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది...
ప్రకాశం :
- మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి కామెంట్స్..
- రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోన పేరుతో గతంలో ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్...
- ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనుకోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం... మంత్రి బాలినేని.














