Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ స్వతంత్ర దినోత్సవ సందేశం
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Aug 2020 10:17 AM IST
వరంగల్ రూరల్ జిల్లా:
- దామెర మండలం కంఠత్మకూర్ గ్రామలో లెవెల్ బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్న ప్రైవేటు బస్సు వరద తాకిడికి కొట్టుకుపోయింది.
- బస్సులో ఎంతమంది ఉన్నది పూర్తి వివరాలు తెలియాలి.
- 15 Aug 2020 10:17 AM IST
ములుగుజిల్లా:
- తాడ్వాయి మండలం కాటాపూర్ లో ఊరకుక్కల భీభత్సం....
- మాజీ సర్పంచ్ ముజాఫర్
-మేకలదొడ్డిపై అర్దరాత్రిదాడిచేసి 27 మేకలను గొంతుకొరికి చంపిన ఊరకుక్కలు.
- 15 Aug 2020 10:15 AM IST
ములుగు జిల్లా.
- ఏటూరునాగారం మండలం రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద 8.040 మీటర్లకు చేరుకున్న గోదావరి నీటి మట్టం.
- మండలంలోని ముళ్ళకట్ట,మంగపేట పుష్కర ఘాట్ ల వద్ద ఉదృతంగా ప్రవహిస్తూ
- క్రమ క్రమ మంగా పెరుగు తున్న గోదావరి.
- 15 Aug 2020 10:15 AM IST
వరంగల్ రూరల్ జిల్లా .
మూడు రోజులు కురస్తున్న వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి చాలువాగు పైనుండి వరద నీరు పోవడంతో పరకాల భూపాలపల్లి కి రాకపోకలు నిలిచిపోయాయి
- 15 Aug 2020 10:14 AM IST
వరంగల్ అర్బన్.
గత నాలుగు రోజుల నుండి ఎడతెరపిగా కురుస్తున్న వర్షాల వల్ల వరంగల్ మహా నగర పాలక సంస్థలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి వల్ల ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే 9100908402, 9701999688, 9701999659 మొబైల్ నబర్లకు, 7997100300 వాట్స్ అప్ నంబర్ కు సమాచారం పంపినచో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడతాం : వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు, కమిషనర్ పమేలా సత్పతి
- 15 Aug 2020 10:13 AM IST
వరంగల్ అర్బన్:
- గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు అత్యవసర సేవల నిమిత్తం GWMC హెల్ప్ లైన్ నెంబర్ rains..1800 425 1980.
- వరంగల్ అర్బన్ కలెక్టర్ హెల్ప్ లైన్ నెంబర్ 7997100300
- 15 Aug 2020 10:13 AM IST
కరీంనగర్ :
- చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుంకే రవి శంకర్
- 15 Aug 2020 10:12 AM IST
పెద్దపల్లి జిల్లా:
- మంథని పట్టణంలో 74 వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పైన జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
- 15 Aug 2020 10:12 AM IST
హైదరాబాద్:
- తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగురవేసి టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవ రావు
- హాజరైన మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు, మాజీ స్పీకర్ మధుసూదనా చారి ఇతర నేతలు
- 15 Aug 2020 10:11 AM IST
నిజామాబాద్ :
- అర్బన్ లోని ఎమ్మెల్యే క్యామ్ప్ ఆఫీస్ లో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా.



