Live Updates: ఈరోజు (సెప్టెంబర్-03) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు గురువారం, 03 సెప్టెంబర్, 2020: శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, కృష్ణపక్షం-పాడ్యమి (ఉ.10-41వరకు) తదుపరి విదియ, పూర్వాభాద్ర నక్షత్రం (రా.8-20 వరకు) తదుపరి ఉత్తరాభాద్ర అమృత ఘడియలు (ఉ.11-41 నుంచి 1-25 వరకు) వర్జ్యం: లేదు దుర్ముహూర్తం (ఉ.9-56 నుంచి 10-45 వరకు తిరిగి మ. 2-53 నుంచి 3-42 వరకు) రాహుకాలం (మ. 1-30 నుంచి 3-00 వరకు) సూర్యోదయం: ఉ.5-49 సూర్యాస్తమయం: సా.6-11
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Sept 2020 12:28 PM IST
Amaravathi updates: రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా మాజీమంత్రి, ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు..?
అమరావతి..
-రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా మాజీమంత్రి, ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు..?
-అచ్చెన్నాయుడు వైపే మొగ్గు చూపుతున్న పార్టీ సీనియర్లు
-సంస్థాగతంగా పార్టీ కమిటీల పక్రియ ను పూర్తి చేసిన అధిష్టానం
-త్వరలో నూతన అధ్యక్షుడు తో పాటు కమిటీ లను ప్రకటించనున్న టీడీపీ అధిష్టానం
- 3 Sept 2020 12:25 PM IST
Guntur district updates: పిట్లవానిపాలెం మండలం అల్లూరు శివారు లోని రొయ్యల చెరువు వద్ద అగ్ని ప్రమాదం...
గుంటూరు ః
-పిట్లవానిపాలెం మండలం అల్లూరు శివారు లోని రొయ్యల చెరువు వద్ద అగ్ని ప్రమాదం...
-ప్రమాదం లో ఇద్దరు మృతి, మరో ఐదుగురు కి గాయాలు....
- 3 Sept 2020 12:22 PM IST
Guntur district updates: సత్తెనపల్లి మై కల్యాణ్ జ్యూవెలర్స్..
గుంటూరు....
-సత్తెనపల్లి మై కల్యాణ్ జ్యూవెలర్స్
-మేనేజర్ సుభాని ఆత్మహత్య..
-సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఘటనకు పాల్పడ్డ యువకుడు
-సంస్థ ఆర్ధిక లావాదేవిల్లో తేడా రావడంతోనే సూసైడ్ చేసుకుంటునట్లు సెల్ఫీ వీడియో...
-వారం రోజుల టైం అడిగిన ఒప్పుకొని యాజమాన్యం...
-మేనేజర్ సుభాని పై పోలీస్టేషన్ లో ఫిర్యాదు...
-సంస్థ ఒత్తిడికి తట్టుకోలేక మనస్తాపం చెంది ఆత్మహత్య
-దుగ్గిరాల (మం)చిలువూరులో పురుగు మందు
-తాగి మృతి చెందిన సుభాని
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- 3 Sept 2020 12:19 PM IST
Vijayawada updates: రైతు శిక్షణ కేంద్రంలో ప్రారంభమైన మహిళా కమిషన్ విచారణ..
విజయవాడ..
-బీసీ సంక్షేమశాఖ లో లైంగిక వేధింపుల ఆరోపణలపై జల వనరుల శాఖ కార్యక్రమంలోని రైతు శిక్షణ కేంద్రంలో ప్రారంభమైన మహిళా కమిషన్ విచారణ
-పాల్గొన్న మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, సంక్షేమ శాఖ మహిళా ఉద్యోగులు..
- 3 Sept 2020 10:57 AM IST
Visakhapatnam updates: సింహాచలం అప్పన్న బంగారం అమ్ముతామని 1.40 కోట్లకు టోకరా...
విశాఖ..
-సింహాచలం అప్పన్న బంగారం అమ్ముతామని 1.40 కోట్లకు టోకరా...
-నెల్లూరుకు చెందిన శ్రావణి అనే మహిళకు టోకరా వేసిన హైమావతి
-కరోనా వల్ల ప్రచారం చేయలేదని నెల్లూరు మహిళకు నమ్మించన వైనం.
-మాజీ ఆలయ ఈవో భ్రమరాంబ వేలంకి అనుమతి ఇచ్చినట్లు ఫోర్జరీ నోటీసును చూపించిన మహిళ
-కొంత డబ్బులు చెల్లించిన తర్వాత, అనుమానంతో ఆలయ అధికారులను సంప్రదించినట్లు సమాచారం.
-దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న దేవస్థానం ఉన్నతాధికారులు..
- 3 Sept 2020 10:54 AM IST
West Godavari updates: మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారి వద్దనుండి స్వాధీనం చేసుకున్న మద్యం..
పశ్చిమగోదావరి జిల్లా..
-మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారి వద్దనుండి స్వాధీనం చేసుకున్న మద్యం
-బాటిళ్లలో పోలీసుల చేతివాటం
-లెక్కల్లో వ్యత్యాసాన్ని గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు
-విచారణ చేసి గతంలో
-టీ నర్సాపురం పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఎస్ఐ ప్రేమ్ రాజు మరియు స్టేషన్ రైటర్ పి. మహేశ్వరరావు లను సస్పెండ్ చేసిన ఏలూరు రేంజ్ డిఐజి మోహన్ రావు
-ప్రస్తుతం వి ఆర్ లో ఉన్న ఇరువురు పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డి ఐ జి వెల్లడి.
- 3 Sept 2020 10:50 AM IST
Prakasam updates: మత్స్యకారుడు స్వీయ మరణానికి చెందిన ఘటన పై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం..
ప్రకాశం జిల్లా,
-వేటపాలెం మండలం రామచంద్రపురంనకు చెందిన మత్స్యకారుడు వై ఎస్ ఆర్ సి పి మాజీ ఎంపీటీసీ కోడూరు వెంకటేశ్వర్లు కుటుంబం స్వీయ మరణానికి అనుమతి కోరుతూ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు,సిఎంకు అర్జీలు దాఖలు చేసిన ఘటన పై విచారణకు ఆదేశించిన ఏపీ ప్రభుత్వం.
-విచారణ అధికారులుగా జాయింట్ కలెక్టర్ మరియు మార్కాపురం ఆర్డీవోలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ.
-విచారణ నివేదికను త్వరగా అందించాలంటూ కోరిన ప్రభుత్వం.
- 3 Sept 2020 10:24 AM IST
Kadapa district updates: ప్రొద్దుటూరులోని ఎస్ సీ ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తప్పిన పెను ప్రమాదం.....
కడప :
-ప్రొద్దుటూరులోని ఎస్ సీ ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తప్పిన పెను ప్రమాదం.....
-రాత్రి కురిసిన వర్షానికి కూలిన గదుల పైకప్పు......
-పూర్తిగా కూలిపోయిన కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం పై కప్పు
-ధ్వంసమైన కంప్యూటర్లు, పుస్తకాలు
-గదుల్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
-మిగిలిన గదులు కూడా శిథిలావస్థలో ఉండటంతో భయాందోళన చెందిన అధ్యాపకులు..
- 3 Sept 2020 10:24 AM IST
Kadapa district updates: ప్రొద్దుటూరులోని ఎస్ సీ ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తప్పిన పెను ప్రమాదం.....
కడప :
-ప్రొద్దుటూరులోని ఎస్ సీ ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తప్పిన పెను ప్రమాదం.....
-రాత్రి కురిసిన వర్షానికి కూలిన గదుల పైకప్పు......
-పూర్తిగా కూలిపోయిన కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం పై కప్పు
-ధ్వంసమైన కంప్యూటర్లు, పుస్తకాలు
-గదుల్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
-మిగిలిన గదులు కూడా శిథిలావస్థలో ఉండటంతో భయాందోళన చెందిన అధ్యాపకులు..
- 3 Sept 2020 10:18 AM IST
Anantapur updates: జిల్లా లో విస్తారంగా వర్షాలు...
అనంతపురం:
-జిల్లా లో విస్తారంగా వర్షాలు.
-జిల్లా లో 1240 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు.
-జిల్లా లో సగటు వర్షపాతం 19.7 మిల్లీమీటర్లు.
-జిల్లా లో 60 మండలాల్లో వర్షం
-కనగానపల్లి మండలం లో అత్యధికంగా 83.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు.












