Live Updates:ఈరోజు (ఆగస్ట్-08) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 08 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 08 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పంచమి (మ. 3-36 వరకు) తదుపరి షష్ఠి; ఉత్తరాభాద్ర నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి రేవతి నక్షత్రం, అమృత ఘడియలు (ఉ.10-10 నుంచి 11-55 వరకు), వర్జ్యం (తె. 4-48 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 5-44 నుంచి 7-25 వరకు) రాహుకాలం (ఉ. 9-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 8 Aug 2020 8:19 AM IST
పుట్టపర్తిలో రెండు రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ విధింపు
అనంతపురం:
- పుట్టపర్తిలో రెండు రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ విధింపు
- ఈరోజు ఉదయం ఆరు నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగింపు.
- కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన అధికారులు
- 8 Aug 2020 8:19 AM IST
జిల్లాలో కొనసాగుతున్న‘కరోనా’ కరాళ నృత్యం
తూర్పుగోదావరి:
- రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
- కరోనా కేసుల్లో ఏపీలో తొలిస్థానంలో తూర్పుగోదావరి
- ఇప్పటి వరకూ నమోదైన పాజిటివ్ కేసులు సంఖ్య 28వేల 850
- కరోనా నుంచి కోలుకున్న పేషెంట్స్ 15 వేల698
- యాక్టీవ్ పాజిటీవ్ తో చికిత్స పొందుతున్న పేషెంట్స్ 12వేల 940
- జిల్లాలో కరోనా మృతులు 212
- 8 Aug 2020 8:18 AM IST
రాజమండ్రి పంచాయతీ రాజ్ లో ఈఈగా పదవీ విరమణ చేసిన దుర్గాప్రసాద్
తూర్పుగోదావరి:
- రాజమహేంద్రవరంలో పంచాయతీ రాజ్ లో ఈఈగా పదవీ విరమణ చేసిన దుర్గాప్రసాద్, ఏఈఈ ఎంజీ అహ్మద్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు
- అలాగే అల్లవరం మండలం ఏఈగా పనిచేస్తున్న సత్యనారాయణ ఆస్తుల కొనుగోలులో వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశాలు
- విచారణ అధికారిగా జిల్లా పంచాయతీరాజ్‌శాఖ పర్యవేక్షణ ఇంజినీరును నియామకం
- 8 Aug 2020 8:17 AM IST
శ్రీశైలం జలాశయంలో మళ్ళీ పెరుగుతున్న వరద ప్రవాహం
కర్నూలు జిల్లా:
- ఇన్ ఫ్లో : 1,60,205 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 38,140 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 848.00 అడుగులు
- నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు
- ప్రస్తుతం : 75.8020 టిఎంసీలు
- ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 8 Aug 2020 8:16 AM IST
గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజృపిస్తున్న కరోనా...
గుంటూరు:
- జిల్లాలో 817 కరోనా పాజిటివ్...
- నగర కార్పొరేషన్...161,నర్సరావుపేట135
- రేపల్లె61, మాచర్ల38
- జిల్లా మొత్తం ఇప్పటి వరకు 21855
- 8 Aug 2020 8:15 AM IST
విజయవాడ:
- నేడు బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కీ. శే. పైడికొండల మాణిక్యాలరావు మృతికి పార్టీ సంతాప సభ
- వర్చువల్ ద్వారా సభ లో పాల్గొననున్న బీజేపీ సీనియర్ నేతలు
- 8 Aug 2020 8:14 AM IST
అనంతపురం ఈ నెల 10 నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ నీరు విడుదల
- అనంతపురం ఈ నెల 10 నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ నీరు విడుదల
- జీడిపల్లి రిజర్వాయర్ లో 1.3 టీఎంసీల నీరు నిల్వ ఉంది
- రెండు రోజుల్లో డ్యాం పూర్తి సామర్థ్యం 1.68 టీఎంసీల సామర్థ్యం కి చేరుకున్న నేపథ్యంలో గొల్లపల్లికి నీరు విడుదల చేయనున్న అధికారులు
- 8 Aug 2020 7:48 AM IST
ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఈనెల 18 నుంచి పవిత్రోత్సవాలు...
కడప :
- 18న అంకురార్పణ, 19న పవిత్ర ప్రతిష్ఠ, 20న పవిత్రాల సమర్పణ, 21న పవిత్ర విసర్జన, పుర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించాలని నిర్ణయం....
- కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్-19 నిబంధనలను అనుసరించి ఏకాంత పూజలు ...
- హోమాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా పందిరిని ఏర్పాటు...



