Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం, 05ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం విదియ(రాత్రి 9-34 వరకు) తదుపరి తదియ; ధనిష్ఠ నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి శతభిష నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 5-04 నుంచి 6-47 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-౨౯
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 5 Aug 2020 3:15 PM IST
ములుగులో గంజాయి స్వాధీనం
ములుగు జిల్లా: ములుగు పట్టణ శివారు ఎర్రి గట్టమ్మ వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా కారులో తరలిస్తున్న 2 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్న ములుగు సిఐ దేవేందర్ రెడ్డి.
- 5 Aug 2020 1:49 PM IST
మొబైల్ షాపులో చోరీ..
రాచకొండ కమిషనరేట్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న మొబైల్ షాపులో చోరీ...
దుకాణానికి కన్నం వేసి సెల్ ఫోన్ లు చోరీ చేసిన దుండగులు..
యజమాని ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- 5 Aug 2020 1:46 PM IST
బండి సంజయ్ ప్రత్యేక పూజలు
కరీంనగర్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షడి ప్రత్యేక పూజలు ...
అయోధ్య లో రామాలయ నిర్మాణానికి భూమి పూజ సందర్బంగా కరీంనగర్ లో పూజలు చేసిన బండి సంజయ్
కుటుంబ సమేతంగా కరీంనగర్ లోని తన ఇంట్లో పూజలు చేసిన సంజయ్
- 5 Aug 2020 1:44 PM IST
జగిత్యాల : జగిత్యాల లో బిజెపి అద్వర్యం లో పూజలు
- ధరూర్ లోని కోదండరామాలయం లో పూజలు నిర్వహించిన బిజెపి కార్యకర్తలు
- 5 Aug 2020 1:42 PM IST
అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా
- నేడు జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించిన కేంద్ర జలవనరుల శాఖ
- అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు నిర్వహించబోయోది ఇరు రాష్టాలకు సమాచారం ఇస్తామన్న జలవనరుల శాఖ
- 5 Aug 2020 1:37 PM IST
భద్రాచలంలో ప్రత్యేక పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: నేడు అయోధ్య లో శ్రీరామ మందిర నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ శంఖుస్థాపన చేస్తున్న నేపథ్యంలో నేడు దక్షిణ అయోధ్య భద్రాద్రి రామాలయంలో శ్రీ రామాయణ హవనం,
శ్రీరామావతారకోపనిషత్తు,అష్టావింశతి వార ఆవృత్తి,సువర్ణ పుష్పాఅర్చన నిర్వహించిన అర్చకులు
- 5 Aug 2020 1:32 PM IST
రైతు వేదిక భవన శంకుస్థాపన
ఖమ్మం: బోనకల్ మండలం రాయన్నపేట గ్రామంలో రైతు వేదిక భవనానికి శంకుస్థాపన చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు.
- 5 Aug 2020 1:30 PM IST
రైతు వేదికకు శంఖుస్థాపన చేసిన ఎమ్మేల్యే సండ్రా
ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన యం.ఎల్.ఏ సండ్ర వెంకటవీరయ్య
- 5 Aug 2020 1:25 PM IST
కామారెడ్డిలో స్వచ్చంద లాక్ డౌన్
కామారెడ్డి : జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న స్వచ్చంద లాక్ డౌన్
నేటి నుంచి 10 రోజుల పాటు పూర్తి స్తాయి లాక్ డౌన్ అమలు
ఉదయం నుంచి తెరుచుకొని దుకాణాలు.. నిర్మానుష్యంగా మారిన జిల్లా కేంద్రం
కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో స్వచ్చంద లాక్ డౌన్ నిర్ణయం
- 5 Aug 2020 11:37 AM IST
కుమరంభీమ్ జిల్లా : కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్
హోంగార్డ్ కు కరోనా పాజిటివ్
హైదారాబాద్ లో అసుపత్రి లో చికిత్స పొందుతూ మ్రుతి








