Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Aug 2020 8:36 AM GMT
ఏపీ వాతావరణ సమాచారం
విశాఖ: ఉత్తర ఒడిశా తీరం అనుకోని ఉన్న గ్యాంజిటిక్ పశ్చామ బెంగాల్ వద్ద కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనం గా మరి అదే ప్రాంతం లో కొనసాగుతుంది.
దీని ప్రభావం తో ఉత్తర కోస్తా లో ఉరుములు, మెరుపులు తో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం.
తూర్పు గోదావరి,పశ్చామ గోదావరి జిల్లాలో ఒకటి,రెండు చోట్లా బారి నుంచి అతి బారి వర్షాలు కురిసే అవకాశం.
దక్షిణ కోస్తా,రాయలసీమ లో ఉరుములు తో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం,ఒకటి రెండు చోట్లా బారి వర్షాలు కురిసే అవకాశం.
ఆంద్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటలర్ల వేగం తో ఈదురు గాలులు విచే అవకాశం.
ఈరోజు ,రేపు మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దు అని వాతావరణ శాఖ అధికారులు సూచన.
- 15 Aug 2020 6:36 AM GMT
అంబేద్కర్ చిత్రపటానికి మెమోరాండం సమర్పించిన టీడీపీ నేతలు
విజయవాడ: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి మెమోరాండం సమర్పించిన టీడీపీ నేతలు
టీడీపీ ఎంఎల్సీ బచ్చుల అర్జునుడు
అందరికీ 74 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
జగన్మోహన్ రెడ్డి దళితులకు చేసిన మోసానికి నల్ల జెండాలతో నిరసన
దళితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంది.
దళిత మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి...
దళిత డాక్టర్ కి బట్టలూడదీసి అవమానించింది ఈ ప్రభుత్వమే
రాష్ట్రంలో దళితులపై దాడులు అరికట్టాలి
సాయంత్రం నాలుగు గంటల లోపు అంబేద్కర్ చిత్రపటాన్నికి మళ్లీ మెమోరండం సమర్పిస్తాం.
రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రభుత్వం గౌరవించడం లేదు..
ప్రభుత్వం దుర్మార్గపు చర్యలను నిలదీస్తే కేసులు పెడుతున్నారు
రాష్ట్రంలో రాజా రెడ్డి రాజ్యాన్ని అవలంబిస్తున్నారు...
- 15 Aug 2020 6:33 AM GMT
దళితులపై దాడులకు నిరసనగా టీడీపీ నేతల దీక్ష
గుంటూరు: రాష్ట్రంలో దళితుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా దీక్ష చేపట్టిన జిల్లా టిడిపి శ్రేణులు.
జిల్లా టిడిపి కార్యాలయంలో చేపట్టిన దీక్షలలో పాల్గొన్న మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు,ఆలపాటి రాజేంద్రప్రసాద్.
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కామెంట్స్...
జగన్ అధికారంలోకి రావడానికి దళితులు తీవ్ర కృషి చేశారు...
దళితులను కొట్టే తిట్టే హక్కు తనకే ఉందనే విధంగా జగన్ వ్యవహరించడం బాధాకరం.
దాడులుకు పాల్పడే వారిని వైసిపి నాయకులు సమర్దించడం సిగ్గుచేటు.
ఎక్కడా జరగని దాడులు ధమనఖాండ లు దళితుల పై జరుగుతున్నాయి.
శిరోముండనం బాధితుడి లేఖ పై రాష్ట్రపతి స్పందిస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టిపట్టనట్టు వ్యవహరిస్తుంది.
కమీషన్ విచారణ పూర్తయ్యే వరకు జస్టిస్ ఈశ్వరయ్య,నాగార్జున రెడ్డికి,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి పదవులలో కొనసాగే అర్హత లేదు.
- 15 Aug 2020 6:31 AM GMT
పొంగి పారుతున్న వాగులు వంకలు
తూర్పుగోదావరి- కాకినాడ: చింతూరు వద్ద శబరి,గోదావరి నదులు కలయిక తో బారీగా వరద పెరగడంతో , విలీన మండలాల్లో లోతట్టు గిరిజన గ్రామాలను చుట్టు ముట్టిన వరదనీరు
చత్తీస్గడ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చట్టి వద్ద, వీరపురం, వాగు రహదారి పై ప్రవహించడంతో మూడూ రాష్ట్రాలాకు నిలిచిన రాకపోకలు...
చిoతూరు.. కూనవరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న సబరి గోదావరి నదులు. పొంగి పారుతున్న వాగులు వంకలు. రోడ్డు ఎక్కిన వరద నీరు
- 15 Aug 2020 6:28 AM GMT
వైరా, జగ్గయ్యపేట లకు నిలిచిపోయిన రాకపోకలు
కృష్ణాజిల్లా: వత్సవాయి మండలం లింగాల వద్ద బ్రిడ్జి పై ప్రవహిస్తున్న మున్నేరు వరద నీరు
వైరా, జగ్గయ్యపేట లకు నిలిచిపోయిన రాకపోకలు
- 15 Aug 2020 6:27 AM GMT
గుంటూరు టీడీపీ ఆఫీస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
గుంటూరు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో... జాతీయ జండాను ఆవిష్కరించిన మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు,ఆలపాటి రాజేంద్రప్రసాద్,జిల్లా నాయకులు.
- 15 Aug 2020 4:48 AM GMT
అమరావతి:
స్వాతంత్ర్య దినోత్సవ సందేశం లో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...
మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి
రాష్ట్రవిభజన గాయాలు మానాలన్నా అలాంటి గాయాలు మరల తగలకూడ దనా రాష్ట్రం లో మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి....సీఎం జగన్
అందుకే వికేంద్రికరణ సరైన నిర్ణయం అని నిర్ణయించాము.
మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా మూడు రాజధానులు బిల్లు ను చట్టంగా మార్చాము.
త్వరలో విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూల్ కేంద్రం గా న్యాయ రాజధానికి పునాదులు వేస్తాం.
- 15 Aug 2020 4:48 AM GMT
అనంతపురం:
- టిడిపి కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
- 15 Aug 2020 4:47 AM GMT
కర్నూలు.
- కర్నూలు లో ఘనంగా జరుపుకున్న 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
- 74 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఇంచార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం, అధికారులు, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.
- కొండారెడ్డి బూర్జు పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జండాను ఎగురవేసిన మంత్రులు, కలెక్టర్, ఎస్పీ...
- అనంతరం గౌరవ వందనం స్వీకరించిన మంత్రులు, అధికారులు...
- 15 Aug 2020 4:46 AM GMT
చిత్తూరు పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
- తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
- టిడిడి పరిపాలనా భవనంలో జాతీయ జెండాను ఎగురవేసిన టిటిడి ఈఓ ఎకె సింఘాల్
- తిరుపతి పెరేడ్ గ్రౌండ్ లో జెండాను ఆవిష్కరించిన ఎస్పీ రమేష్ రెడ్డి

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire









