Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • స్వర్ణాప్యాలెస్  ఘ‌ట‌నపై స్పందించిన రమేష్ హాస్పిటల్స్ అధినేత
    15 Aug 2020 9:16 AM GMT

    స్వర్ణాప్యాలెస్ ఘ‌ట‌నపై స్పందించిన రమేష్ హాస్పిటల్స్ అధినేత

    విజయవాడ: **రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు ఫోన్ కామెంట్స్**

    స్వర్ణాప్యాలెస్ లో ఘటన నేపధ్యంలో నేను మీ ముందుకురావాల్సి వచ్చింది.

    రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నెలలుగా కోవిడ్ పై శ్రమిస్తున్నాయి.

    కోవిడ్ సమయంలో ప్రైవేట్ పబ్లిక్ రంగంలో ఉన్న వైద్య సంస్థలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.

    శాస్ర్తీయ వైద్యలోపంతో పాట ఆర్.టి. పీసీఆర్ 30శాతం మందికి ఫాల్స్ నెగెటివ్ రావడం వలనే ఈ వ్యాధి పక్కవారికి సోకడానికి దోహదపడింది.

    ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని హాస్పటల్స్ గానే సామాజిక భాద్యతగా భావించి వైద్యం చేయడానికి ముందుకు వచ్చాం

    కోవిడ్ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో జిల్లా కలెక్టర్ ఆసుపత్రి యాజమాన్యులతో చర్చలు జరిపి కోవిడ్ పేషెంట్లను తిప్పి పంపవద్దని సూచించారు.

    ఈ నేపధ్యంలోనే మేము కోవిడ్ సెంటర్స్ ను తెరిచాము

    విజయవాడ యంజి రోడ్, ఒంగోలు లోని రమేష్ సంఘమిత్ర హాస్పటల్ లో కోవిడ్ బెడ్ లు ఏర్పాటు చేశాం

    యంజి రోడ్ లోని హాస్పటల్ ను మూడు నెలల క్రితం డియం హెచ్ వో తనిఖీ చేసి ముందుకు వెళ్లవచ్చని చెప్పారు.

    పదిరోజుల్లో మా హాస్పటల్ లో బెడ్లు మొత్తం నిండిపోయాయి.

    మాకు వచ్చిన కేసుల్లో పది శాతం మందికి మాత్రమే చికిత్స అందించగలుగుతున్నాము...మిగతా 90 మందిని వేరే హాస్పటల్ కు వెళ్లాల్సిందిగా చెబుతున్నాము

    డిశ్చార్జ్ అయిన కూడా వెళ్లేందుకు కొంతమంది భయపడుతున్నారు.

    దీంతో వీరితో పాటు మైల్డ్ కరోనా యాక్టివ్ అయిన వారిని రెండు, మూడు రోజుల పాటు హోటల్స్ లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నాము

    ఇందుకు కలెక్టర్, డియంహెచ్ వో వారి అనుమతి కూడా తీసుకున్నాం

    వీరిలో ఎవరికైనా అత్యవసరం అయితే తమ అంబులెన్స్ లోనే యంజి రోడ్ లోని ఆసుపత్రికి తరలిస్తున్నాం

    అనేక మంది ప్రముఖులు తమ ఆసుపత్రిలో చికిత్స పొందారు

    32ఏళ్ల రమేష్ హాస్సటల్ ఆధ్వర్యంలో 10లక్షల మంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి వైద్య సేవలు అందించాం

    ఆరోగ్య శ్రీ ద్వారా కూడా 70శాతం వైద్య సేవలు అందించాం

    రమేష్ హాస్సటల్ లోఉండే సిబ్బంది టాలెంట్ మీద ఆధారపడిన వారినే తీసుకుంటాం

    వైద్య చికిత్సలో ఎటువంటి కులానికి, మతానికి, వేరే ఏ అంశాన్ని కానీ పరిగణలోకి తీసుకోము

    కొంతమంది ప్రజా ప్రతినిధులు రమేష్ బాబు అనే నా పేరులోని బాబు తీసివేసి రమేష్ చౌదరి అని మీడియాలో చెప్పడాన్ని నేను గమనించాను

    వైద్యం అనేది ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని పదవులు, వ్యాపారాభివృద్ది చేయడం కాదు.

    వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని నా ఉద్దేశ్యం

    కళకి, వైద్యానికి కులాన్ని అంటగట్టడం సరికాదని భావిస్తున్నాను

    స్వర్ణాప్యాలెస్ లో కరోనాతో క్రిటికల్ స్టేజ్ కు చేరుకున్న వారిని కూడా చికిత్స చేసి పంపాము

    రికవరీ అవుతున్న పేషెంట్లు దురదృష్టం కొద్దీ ఈ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను ఆ బాధ నుంచి ఇప్పటివరకు కోలుకోలేదు

    స్వర్ణాప్యాలెస్ లో ప్రమాదానికి మాకొచ్చిన సమాచారం ప్రకారం రిసెప్షన్, కంప్యూటర్ రూమ్ లో ఉన్న షార్ట్ సర్య్కూట్ వలన మంటలు వ్యాప్తి చెందాయి

    ఫైర్, పోలీసు, అలాగే రమేష్ హాస్పటల్ నుంచి వెళ్లని రెస్క్యూ టీమ్ 20మందిని మా ఆసుపత్రికి తరలించారు.

    అప్పటి నుంచి గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలు రమేష్ హాస్పటల్ ఫ్యామిలీలోని 2500 కుటుంబాలను, మా మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంచిన కొన్నిలక్షల మంది ఫేషెంట్లను ఒకవిధమైన కన్ ఫ్యూజన్ కు గురిచేస్తున్నారు

    30 సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్ డాక్టర్లు డాక్టర్ సుదర్శన్, డాక్టర్ రాజగోపాల్, మేనేజర్ ఆన్ డ్యూటీ వెంకట్ ని గత నాలుగు రోజులుగా నిర్భంధించారు.

    స్వర్ణాప్యాలెస్ పేరు పొందిన స్టార్ హోటల్. రెండు దశాబ్ధాలుగా దీనికి మంచి పేరుంది.

    ఈ హోటల్ ను ఇంటర్ నేషనల్ పేషెంట్స్ కు క్వారంటైన్ సెంటర్ గా కలెక్టర్ గారు ఎంపిక చేశారని విన్నాను

    అందువలనే డియం హెచ్ వో కలెక్టర్ గారి అనుమతితో స్వర్ణాప్యాలెస్ ని రమేష్ హాస్పటల్ కు కోవిడ్ మెడికల్ సర్వీసెస్ సేవలు అందించేందుకు అనుమతి పొందాం

    కొంతమంది ఉన్నతాధికారులను ఆ హోటల్ కు కలెక్టర్ చికిత్స కోసం రిఫర్ చేయడం జరిగింది.

    హోటల్ వారితో మా ఒప్పందం ఏమిటంటే హౌస్ కీపింగ్, హోటల్ మెయిన్ టెన్స్ గానీ, ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కానీ, యధాతధంగా హోటల్ వారు

    మెయిన్ టెయిన్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాం

    పేషెంట్ మెడికల్ సర్వీసెస్ కి అవసరమైన డాక్టర్లు, నర్సులు, ఎమర్జెన్సీ షిప్టింగ్ 24-7 అంబులెన్స్ సర్వీసులు, రమేష్ హాస్పటల్ బాధ్యత

    వహిస్తుందంటూ ఒప్పందం కుదిరింది.

    దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఉంది.

    రమేష్ హాస్పటల్స్ కి, ప్రజలకు జిల్లా యంత్రాంగం నుంచి కొంత సమాచారం రావాల్సి ఉంది.

    స్వర్ణాప్యాలెస్ కి మున్సిపల్ అధారిటీస్ పర్మిషన్ గానీ, ఫైర్ పర్మిషన్ ఉన్నాయా...లేవా...

    ఫైర్ పర్మిషన్ గానీ ఉంటే ఆ పరికరాలు ఫైర్ యాక్సిడెంట్ సమయంలో సక్రమంగా పనిచేశాయా...లేదా

    షార్ట్ సర్య్కూట్ ఎలా సంభవించింది..అందులో ఏదైనా కన్స్ పెన్సరీ లేదా శవటాస్ భావిస్తున్నారా

    సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఫైర్ యాక్సిడెంట్ సమయంలో అక్కడ లేకపోయిన డాక్టర్ సుదర్శన్, డాక్టర్ రాజ్ గోపాల్ ను ఎందుకు

    నిర్భంధించారు. ఎందుకు రకరకాల పుకార్లు పుట్టిస్తున్నారు.

    ఎందుకు హోటల్ మేనేజ్ మెంట్ లోని నైట్ షిప్ట్ లోని ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా రమేష్ హాస్పటల్ లోని సిబ్బందిని విచారణకు

    అవసరమైనప్పుడు పిలిపించకుండా ఎందుకు రిమాండ్ కు పంపారు

    రమేష్ హాస్పటల్ అధినేత ఆదివారం సుమారు ఉదయం ఐదు గంటలకు ప్రమాదం సంభవించినప్పుడు కలెక్టర్ గారు, మినిస్టర్స్ రెండు గంటల

    పాటు నేను, సుదర్శన్, రాజగోపాల్ గారు కలెక్టర్ గారి ఆఫీసులో విచారణకు హాజరయ్యాము

    ఆ తరువాత డాక్టర్ రాజగాపాల్, సుదర్శన్ లను నిర్భింధించారని తెలిసింది.

    లీగల్ అడ్వజర్స్ ఫోన్ చేసి ఈ విచారణ నిస్పక్షపాతంగా జరగడంలేదనిపిస్తుంది. మీరిచ్చే రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడంలేదు, మీరు

    మీడియాతో ఏమీ మాట్లాడవద్దని చెప్పడంతో నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను

    నన్ను అధికారులు మళ్లీ విచారణకు పిలిచేవరకు వేచిఉండమని లీగల్ అడ్వజర్ చెప్పడం జరిగింది.

    నిష్పక్షపాతంగా పేరున్న టీవీ ఛానెల్స్ వారు కూడా రమేష్ హాస్పటల్స్ ఆగడాలు అంటూ సెన్సేషనల్ స్ర్కోలింగ్స్ హాస్పటల్ ఇమేజ్ ను దెబ్ తీస్తూ ఇచ్చారు. ఇది చాలా అన్యాయం

    పేషెంట్స్ సేఫ్టీ, ఎంప్లాయీస్ సేప్టీ, సెంటరాఫ్ ఫిజిఎక్స్ లెన్స్ మూడు ప్రధాన అంశాలతో 32 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ..2500 కుటుంబాలు ఆధారపడిన రమేష్ హాస్పటల్స్ ను ఈ విధంగా కించపరడం, ఇమేజ్ ను తగ్గిస్తూ వార్తలు ప్రయారం చేయడం సరికాదు

    రమేష్ హాస్పటల్స్ కు కోవిడ్ సెంటర్ లను నడిపేందుకు అన్ని అనుమతులు ఉన్నాయి

    మా సీఈవో రాజగోపాల్, డియం హెచ్ వో రమేష్, కలెక్టర్ వారి మెసేజెస్, డాక్యుమెంట్స్ ని గత రెండు నెలలుగా పరిశీలిస్తే అన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి

    చార్జీల విషయానికొస్తే మా బిల్లింగ్ సెక్షన్ కు ఖచ్చితమైన మార్గదర్శకాలను యజమాన్యానికి ఇవ్వడం జరిగింది

    ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా పాటించాలని తమ సిబ్బందికి ఆదేశించాం

    మా సిబ్బందికి కూడా నర్సులకు, డాక్టర్స్ కి మూడు రెట్లు అధికంగా జీతాలు చెల్లిస్తున్నాం

    నిష్పక్షపాతంగా న్యాయవిచారణకు రమేష్ హాస్పటల్ సిద్దంగా ఉంది.

    డియంహెచ్ వో పర్మిషన్ తో ప్లాస్మా థెరపీని కూడా ఎంతోమంది రోగులకు అందజేశాం

    2012లో ఆంధ్రప్రదేశ్ లో తొలి ఫైర్ ఎన్ ఓ సి పొందిన మా విజయవాడ హాస్పటల్ మాదే

    అదే విధంగా పేషెంట్స్ సేఫ్టీలో ఇంటర్నేషనల్ స్టాండర్స్ ప్రామాణికంగా జెసిఎ సర్టిపికేషన్ పొందిన ఏకైక ఆసుపత్రి మాది

  • 15 Aug 2020 9:11 AM GMT

    తూర్పు గోదావరి:కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

  • శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
    15 Aug 2020 9:07 AM GMT

    శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

    శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు

    నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు జరుగనున్నాయి

    టిటిడిలోని అన్ని విభాగాలు సన్నద్ధమవుతున్నాయు

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌ నిబంధనల‌కు లోబడి ఈ ఉత్సవాల‌ నిర్వహణ ఉంటుంది

    టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌.

  • స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో   గంటా శ్రీ‌నివాస్‌
    15 Aug 2020 9:05 AM GMT

    స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో గంటా శ్రీ‌నివాస్‌

    విశాఖ: టీడీపీకి గుడ్ బై చెప్పే సంకేతాలిస్తున్న ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

    స్వాతంత్ర్య దినోవత్స శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీని పక్కన పెట్టిన గంటా

    పార్టీ పేరును కూడా ప్రస్తావించని గంటా

    ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పదవిని కూడా ప్రస్తావిచకుండా ఇండిపెండెన్స్ డే విషెస్

    పార్టీ నేతలు, కార్యకర్తలను ప్రస్తావించకుండా మిత్రులు, శ్రేయోభిలాషులుకు శుభాకాంక్షలు తెలిపిన గంటా

    కేవలం గంటా శ్రీనివాసరావు గా మాత్రమే విష్ చేసిన గంటా

    రాజకీయవర్గాల్లో చర్చానీయాంశంగా మారిన గంటా వైఖరి

    టీడీపీకి గుడ్ బై చెప్పే సంకేతాలేనని విశ్లేషణ

    వైసీపీలో చేరేందుకు లైన్ క్లియర్ చేుసుకున్నారని గంటాపై పొలిటికల్ వర్గాల్లో టాక్

  • స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో  నారా లోకేష్‌
    15 Aug 2020 8:58 AM GMT

    స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో నారా లోకేష్‌

    దేశ ప్రజలకు నారా లోకేష్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

    హైదరాబాద్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన నారా లోకేష్

    మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన లోకేష్

    లోకేష్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్న తనయుడు దేవాన్ష్

  • జ‌గ‌న్ స‌ర్కార్‌పై సోమువీర్రాజు ఫైర్‌
    15 Aug 2020 8:55 AM GMT

    జ‌గ‌న్ స‌ర్కార్‌పై సోమువీర్రాజు ఫైర్‌

    అమరావతి: దశాబ్దాల కల అయోధ్య లోని రామాలయం యొక్క శంకుస్థాపన.

    -ఈ కార్యక్రమం ప్రపంచంలోని 250 చానెల్స్ ప్రత్యక్ష ప్రచారం చేసిన నేపధ్యంలో కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క TTD లో ప్రచారం చెయ్యక పోవడం అంటే, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తలుచుకుంటే మనసుకి బాధ కలిగించే అంశం.

    దీనిపై బిజెపి లో వున్న అనేక మంది ప్రస్తావించారు. యమిని గారి మీదే కేస్ పెట్టడం మంచిది కాదు.

    ఈ అంశాన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి: బిజేపి ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు ట్విట్

  • మచిలీపట్నంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
    15 Aug 2020 8:51 AM GMT

    మచిలీపట్నంలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు

    కృష్ణా జిల్లా :  జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఘనంగా 75వ స్వాతంత్ర వేడుకలు

    - జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    - జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

    - బందర్ పోర్ట్ నిర్మాణంతో కృష్ణాజిల్లా దిశాదశ మార్పు

    *రూ.4682 కోట్ల రూపాయలతో మూడు బెర్త్‌ల నిర్మాణం*

    - జిల్లాలో ఉపాధిహామీ కింద 100 రోజుల్లో రికార్డు స్థాయిలో పేదలకు కోటి పనిదినాలు

    - జిల్లా వ్యాప్తంగా 3 లక్షల మంది పేదలకు ఇళ్ళస్థలాల పంపిణీ

    - మచిలీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు

    - జిల్లాలో ప్రతి నెలా 5.04 లక్షల మందికి రూ.122 కోట్ల పెన్షన్ పంపిణీ

    - జగనన్న పచ్చతోరణం కింద జిల్లాలో రోడ్లకిరువైపులా 1066 కి.మీ. మేర 4 లక్షలకు పైగా మొక్కలు

    - జిల్లాలో 1314 హౌసింగ్ కాలనీల లేఅవుట్లలో 2 లక్షల మొక్కలు

    - హార్టికల్చర్ ప్లాంటేషన్ క్రింద 1200 ఎకరాల్లో 2 లక్షల మొక్కలు

    : *మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్ది

  • గాంధీని చంపిన వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారు: కే.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
    15 Aug 2020 8:50 AM GMT

    గాంధీని చంపిన వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారు: కే.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

     బీజేపీ , సంఘ్ పరివార్ శక్తులు దేశానికి ద్రోహం చేశారు.

    లౌకిక వాదాన్ని , ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది.

    మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని కాపాడుకుంటాం - బి.వి. రాఘవులు సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు:

    గాంధీని చంపిన వాళ్ళు దేశాన్ని పాలిస్తున్నారు.

    ఆగస్టు 15కు ఉనం ప్రాబల్యాన్ని తగ్గించి ఆగస్టు 5 కు ఇస్తున్నారు.

    ఆర్ఎస్ఎస్ తో కలిసి మోడీ కుట్రలు చేస్తున్నారు.

    పన్నుల సరళీకరణ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటారు.- కే.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి 

  • నూటికి నూరు శాతం అమరావతే రాష్ట్ర రాజధాని: ఎంపీ రఘురామకృష్ణంరాజు
    15 Aug 2020 8:46 AM GMT

    నూటికి నూరు శాతం అమరావతే రాష్ట్ర రాజధాని: ఎంపీ రఘురామకృష్ణంరాజు

    నూటికి నూరు శాతం అమరావతే రాష్ట్ర రాజధాని అని ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేసారు 

    రాజీనామా విషయంలో నన్ను విసిగించవద్దని చెప్పినా వినిపించుకోవడం లేదు

    నారాయణ స్వామి నా మీద చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నా. ఎంపి సీటుకోసం నేను ఎవరినీ ప్రాధేయపడలేదు. నారాయణ స్వామి సంయమనం పాటించాలి

    రాష్ట్రంలో తెలుగు భాషకు గ్రహణం పట్టింది.

    తెలుగుభాష ప్రేమికులు రాష్ట్రంలో తలదించుకోవాల్సిన రోజులు ఉన్నాయి.

    ప్రముఖ తెలుగు పత్రికలో న్యాయమూర్తుల చేస్తున్నారని వార్త వచ్చింది.ఫోన్లు ట్యాప్ చేయడం వల్ల ప్రభుత్వం చిక్కులలో పడుతుంది. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుంది. మా ఫోన్ లు కూడా ట్యాప్ చేస్తున్నారు.

    హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించకముందే రాష్ట్రప్రభుత్వమే విచారణకు ఆదేశించాలి.

    సీఎం కు తెలిసి జరగకపోయినా , ఆయన అభిమానం సంపాదించడానికి కొంతమంది అధికారులు చేస్తున్నారు . సీఎం గారు మీకు తెలియకుండా మీ కోటరిలోని అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారు.

    కోర్టులు శిక్షించకముందే ప్రభుత్వమే విచారణ జరిపి శిక్షించాలి. న్యాయ స్థానాల మీద నిఘా పెట్టకుండా , వారి ఇచ్చే తీర్పులు గౌరవించాలి.

    రాజధాని అంశం కోర్టులో పెండింగు లో ఉండగా రాజధాని తరలింపు ప్రకటన , శంకుస్థాపన ప్రకటన చేయడం సరికాదు - రఘురామకృష్ణంరాజు, నర్సాపురం ఎంపి

  • ఏపీ హోంమంత్రి సుచరిత ప్రెస్ మీట్
    15 Aug 2020 8:41 AM GMT

    ఏపీ హోంమంత్రి సుచరిత ప్రెస్ మీట్

    నెల్లూరు : ఏపీ హోంమంత్రి సుచరిత ప్రెస్ మీట్ కామెంట్స్

    - పోలీస్ శాఖలో నెల్లూరుకు ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడం అభినందనీయం

    - నేరాల సంఖ్య చాలా తగ్గుముఖం పట్టడం, గ్రీవెన్స్ లో ప్రజల సమస్యలు పరిష్కారం మంచి పరిణామం

    - 2018లో కేసులు 714 ఉంటే 2019లో 539, 2020లో ఇప్పటి వరకు 349 కేసులు ఉన్నాయి.

    - చోరీల ఘటనల్లో రికవరీ రేటు కూడా 42 శాతం ఉంది.

    - దిశ పోలీస్ స్టేషన్ ద్వారా మహిళల రక్షణకు చేస్తున్న సేవలు అభినందనీయం

    - ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు

    - రాష్ట్రంలో సంక్షేమ పథకాలను విస్తృతంగా నిర్వహిస్తున్నాం

    - సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటివి గ్రామాల్లో ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

    - పోలీసు శాఖలో త్వరలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించబోతున్నాం.

Print Article
Next Story
More Stories