Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 6 Aug 2020 5:01 AM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • 6 Aug 2020 6:00 PM IST

    ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

    - ప్రత్యేక గీతం విడుదల చేసిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత

    - తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం పరితపించిన మహనీయులు, తెలంగాణ రాష్ట్ర సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్.

    - ప్రత్యేక రాష్ట్ర సాధనకు సైద్ధాంతిక పునాదిని వేసింది జయశంకర్ సార్.

    - ఇవాళ ఆయన జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో నివాళులు అర్పించారు.

    - తెలంగాణ ఉద్యమ దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో ప్రతీ యేడు వారి జయంతి నాడు తెలంగాణ జాగృతి వార్షికోత్సవం జరుపుకుంటున్నాము.

    - ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ప్రత్యేక గీతం ను మాజీ ఎంపీ కవిత ఆవిష్కరించారు.

  • ఖైరతాబాద్ ఆర్టియే ఆఫీస్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
    6 Aug 2020 5:55 PM IST

    ఖైరతాబాద్ ఆర్టియే ఆఫీస్ కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

    హైదరాబాద్‌:

    - ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశారు.

    - తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం స్టార్ హీరో ప్రభాస్‌ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చినట్లు తెలిసింది.

    - ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డార్లింగ్‌ను చూసేందుకు భారీగా అక్కడికి తరలి వచ్చారు.

    - ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులు, సందర్శకులు ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు.

    - మాస్క్‌ ధరించిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫొటోలకు పోజిచ్చారు.

  • 6 Aug 2020 5:08 PM IST

    నాగర్ కర్నూలు జిల్లా : కొల్లాపూర్, కోడేరు మండలాల్లోని పలు తాండాలలో ఎక్సైజ్ అధికారుల దాడులు. 30 లీటర్ల సారా. 100కేజీల నవసాగ్రం స్వాధీనం. 900 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. ఒక ఆటో. ఒక టూ వీలర్ వాహనం సీజ్.

  • 6 Aug 2020 5:08 PM IST

    నల్గొండ : మునుగోడు నియోజకవర్గం లో చేనేత కార్మికుల ఆర్ధిక ఇబ్బందులపై స్పందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.. రేపు మునుగోడు నియోజకవర్గం లో 3500 మంది చేనేత కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.

  • 6 Aug 2020 5:07 PM IST

    భ‌ద్రాద్రి కొత్త‌గూడెం... కొత్త‌గూడెం ప‌ట్ట‌ణం లో ఆక‌తాయిల‌ వీరంగం, ట్రాఫిక్ పోలీస్ స్టేష‌న్ లో కానిస్టేబుళ్ళ‌ పై దాడి, మ‌ద్యం మ‌త్తులో హ‌ల్ చ‌ల్

  • 6 Aug 2020 5:07 PM IST

    వనపర్తి జిల్లా పెబ్బేర్ MRO ఆఫీస్ లో ACB దాడులు. 6000/-రూపాయలు లంచం తీసుకుంటూ ACBకి పట్టుపడ్డ సూగూర్ VRO వెంకట్రాములు.


  • 6 Aug 2020 5:07 PM IST

    నల్గొండ : నల్గొండ వన్ టౌన్ పరిధిలో రౌడీ షీటర్ మహ్మద్ మోసీన్ ఖాన్ పై పిడి యాక్ట్ నమోదు చేసి జైలుకి పంపిన వన్ టౌన్ పోలీసులు...2018 లో పిడి యాక్ట్ పై ఏడాది పాటు జైలులో ఉన్న మోసీన్...జైలు నుంచి బయటకు వచ్చాక బలవంతపు వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతుండటంతో మళ్లీ పిడి యాక్ట్ నమోదు....


  • 6 Aug 2020 4:01 PM IST

    కరీంనగర్ : బొమ్మకల్ భారీ భూ అక్రమాలపై హెచ్ ఆర్ సి స్పందన

    మీడియాలో వచ్చిన కథనాలను సుమోటో గా స్వీకరించిన హెచ్ ఆర్ సి

    బొమ్మకల్ భూ అక్రమల విషయం లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ కి నోటీసు లు

    ఇదే స్కామ్ లో అరెస్ట్ ఐన బొమ్మకల్ సర్పంచ్ శ్రీనివాస్ పై ఎలాంటి కేసులు నమోదు చేసారో తెలపాలని ఆదేశం

  • 6 Aug 2020 4:01 PM IST

    Hmtv తో ప్రవీణ్, అడిషనల్ డీసీపీ, సైబరాబాద్:-

    మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారు

    బిసినెస్ పేరుతో పెట్టుబడులు పెట్టించి మోసం చేస్తున్నారు

    డబ్బులు అడిగిన తరువాత అమ్మాయిల పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు

    ముఠాలోని నలుగురుని అరెస్ట్ చేశాము, ఇంకా ఈ కేసులో విచారణ చేస్తున్నాం

    పెట్టుబడలు పెట్టిన డబ్బులు అడిగినప్పుడు వారి పై లైంగిక దాడులు చేస్తున్నారు

    మేము చెప్పినట్లు వింటేనే మీ డబ్బులు మీకు ఇస్తామంటూ వేదరింపులకు దిగుతున్నారు

    ఇంకా ఎక్కడక్కడ మోసాలకు పాల్పడ్డారు అనేది విచారణ చేస్తున్నాం

    మియపూర్ పోలీస్ స్టేషన్ లో మూడు ఫిర్యాదులు అందాయి

    దీంతో కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నాం

    అత్యాశకు , ఈజీ మని కోసం తెలియని బిజినెస్ ల్లో పెట్టుబడులు పెట్టకండి

    అమ్మాయిల ను , మహిళలను టార్గెట్ గా చేసుకొని ఈ మోసాలకు పాల్పడుతున్నారు

  • 6 Aug 2020 4:00 PM IST

    సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం చిట్టా పూర్ గ్రామంలో ప్రారంభమైన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంతిమ యాత్ర...

K V D Varma

K V D Varma

Next Story