Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 6 Aug 2020 10:30 AM GMT

    నిజామాబాద్ : అంబెడ్కర్ కాలనీ లో కరోనా తో వృద్ధుని మృతి.

    వారం రోజులుగా కరోనా హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న బాధితుడు.

    తెల్లవారుజామున మృతి. మృత్యుదేహం తరలించకుండా వదిలి వెళ్ళిన సిబ్బంది.

    భయాందోళనలో కాలనీ వాసులు, మృతదేహం తరలించాలని విజ్ఞప్తి.

  • 6 Aug 2020 10:30 AM GMT

    సిద్దిపేట : దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన, సీఎం కేసిఆర్

  • 6 Aug 2020 10:29 AM GMT

    కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మిడ్ మానేరు కి నీటి ఎత్తిపోతలు

    మొదటి సారి కాళేశ్వరం లింక్ 1 లింక్ 2 లోని మోటార్ల తో ఏకకాలం లో నీటి ఎత్తిపోస్తున్న అధికారులు

    మేడిగడ్డ నుండి మిడ్ మానేరు వరకు 36 మోటార్ల తో నీటి ఎత్తిపోత

    మొత్తం 10 టిఏఎంసి ల నీటి మిడ్ మానేరు కి తరలిస్తున్న ప్రభుత్వం

    మేడిగడ్డ నుండి 175 కిలో మీటర్ల దూరం ఉన్న మిడ్ మానేరు డ్యామ్ ని 3 గంటల్లో అందుకున్న కాళేశ్వరం నీళ్లు...

  • 6 Aug 2020 10:29 AM GMT

    హైదరాబాద్...

    మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కాం లొ కొత్త కోణం..

    యువతులకు వలవేస్తున్న మల్టీ లెవల్ బిజినెస్స్ చేస్తున్నా మోసగాళ్ళు..

    యువతుల దగ్గర్నుంచి డబ్బులు కలెక్షన్ చెసి మోసం చేస్తున్న ముఠా.

    యువతుల్ని లోబర్చుకొని లైంగికంగా వాడుకుంటున్న చీటర్..

    సైబరాబాద్ లో నలుగురు అరెస్ట్ చేసిన పోలీసులు..

    మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో అమ్మాయిలను మోసం చేసిన చీటర్.

    కుకట్ పల్లీ లొ కేసు నమోదు చేసిన పోలీసులు..

    అమ్మాయిల దగ్గర నుంచి వ్యాపారం పేరుతో డబ్బులు వసూలు నలుగురు మోసగాళ్లు..

    డబ్బులు తీసుకున్నాక లైంగికంగా వాడుకుంటున్న మోసగాళ్ళు..

    లైంగికంగా దాడుల ఫై

    పోలీసులకు ఫిర్యాదు చేసిన అమ్మాయిలు..

    నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు సైబర్ బాద్ పోలీసు.

  • 6 Aug 2020 10:29 AM GMT

    TS High Court :-

    ఆన్ లైన్ తరగతులు నిషేధించాలన్న హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పిల్ పై హైకోర్టులో విచారణ

    ఆన్ లైన్, దూరవిద్య విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని నిన్న కేబినెట్ నిర్ణయించిందన్న ప్రభుత్వం

    ఒకటి, రెండు రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరం ప్రకటించినున్నట్టు తెలిపిన ప్రభుత్వం

    మార్చిలోనే విద్యా సంవత్సరం మొదలు పెట్టినట్టు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠాశాలలు చెబుతున్నాయి; హైకోర్టు

    రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విద్యా శాఖ పరిధిలోని పాఠశాలలకే వర్తిస్తుందా: హైకోర్టు

    కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నాయన్న హైకోర్టు

    ఐదో తరగతి లోపు విద్యార్థులు గంటల తరబడి ఆన్ లైన్ లో ఎలా ఉండగలరు?: హైకోర్టు

    పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుందన్న హైకోర్టు

    ప్రైవేట్ పాఠశాలలు పాటించాల్సిన విధివిధానాలు కూడా ప్రకటిస్తాంమన్న ప్రభుత్వం

    ఫీజులు వసూలు చేయ వద్దన్న జీవోను పాఠాశాలులు ఉల్లంఘిస్తున్నాయన్న పిటిషనర్

    ప్రస్తుత దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని.. విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామన్న హైకోర్టు

    ఆన్ లైన్ తరగతులకు వైఖరి వెల్లడించేందుకు మరికొంత సమయం కోరిన సీబీఎస్ఈ

    విచారణ ఈనెల 27కి వాయిదా వేసిన హైకోర్టు

  • 6 Aug 2020 10:28 AM GMT

    వనపర్తి జిల్లా : ఆచార్య జయశంకర్ జయంతి సందర్బంగా వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించిన కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ,అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, శ్రీ వాత్సవ, జిల్లా అధికారులు.

    నాగర్ కర్నూల్ జిల్లా : ఉప్పునుంతల మండలం

    సదగోడు గ్రామ సమీపంలో దుంధూబి వాగుపై 8 కోట్లతో చేపట్టిన చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజు.

    మహబూబ్ నగర్ జిల్లా :

    జడ్చర్లలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది.

  • 6 Aug 2020 10:28 AM GMT

    సిద్దిపేట : దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

  • 6 Aug 2020 10:28 AM GMT

    సిద్దిపేట : ఎమ్మెల్యే రామలింగారెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి కెటిఆర్

  • 6 Aug 2020 10:28 AM GMT

    *టి పద్మారావు గౌడ్, డిప్యూటీ స్పీకర్,

    తెలంగాణ శాసనసభ*

    తెలంగాణ ఉద్యమ సహచరుడు, తోటి శాసనసభ్యుడు శ్రీ సోలిపేట రామలింగారెడ్డి గారి ఆకస్మిక మరణం మమ్మల్ని విచారానికి గురిచేసింది. రామలింగారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ... వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము

  • 6 Aug 2020 8:38 AM GMT

    మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐ.బి.గెస్ట్ లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రో.జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మున్సిపల్ ఛైర్మన్ పెంట రాజయ్య

Print Article
Next Story
More Stories