Live Updates: ఈరోజు (16 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 16 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 16 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | పాడ్యమి ఉ. 9-07 తదుపరి విదియ | అనూరాధ నక్షత్రం సా. 5-41 తదుపరి జ్యేష్ఠ | వర్జ్యం రా.10-59 నుంచి 12-29 వరకు | అమృత ఘడియలు ఉ.7-56 నుంచి 9-26 వరకు | దుర్ముహూర్తం మ.12-07 నుంచి 12.52 వరకు తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.06-09 | సూర్యాస్తమయం: సా.05-21
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 16 Nov 2020 7:20 PM IST
West Godavari Updates: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం లో విజిలెన్స్ అధికారుల దాడులు...
పశ్చిమ గోదావరి జిల్లా..
* పాత పోలవరం లోని రైస్ మిల్లులో అక్రమంగా నిలువ ఉంచిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యం , 14 క్వింటాళ్ల ధాన్యం స్వాధీనం.
* మిల్లు యజమాని చోడి పిండి ఆదివిష్ణు పై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు.
- 16 Nov 2020 7:16 PM IST
Rajahmundry Updates: పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వనివ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు...
తూర్పుగోదావరి - రాజమండ్రి
- ఇళ్ల పట్టాలు పంపిణీ విషయంలో చంద్రబాబు కోర్టుకు వెళ్లడం వల్లే జాప్యం
- పేదలందరికీ ఇళ్లస్థలాలు పంపిణీ తర్వాత ఉచితంగా సిఎం జగన్ ఇళ్లు నిర్మించి ఇస్తారు
- రాజమండ్రి సిటీ వైసీపీ ఇన్జార్జి శ్రీఘాకోళపు శివరామసుబ్రహ్మణ్యం
- 16 Nov 2020 7:13 PM IST
Visakha Updates: తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై దోపిడీ...
విశాఖ
* యువలుడ్ని అడ్డగించి దాడిచేసి దోచుకున్న దొంగలు
* 2 తులాల బంగారం, సెల్ ఫోన్ అపహరణ
* దోపిడీ కేసుని గంటల్లోనే చేదించిన క్రైం పోలీసులు
* రౌడీ షీటర్ వాసుపల్లి చిన్నా అలియాస్ ఎలకడు సహా నలుగురు అరెస్ట్
* 2బైక్ లు, 2 తులాల బంగారం, సెల్ ఫోన్ సీజ్
- 16 Nov 2020 7:11 PM IST
Visakha Updates: చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇంట్లో చోరీ కేసును చేదించిన పోలీసులు...
విశాఖ
* చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ ఇంట్లో చోరీ కేసును చేదించిన పోలీసులు
* గాజువాకలో అక్టోబరు 23న దొంగతనం
* శుభ కార్యం సందర్భంగా వినియోగించిన సౌండ్ బాక్స్ లు, రైస్ బ్యాగ్ లు, సిలిండర్ అపహరణ
* చిన్నమ్మలు అలియాస్ భాషా , మరో బాలుడిని పట్టుకున్న పోలీసులు
* 4 వేల విలువ చేసే 2 సౌండ్ బాక్స్ లు, 2 సిలిండర్లు, రైస్ బ్యాగ్ సీజ్
- 16 Nov 2020 7:09 PM IST
Bharat Margani Comments: ఏపీ లో జిల్లాల విభజన...
తూర్పు గోదావరి - రాజమండ్రి
-రాజమండ్రి ఎంపీ భరత్ కామెంట్స్ ...
-ఏపీలో 26 జిల్లాలుగా విభజన
-రంపచోడవరం కేంద్రంగా అరకు పార్లమెంటులో మరో జిల్లా రావొచ్చు
-గోదావరి జిల్లా గా రాజమండ్రి పార్లమెంటు
-పోలీసు కమీషనరేట్ గా రాజమండ్రి అర్భన్ పోలీసు శాఖ
-త్వరలో రాజమండ్రిలో చాళుక్య గోదావరి ఉత్సవాలు
-కేంద్ర ప్రభుత్వ సహకారంతో గోదావరి ఉత్సవాలు నిర్వహణ
-అద్భుతమైన మ్యానిఫెస్టోను సిఎం జగన్ అమలు చేస్తున్నారు
- 16 Nov 2020 6:59 PM IST
Tirumala Updates: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న తమిళనాడు సీఎం పళని స్వామి..
తిరుమల
* స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, రాత్రికి తిరుమలలో బస
* రేపు ఉదయం శ్రీవారి దర్శించుకుంటారు..
- 16 Nov 2020 6:56 PM IST
Krishna District updates: అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు..
కృష్ణాజిల్లా...
* బాపులపాడు మండలం వేలేరు వద్ద అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు
* ఈదర నుంచి పిడిఎస్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
* సుమారు 500కేజీల రేషన్ బియ్యం
* పోలీసుస్టేషన్ కు ఆటో తరలింపు
- 16 Nov 2020 6:02 PM IST
Nellore District Updates: నగరంలో కూలిన ప్రభుత్వ ఆఫీస్ గోడ..
నెల్లూరు:
-పాత మునిసిపల్ ఆఫీస్, జిల్లా వైద్య శాఖ గోడ కూలి నాలుగు ఇళ్లు నెల మట్టం..
-గోడ కులే సమయంలో ఇళ్లలో ఎవరరూ లేకపోవడంతో తప్పిన ప్రాణాపాయం..
-కూలినాలి చేసుకునే వారు కావడంతో ఆస్తి నష్టం..
-గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నింమెక్కి కూలిన గోడ..
-గోడన శిథిలాలను తొలగించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారంటు ఆరోపిస్తున్న బాధితులు..
- 16 Nov 2020 5:59 PM IST
Tirumala-Tirupati Updates: పార్లమెంటు ఉప ఎన్నికలకు సిద్దమౌతున్న టిడిపి..
తిరుపతి..
- గతంలో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ పోటీకి పార్టీ గ్రీన్ సిగ్నల్
- పనబాక లక్ష్మీయే ఉప ఎన్నికల అభ్యర్థిగా టిడిపి శ్రేణులకు పార్టీ అధినేత బాబు సూచన
- ఉప ఎన్నికల గెలుపుకోసం సమాయత్తమవ్వాలని అధినేత దిశానిర్దేశం
- 16 Nov 2020 5:57 PM IST
Amaravati Updates: గోదావరి ఒడ్డున గట్టులు తెగిన ప్రాంతాల పరిశీలనకు టెక్నికల్ అడ్వైజరి కౌన్సిల్ ఏర్పాటు..
అమరావతి....
- గోదావరి ఒడ్డున కోతకు గురవుతున్న, గట్టులు తెగిన ప్రాంతాల పరిశీలనకు టెక్నికల్ అడ్వైజరి కౌన్సిల్ ఏర్పాటు
- ఐదుగురు సబ్యులతో కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- పూర్తి స్థాయిలో పరిశీలించి తగిన పరిష్కారం తెలియజేయాలని సూచించిన ప్రభుత్వం
- ఆరు నెలల్లో తమ సూచనలు తెలపాలని ఆదేశించిన సర్కార్













