Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 Aug 2020 12:25 PM IST
కొవిడ్ 19 సెంటర్ ను ప్రారంభించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లా: తుని ఏరియా ఆసుపత్రిలో కొవిడ్ 19 సెంటర్ ను ప్రారంభించి న జిల్లా కలెక్టర్ డి.మురళి ధర రెడ్డి
- 8 Aug 2020 12:22 PM IST
టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకున్న ఈడీ
ED Case : టోలీ చౌకిలో నౌహీరా షేక్ భూములను స్వాధీనం చేసుకున్న ఈడీ
టోలీ చౌకి ఎస్ఏ కాలనీలో రూ.70 కోట్ల విలువైన 81 ప్లాట్లను ఆధీనంలోకి తీసుకున్న ఈడీ
రెవెన్యూ, పోలీసుల సహకారంతో నౌహీరా షేక్ భూములు స్వాధీనం చేసుకున్న ఈడీ
హీరా గోల్డ్ కేసులో సుమారు రూ.300 కోట్ల ఆస్తులు తాత్కాలిక జప్తు చేసిన ఈడీ
సుమారు రూ.5వేల కోట్ల హీరా గోల్డ్ కుంభకోణంపై మనీ లాండరింగ్ దర్యాప్తు చేస్తున్న ఈడీ
- 8 Aug 2020 12:19 PM IST
గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ లో పెరిగిన వరద ఇన్ ఫ్లో
తూర్పుగోదావరి -రాజమండ్రి:
గోదావరి ధవలేశ్వరం బ్యారేజ్ లో పెరిగిన వరద ఇన్ ఫ్లో
ఒక లక్షా 9వేల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి విడుదల
ధవలేశ్వరం వద్ద 10.70 అడుగుల గోదావరి నీటమట్టం
పంటకాల్వలకు 8వేలకు పైగా సాగునీరు విడుదల
- 8 Aug 2020 12:15 PM IST
శ్రీశైలం జలాశయానికి అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహం
కర్నూలు జిల్లా: శ్రీశైలం జలాశయానికి అంతకంతకు పెరుగుతున్న వరద ప్రవాహం
ఇన్ ఫ్లో : 1,99,641 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 38,140 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 848.10 అడుగులు
నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు
ప్రస్తుతం : 75.9734 టిఎంసీలు
ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 6 జనరేటర్ల ద్వారా కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 8 Aug 2020 12:11 PM IST
తెలుగు రాష్ట్రాలలో 24 గంటల్లో భారీ వర్షాలు.
విశాఖ: ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం...
తెలుగు రాష్ట్రాలలో 24 గంటల్లో బారీ వర్షాలు.
అరేబియా సముద్రంలో, అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా కర్నాటకలో భారీ వర్షాలు
- 8 Aug 2020 12:05 PM IST
అన్నవరంలో కరోనా కలవరం
తూర్పుగోదావరి -రాజమండ్రి: అన్నవరం సత్యదేవుని ఆలయంలో కరోనా కలవరం
అన్నవరం సత్యదేవుని ఆలయంలో 11 మంది ఉద్యోగులకు ,వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ పాజిటీవ్ తో అప్రమత్తమైన అధికారులు
పాజిటీవ్ సోకిన వారిలో ఆలయ సూపరింటెండెంట్, ఐదుగురు ఉద్యోగులు, ఐదుగురు పురోహితులు
నేడు అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న 300 మంది సిబ్బందికి సంజీవిని వాహనం లో కరోనా పరీక్షలు
పరీక్షలలో ఎక్కువ మందికి పాజిటీవ్ నమోదైతే స్వామి దర్శనాలు కొద్దిరోజులు నిలిపివేయాలన్న ఆలోచన లో అధికారులు....
అన్నవరం గ్రామంలో ఇప్పటికే 60 పాజిటీవ్ కేసులు నమోదు
- 8 Aug 2020 12:03 PM IST
పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి చెల్లుబోయిన
తూర్పుగోదావరి : రామచంద్రపురం లో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి చెల్లుబోయిన
వేణుగోపాలకృష్ఙ
- 8 Aug 2020 11:58 AM IST
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి : శానిటైజర్ సేవించి నలుగురు యువకులు మృతి చెందడం చాలా బాధాకరం
శానిటైజర్ మత్తు మందు కాదు, ఇది విషపూరితమైన చేతులుశుభ్ర పరుచుకోవడానికి వినియోగించే మందు
అధికారులు, ప్రభుత్వము పదేపదే చెబుతున్న ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం.
మద్యానికి బానిసైన యువకులు ప్రాణాలమీదికి కొని తెచ్చుకుంటున్నారు.
చేతులు శుభ్రపరుచుకునే శానిటైజర్ మత్తుకు వాడకూడదని నమస్కరిస్తున్నా...
తిరుపతి రుయా ఆస్పత్రిలోని మార్చురీలో వద్ద శానిటైజర్ తాగి మృతి చెందిన వారి మృతదేహాల సందర్శించి వారి కుటుంబీకులను పరామర్శించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
- 8 Aug 2020 11:53 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చిత్తురు పార్లమెంట్ సభ్యుడు రెడ్డప్ప
- 8 Aug 2020 11:51 AM IST
ప్రొద్దుటూరు వైయం.ఆర్ కాలనీలో విషాదం
కడప : ప్రొద్దుటూరు వైయం.ఆర్ కాలనీలో విషాదం....
కుటుంబ సమస్యలతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న తండ్రి బాబురెడ్డి....
తండ్రి మరణవార్త తట్టుకోలేక ఇద్దరు కూతుర్లు రైలు కిందపడి ఆత్మహత్య.. ..
పెద్ద కూతురు శ్వేత ను భర్త వేధించడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాబురెడ్డి ....
అక్కతో పాటు ఆత్మహత్య చేసుకున్న సాయి ఇంజనీరింగ్ విద్యార్థి....
ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు రాణి పేట మధ్యగల రైల్వే ట్రాక్ పైన ఇద్దరి మృతదేహాలు....
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు....












