Live Updates: ఈరోజు (06 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 06 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | చవితి ఉ.09-02 వరకు తదుపరి పంచమి | కృత్తిక నక్షత్రం మ.03-42 వరకు తదుపరి రోహిణి | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు మ.01-40 నుంచి 02-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-17 నుంచి 09-04 వరకు | రాహుకాలం: మ.03-00 నుంచి 04-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Oct 2020 7:20 PM IST
Telangana updates: ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...
తెలంగాణ..
-మొత్తం పాస్ పర్సెంటేజ్-75.29%
-1లక్షా 19వేల 183 మంది ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోసం పరీక్ష రాసిన విద్యార్థులు
-మొత్తం 89వేల 734 ఉత్తీర్ణత సాధించారు.
- 6 Oct 2020 3:34 PM IST
JNTU: హైదరాబాద్ జెఎన్టియులో హై అలెర్ట్
- రెండో రోజు ఆందోళన కు సిద్దమౌతున్న విద్యార్థులు
- కరోనా కాలంలో పరీక్షలు వద్దంటూ ఆందోళన
- నిన్న లాఠీచార్జి తర్వాత విద్యార్థుల అరెస్ట్ విడుదల
- నేడు ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- ఆందోళన నడుము మంత్రి పర్యటన నేపథ్యంలో జేఎన్టీయూలో భారీగా మోహరించిన పోలీసులు
- ప్రతీ వ్యక్తి ని క్షుణ్ణంగా పరిశీలించి జెఎన్ టి యూ లోకి అనుమతిస్తున్న పోలీసులు
- 6 Oct 2020 3:33 PM IST
HIGH COURT : హైకోర్టు లో మహిళ ఆత్మహత్య యత్నం..
టీఎస్ హైకోర్టు:
- హైకోర్టు లో మహిళ కవిత ఆత్మహత్య యత్నం..
- చాలా రోజులుగా పెండింగులో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశ తో ఆత్మహత్య చేసుకోవాలని చూసిన కవిత..
- హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకే ప్రయత్నం చేసిన కవిత..
- కవిత ను అడ్డుకున్న హైకోర్టు సెక్యూరిటి...
- సెక్యూరిటీ కార్యాలయంలో కూర్చుబెట్టి కవిత ను విచారిస్తున్న సెక్యూరిటీ..
- గోదావరి ఖని చెందిన కవిత..
- ఏప్రిల్ 11 న మురళి అనే వ్యక్తి హత్యాచారం చేసాడని ఫిర్యాదు..
- 6 Oct 2020 3:31 PM IST
FIRE ACCIDENT: సిద్దంబర్ బజార్ లోని,టైర్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
బ్రేకింగ్:
- ఆఫ్జల్ గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో మజీద్ వెనుకాల ఉన్న గోదాములో షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
- సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది,ఆఫ్జల్ గంజ్ పోలీసులు
- 6 Oct 2020 3:30 PM IST
HARISH RAO: మంత్రి హరీష్ రావు సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన బీజేపీ నాయకులు
సిద్దిపేట జిల్లా :
సిద్దిపేట మంత్రి హరీష్ రావు సమక్షంలో టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన బీజేపీ నాయకులు...
* దుబ్బాక మండల బిజెపి ఎస్సి సెల్ అధ్యక్షుడు కాస్తి శ్రీనివాస్ ..
* టి ఆర్ ఎస్ పార్టీ లో చేరిన ముబారస్ పూర్ గ్రామ వార్డు మెంబర్స్
* కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంత్రి హరీష్ రావు
* దుబ్బాక టి ఆర్ ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని తీర్మానం .
- 6 Oct 2020 3:28 PM IST
JAGADGIRI GUTTA: వీడినా మిస్సింగ్ మిస్టరీ
- జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ బండ ప్రాంతంలో వీరభద్ర అనే వ్యక్తి మిస్సింగ్ మిస్టరీ వీడింది
- గత నెల 19వ తేదీన కనిపించకుండాపోయిన వీరభద్ర
- జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు
- చివరకు వీరభద్రం దారుణ హత్యకు గురైనట్లు గా గుర్తించిన పోలీసులు
- వికారాబాద్ జిల్లా నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదారం వాగులో చంపి పడేసినట్లు గుర్తించిన పోలీసులు
- ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
- 6 Oct 2020 11:57 AM IST
Telangana updates: నేడు కాంగ్రెస్ తీర్థం పుచుకొనున్న టీఆరెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి...
తెలంగాణ...
-రెండురోజులుగా మాజీ మంత్రి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ నేతలు.
-సాయంత్రం నాలుగు గంటలకుగాందీ భవన్ లో పిసిసి చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజి ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ ,ఎమ్మెల్యే జగ్గారెడ్డి ల సమీక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న శ్రీనివాస్ రెడ్డి.
-దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ పార్టీ.
- 6 Oct 2020 10:41 AM IST
Saraswati Barrage updates: సరస్వతి బ్యారేజ్ కి కొనసాగుతున్న వరద...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా...
-4 గేట్లు ఎత్తిన అధికారులు
-పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
-ప్రస్తుత సామర్థ్యం 118.00 మీటర్లు
-పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
-ప్రస్తుత సామర్థ్యం 8.54 టీఎంసీ
-ఇన్ ఫ్లో 10,000 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో 10,000 క్యూసెక్కులు
- 6 Oct 2020 10:06 AM IST
Nalgonda district updates: మునుగోడు మండలం చోల్లేడు గ్రామంలో రివాల్వర్ కలకలం....
నల్గొండ జిల్లా..
-గ్రామానికి చెందిన వనం లింగయ్య అనే వ్యక్తి ఇంట్లో రివాల్వర్, తల్వార్ ఉందని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసుల సోదా....
-ఇంట్లో దాచిన తుపాకీ, తల్వార్ స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు..
- 6 Oct 2020 10:02 AM IST
Bhupalpally updates: అక్రమంగా తరలిస్తున్న రేషన్...
జయశంకర్ భూపాలపల్లి జిల్లా..
-అన్నారం నుండి వయా చెన్నూర్ మీదుగా మహరాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల రేషన్
-బియ్యాన్ని అన్నారం బ్యారేజ్ వద్ద పట్టుకున్న కాళేశ్వరం పోలీసులు. బోలేరో, ఆటో సీజ్...










