Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 15 Aug 2020 4:44 AM GMT

    స్వాతంత్ర్య దినోత్సవ సందేశం లో సీఎం జగన్...

    అమరావతి:

    - మేనిఫెస్టో లోని అంశాల్లో చాలావరకు 14 నెలల్లో అమలు చేసాం.

    - మొత్తం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు 129

    - ఇప్పటికే 83 హామీలు అమలు చేసాం.

    - అమలుకోసం తేదీలు ఖరారు చేసి సిద్ధం గా ఉన్న హామీలు 30.

    - దీనితో 90 శాతం హామీలు ఆమలు అయ్యాయి, అమలుకు సిద్ధం గా ఉన్నాయి.

    - ఇంకా అమలు చేయాల్సిన పథకాలు కేవలం 16 మాత్రమే.

    - వీటికి తోడు 39 ఇవ్వని హామీలు కూడా ఈ ఏడాది అమలు చేశాము.

  • 15 Aug 2020 4:43 AM GMT

    స్వాతంత్ర్య దినోత్సవ సందేశం లో సీఎం జగన్...

    అమరావతి:

    - పార్లమెంట్ సాక్షి గా కేంద్రప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా అమలు చేయాలని గట్టిగా అడుగుతాం.

    - కేంద్రానికి ఇతర పార్టీ ల మద్దతు అవసరం లేదు. కాబట్టి హోదా కేంద్రం ఇప్పటికిప్పుడు ఇచ్చే అవకాశం కనిపించడంలేదు.

    - భవిష్యత్తు లో అయిన పరిస్థితులు మారి , కేంద్రం మనసు మారి ప్రత్యేక హోదా ఇస్తుంది అనుకుంటున్నాం అప్పటి వరకు కేంద్రం ను డిమాండ్ చేస్తూనే ఉంటాము.

  • 15 Aug 2020 4:42 AM GMT

    ధవళేశ్వరం దిగువకు భారీగా విడుదల అవుతోన్న వరద నీరు..

    తూర్పుగోదావరి :

    - కోనసీమలో పొంగిపొర్లుతోన్న గోదావరి ఉపనదులు గౌతమి, వృధ్ధ గౌతమి, వశిష్ట, వైనతేయ..

    - మొదలయిన పి.గన్నవరం మం. లంక గ్రామాల ప్రజల రవాణా కష్టాలు..

    - ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న గోదావరిలో నాటు పడవలపై రాకపోకలు సాగిస్తోన్న లంక గ్రామాల ప్రజలు..

    - నాటు పడవలపై గోదావరి దాటుతోన్న జి. పెదపూడిలంక, ఊడిమూడిలంక, బూరుగులంక గ్రామాల ప్రజలు..

  • 15 Aug 2020 4:41 AM GMT

    తూర్పుగోదావరి:

    - రామచంద్రపురం ఆర్డీఓ కార్యలయం వద్ద 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న

    - రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ఙ

    - జాతీయ జెండా ను ఆవిష్కరించిన మంత్రి వేణుగోపాలకృష్ణ

  • 15 Aug 2020 4:39 AM GMT

    ప్రకాశం జిల్లా:

    - ఒంగోలు లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఇంచార్జ్ మినిస్టర్ శ్రీ పిన్నెల్లి విశ్వరూప్ గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ గారు మరియు జిల్లా SP శ్రీ సిద్ధార్థ్ కౌశల్ గారు

  • 15 Aug 2020 4:39 AM GMT

    విజయనగరం:

    - విజయనగరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్...

    - పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ బి.రాజకుమారి, ప్రజా ప్రతినిధులు, అధికారులు....

    - సాయుద దళాలు నుండి గౌరవ వందనం చేసిన ఇంచార్జ్ మంత్రి

    - కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టన్స్ పాటిస్తూ ఏర్పాట్లు,

  • 15 Aug 2020 4:38 AM GMT

    అనంతపురం:

    - పెరేడ్ గ్రౌండ్లో జెండా వందనం గావించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్నారాయణ.

    - కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గంధం చంద్రుడు ఎస్పీ సత్య ఏసుబాబు ఎంపీలు తలారి రంగయ్య గోరంట్ల మాధవ్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, అధికారుల, ప్రజాప్రతినిధులు

  • 15 Aug 2020 4:38 AM GMT

    కడప పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...

    కడప :

    - జాతీయ జండాను ఎగురవేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిములపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాష...

    - పోలీసు గౌరవ వందనం స్వీకరించిన ఇంచార్జ్ మంత్రి , డిప్యూటీ సీఎం అంజాద్ బాషా..

    - పాల్గొన్న చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులు...

    - జిల్లాలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై సందేశం వినిపించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి...

    - కరోనాపై యుద్ధం లో కీలకమైన పాత్ర పోషించిన కరోనా వారియర్స్, మునిసిపల్ కార్మికులను సన్మానించనున్న మంత్రులు...

  • 15 Aug 2020 4:37 AM GMT

    తూ"గో:

    - రామచంద్రపురం ఆర్డీఓ కార్యలయం వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ఙ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరణ

  • 15 Aug 2020 4:37 AM GMT

    తూర్పుగోదావరి :

    - రామచంద్రపురం ఆర్ డి వో కార్యాలయంలో 74 వ స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు..

    - హాజరైన బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి వేణు..

Print Article
Next Story
More Stories