Live Updates:ఈరోజు (ఆగస్ట్-18) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

మంగళవారం, 18ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం చతుర్దశి(ఉ.09-34 వరకు) తదుపరి అమావాస్య; ఆశ్లేష నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి మఘ నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-28 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 06-05 నుంచి 07-39 వరకు) దుర్ముహూర్తం ( ఉ.08-17 నుంచి 09-17 వరకు తిరిగి రా,10.55 నుంచి 11.04 వరకు) రాహుకాలం (మ. 03-00 నుంచి 04-30 వరకు) సూర్యోదయం ఉ.5-46 సూర్యాస్తమయం సా.6-21

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
    18 Aug 2020 8:13 AM GMT

    ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

    వరంగల్ అర్బన్: ఎంజిఎం కోవిడ్ వార్డును సందర్శించి నిట్ కు బయలుదేరిన మంత్రి కేటీఆర్.. ఈటెల రాజేందర్.

    లంచ్ అనంతరం జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు

  • కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే  మరణం పట్ల కెసిఆర్ ప్రగాఢ సంతాపం
    18 Aug 2020 8:10 AM GMT

    కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే మరణం పట్ల కెసిఆర్ ప్రగాఢ సంతాపం

    కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు.

    సామాజిక సేవా దృక్పథం, సామాజిక సృహ కలిగిన నాయకుడిగా కృష్ణారెడ్డి ప్రజల అభిమానం సంపాదించారని సీఎం అన్నారు.

    ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. 

  • కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలి: భాగ్యనగర్‌గణేష్‌ ఉత్సవ సమితి
    18 Aug 2020 7:32 AM GMT

    కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలి: భాగ్యనగర్‌గణేష్‌ ఉత్సవ సమితి

    సోమాజీగూడ: భగవంతరావ్..గణేష్ ఉత్సవ కమిటీ సెక్రటరీ..

    వినాయక చవితి పై ఈ రోజు ప్రభుత్వం తో చర్చలు ఉన్నాయి..

    పోలీస్ కమిషనర్ ,ఎండోమెంట్ ఆఫీసర్ స్టేట్ మెంట్ ఇచ్చాక ఇంకా మీటింగ్ ఎందుకు పెట్టలేదని మేము అన్నాం..

    లేదు ఈ రోజు మేము ఇచ్చేదే ఫైనల్ నిర్ణయం అని మంత్రి తలసాని చెప్పారు..

    ఫంక్షన్ హాల్ ,కమ్యూనిటి హాల్,బస్తీ లలో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చు..

    ఇంళ్ళలో విగ్రహాల ఏర్పాటు కు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు..

    కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేయాలి..

    ఎత్తు విషయం లో పోటీపడొద్దు..మీ సొంత వాహానంలో వినాయకున్నితీసుకెళ్లి నిమజ్జనం చేసేలా ఉండాలి..

    మన వల్ల కోవిడ్ వ్యాప్తి చెందిందనే అపవాదు రాకుండా జాగ్రత్తలు పడాలి..

    జిల్లా లో భక్తులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు..

    పోలీసులు భక్తులతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమన్వయం తో ఈ పండగను సాదాసీదాగా జరిగేలా పోలీసులు చూడాలి..

    నిమజ్జనం ఓకే రోజు కాకుండా తమకు అనుకూల మైన రోజు నిమజ్జనం చేసుకోవచ్చు..

    ఉత్సవ కమిటీ తరుపుణ ఈ సారి ఎలాంటి స్వాగత కార్యక్రమాలు కానీ ,ప్రసాదాలు ,మంచి నీటి ఏర్పాట్లు ఎక్కడ ఉండవు..

    వినాయక చవితి తర్వత మళ్ళీ ఓక సారి సమావేశం అయ్యి ..నిమజ్జన ఏర్పాట్ల పై నిర్ణయం తీసుకుంటాం..అప్పటికే సిటీలో ఎన్ని విగ్రహాలు పెట్టారనే సమాచారం వస్తుంది..

    రామరాజు..వీహెచ్ పీ: ప్రభుత్వం నిబంధనలు పెడుతుంది కాబట్టే.. హిందూ సమాజం బయటకు వస్తుంది..

    ఏట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పూజలను అడ్డుకోవద్దు..

    భక్తులు నిర్బయంగా పూజలు చేసుకోవచ్చు..

  • కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి
    18 Aug 2020 7:28 AM GMT

    కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

    నాగర్ కర్నూల్ జిల్లా: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి...

    గత వారం రోజులుగా అనారోగ్యంతో హైద్రాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఎడ్మ కిష్టారెడ్డి..

    నేడు చికిత్స పొందుతూ మృతి..

    ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఎడ్మ కిష్టారెడ్డి.

  • ఎంజీఎంలో కరోనా బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్.
    18 Aug 2020 7:26 AM GMT

    ఎంజీఎంలో కరోనా బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్.

    వరంగల్ అర్బన్: ఎంజీఎం కోవిద్ వార్డులోకి వెళ్లి కరోనా బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్..

    బాధితులకు ధైర్యం చెప్పినా మంత్రి..

    అదనంగా 150 పడకలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి..

    అవసరమైన ఆక్సిజన్ వెంటి లెటర్ ల ఏర్పాటు చెయ్యాలి..

    ప్రత్యేక కోవిద్ ఆసుపత్రిగా కేఏంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి త్వరలో ప్రారంభిస్తాం మంత్రి కేటీఆర్ వెల్లడి...

  • శ్రీపాద ఎల్లం‌పల్లి ప్రాజెక్ట్ లో  భారీగా చేరిన వ‌రదనీరు
    18 Aug 2020 7:24 AM GMT

    శ్రీపాద ఎల్లం‌పల్లి ప్రాజెక్ట్ లో భారీగా చేరిన వ‌రదనీరు

    మంచిర్యాల శ్రీపాద ఎల్లం‌పల్లి ప్రాజెక్ట్ లో బారీగా చేరుతున్నా వరదనీరు...

    ఎనిమిది గెట్లను ఎత్తి వరదనీరు బయటకు వదులుతున్నా అదికారులు

    72,796 క్యూసెక్కుల నీటిని గోదావరి లోకి వదిలిన అదికారులు

    ఇన్ ప్లో 67,621 క్యూసెక్కులు

  • ప్లాస్మా దానానికి ముందుకు రండి: సైబరాబాద్ సీపీ సజ్జనార్
    18 Aug 2020 7:21 AM GMT

    ప్లాస్మా దానానికి ముందుకు రండి: సైబరాబాద్ సీపీ సజ్జనార్

    సైబరాబాద్ సీపీ సజ్జనార్: ప్రజల్లో ప్లాస్మాపై గతంలో అనేక అపోహలు ఉండేవి

    ఈ అపోహలు పోగొట్టేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించాం

    చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ, రాజమౌళి, కీరవాణి వంటివారు సహకరించారు

    కీరవాణి ప్లాస్మా యోధులకోసం ఒక పాట రూపొందించారు

    ప్లాస్మా వివరాలు అన్ని పొందుపరుస్తూ Donateplasma.scsc.in అనే వెబ్సైట్ రూపొందించాం

    అనేక స్వచ్చంద సంస్థలు మాతో కలిసి పనిచేస్తున్నాయి

    చాలామంది యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వలంటీర్లుగా పనిచేస్తున్నారు

    కరోనాను జయించిన రాజమౌళి ప్లాస్మా ఇవ్వటానికి ముందుకు రావటం శుభ పరిణామం

    ఎవరికైనా కరోనా వచ్చినా ఆందోళన చెందవద్దు

    వారికి అండగా ఉండాలి... వారిని కించపర్చొద్దు,...

    ప్లాస్మా దానానికి ముందుకు రండి

    ప్లాస్మా దానం చేసిన పలువురికి ప్రోత్సాహకాలు అందించిన సజ్జనార్, రాజమౌళి

  • జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద
    18 Aug 2020 7:18 AM GMT

    జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద

    మహబూబ్ నగర్ జిల్లా : జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద...

    39 గేట్లు ఎత్తి వేత

    ఇన్ ఫ్లో: 3 లక్షల 20 వేల క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో: 3 లక్షల 21 వేల 180 క్యూసెక్కులు.

    పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం:

    9.657 టీఎంసీ.

    ప్రస్తుత నీట్టి నిల్వ: : 8.611 టీఎంసీ.

    పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.

    ప్రస్తుత నీటి మట్టం: 318.000 మీ.

  • వరంగల్ ముంపు ప్రాంతాలను ప‌రిశీలించిన‌ మంత్రి కే టి ఆర్.
    18 Aug 2020 7:16 AM GMT

    వరంగల్ ముంపు ప్రాంతాలను ప‌రిశీలించిన‌ మంత్రి కే టి ఆర్.

    వంద శాతం పర్మనెంట్ పరిష్కారం చేస్తాం భద్రకాళి బండు కు స్లూస్ అదనంగా ఏర్పాటు చేస్తాం

    కిలో మీటర్ దూరం రోడ్డు నడుచు కుంటు ప్రజలతో మాట్లాడుతూ పరిశీలన చేస్తున్న మంత్రి కే టి ఆర్

    భద్రకాళి బాండ్ లో ఒకే స్లుస్ వలన నీరు నిలిచి పోయిందని

    ఎక్కువ శ్లూస్ ఏర్పాటు చేస్తే వరద నిలిచి పొదని మంత్రి వివరించిన ప్రజలు 

  • నివేదిక ఇవ్వండి : కలెక్టర్
    18 Aug 2020 7:13 AM GMT

    నివేదిక ఇవ్వండి : కలెక్టర్

    భద్రకాళి కి ఎక్కడ నుండి ఎంత వరద వస్తుందో నివేదిక ఇవ్వండి కలెక్టర్ కమిషనర్ కు ఆదేశాలు  బి

    టాంక్ కెపాసిటీ వివరాలు తెలుసుకున్న మంత్రి

    గతం లో 180 సేంటి మీటర్ల పడిన వర్షం ఆధారంగా బాండ్ కు రెండు స్లూసు ఏర్పాటు చేశామని ఈ సారి 270 సెంటి మీటర్ల వర్షం పడిందని కమిషనర్ మంత్రికి వివరించారు

Print Article
Next Story
More Stories