Live Updates:ఈరోజు (ఆగస్ట్-02) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం, 02 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, శుక్లపక్షం చతుర్దశి (రాత్రి 9-30 వరకు) తదుపరి పూర్ణిమ; పూర్వాషాఢ నక్షత్రం (ఉ. 7-27 వరకు) తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం, అమృత ఘడియలు (రాత్రి 11-16 నుంచి 2-53 వరకు), వర్జ్యం (మ. 3-32 నుంచి 5-10 వరకు) దుర్ముహూర్తం ( సా. 4-47 నుంచి 5-38 వరకు) రాహుకాలం (సా. 4-30 నుంచి 6-00 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-30

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • మాణిక్యాలరావు  మ‌ర‌ణం త్రీవంగా క‌లిచివేసింది; ముద్రగడ పద్మనాభం
    2 Aug 2020 7:25 AM GMT

    మాణిక్యాలరావు మ‌ర‌ణం త్రీవంగా క‌లిచివేసింది; ముద్రగడ పద్మనాభం

    తూర్పుగోదావరి: మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అకాల మరణం నా మనసుని కలిచివేసింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం

    కరోనా వలన స్వయంగా ఆయన చివరి చూపు చూడలేక పోయాననే బాధ బాధిస్తుంది. 

    మాణిక్యాలరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.


  • పింగళి వెంకయ్య చరితార్ధుడు: చంద్రబాబు
    2 Aug 2020 7:16 AM GMT

    పింగళి వెంకయ్య చరితార్ధుడు: చంద్రబాబు

    అమరావతి:జాతీయ పతాకాన్ని రూపుదిద్ది, అశేష భారతావనిలో దేశభక్తి ఇనుమడింపజేసి, జాతిపిత ఆత్మీయాభిమానాలు సొంతం చేసుకున్న పింగళి వెంకయ్య చరితార్ధుడు.

    దేశభక్తునిగా, జాతీయ పతాక రూపకర్తగా భారతజాతికి చిరస్మరణీయ సేవలు అందించిన పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.

    -  టీడీపీ అధినేత చంద్రబాబు 


  • జీజీ హెచ్ లో మరోదారుణం.
    2 Aug 2020 6:08 AM GMT

    జీజీ హెచ్ లో మరోదారుణం.

    నెల్లూరు బ్రేకింగ్స్: కరోనా పేషేంట్ పల్లెపు సనత్ కుమార్(42) మృతి.

    డాక్టర్ల నిర్లక్ష్యం సనత్ ప్రాణాలు తీసిందంటూ మృతుని కుటుంభ సభ్యుల ఆరోపణలు

    ఇప్పటికే డయాలసిస్ పేషేంట్ గా ఉన్న సనత్.

    ఉదయం 5 గంటల సమయంలో తమతో మాట్లాడారన్న భార్య.

    ఆపై అరగంట కే సీరియస్ గా ఉందంటూ డాక్టర్ల సమాచారం

    కుటుంభ సభ్యులు వెళ్లి చూసేసరికి విగతజీవిగా ఉన్న సనత్ కుమార్.

    మృతుడు సనత్ కి భార్య..ఇద్దరు చిన్నపిల్లలు.

    రాపూరు అటవీశాఖ రేంజ్ పరిధిలో గార్డుగా పనిచేస్తున్న సనత్.

  • షిప్ యార్డ్ ఘటనపై ద‌ర్యాప్తు వేగవంతం  ..
    2 Aug 2020 6:02 AM GMT

    షిప్ యార్డ్ ఘటనపై ద‌ర్యాప్తు వేగవంతం ..

    విశాఖ: ఇంజనీరింగ్ సాకేంతిక నిపుణులతో రెండు కమీటీలు వేసిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్

    11 మంది మృతుల ను గర్తించి కుటుంబ సభ్యులు కు సమాచారం ఇచ్చిన అధికారులు..

    నేటి మధ్యాహ్నం ఘటనా స్థలం ను సందర్శించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్...

    మృతులకు ఎక్ష్ గ్రేషీయా ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా కార్మిక సంఘాలు 

  • 2 Aug 2020 4:54 AM GMT

    కంచిలి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

    శ్రీకాకుళం జిల్లా

    - ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న స్కార్పియో కారు

    - ముగ్గురు మృతి

    - మృతులు పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ వాసులుగా గుర్తింపు

    - విశాఖ షిప్ యార్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారుడు కోసం వెళుతుండగా ఘటన

  • 2 Aug 2020 4:05 AM GMT

    ధర్మవరంలో విషాదం

    అనంతపురం:

    - భవనంపై నుంచి దూకి ఇద్దరు కరోనా బాధితుల ఆత్మహత్య

    - దంపతులు ఫణిరాజ్(42), శిరీష(40)

    - కరోనా తో భార్యభర్తల మధ్య విభేదాలు

    - వారం రోజుల కిందట కరోనా తో ఫణిరాజ్ తల్లి మృతి

    - విబేధాలతో ఆత్మహత్య కు పాల్పడ్డ దంపతులు

  • కరోనా మృతునికి అంత్యక్రియలు చేసిన ఎమ్మెల్యే
    2 Aug 2020 3:58 AM GMT

    కరోనా మృతునికి అంత్యక్రియలు చేసిన ఎమ్మెల్యే

    '- కరోనాతో చనిపోయిన వ్యక్తికి దగ్గరుండి అంత్యక్రియలు జరిపించిన కర్నూల్ ఎంఎల్ఏ హఫీజ్ ఖాన్  

    - శుక్రవారం కరోనాతో మృతి చెందినా  కర్నూలు పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి 

    - అంత్యక్రియలు చేసేందుకు ముందుకురాని కుటుంబసభ్యులు

    - దీంతో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మృతుని అంత్యక్రియలకు సిద్ధ[పడ్డారు.

    - PPE కిట్లు ధరించి మున్సిపల్‌.సిబ్బందితో కలిసి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు.చేసిన ఎమ్మెల్యే 

    - కరోనాసై ప్రజల్లో ఉన్న భయాన్ని పాగొట్టేందుకే ఇలా చేశానని హఫీజ్‌ ఖాన్‌ తెలిపారు. 

  • సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ..జీవో జారీ!
    2 Aug 2020 3:24 AM GMT

    సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ..జీవో జారీ!

    అమరావతి:

    - ఏపీ సీఆర్డీఏ రద్దు చేస్తూ చేసిన చట్టం ఆమోదం పొందటం తో సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు

    - సీఆర్డీఏ పరిధి అంతా ఇక నుంచి ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు

    - సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చినందున 2014లో చేసిన సీఆర్డీఏ ఇక ఉనికిలో ఉండబోదని నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రభుత్వం

    - ఏఎంఆర్డీఏ కు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడు గా 11 మంది అధికారులు సభ్యులు గా పాలక కమిటీ ఏర్పాటు

    - కమిటి లో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి

        - ఏ ఎంఆర్డీఏ కమిషనర్,

        - గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్

        - డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ లు సభ్యులు గా కమిటీ

    - ఏ ఎంఆర్డీఏ కు కమిషనర్ గా లక్ష్మీ నరసింహం ను నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ

  • 2 Aug 2020 3:18 AM GMT

    పశ్చిమగోదావరి జిల్లా కరోనా అప్డేట్స్

    పశ్చిమగోదావరి 

    - జిల్లా వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు...

    - 13,975కు చేరుకున్న పాజిటివ్ కేసుల సంఖ్య...

    - భీమవరం, తాడేపల్లిగూడెంలో విజృంభిస్తున్న కరోనా..

    - జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సంపూర్ణ లాక్ డౌన్

    - మూతపడ్డ వ్యాపార,వాణిజ్య సముదాయాలు..

    - మద్యం దుకాణాలు సైతం మూసివేత..

  • 2 Aug 2020 2:15 AM GMT

    శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న వరద

    కర్నూలు జిల్లా

    - ఇన్ ఫ్లో : 22,471 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో : 38,140 క్యూసెక్కులు

    - పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

    - ప్రస్తుతం : 851.60 అడుగులు

    - నీటి నిలువ సామర్థ్యం : 215 టిఎంసీలు

    - ప్రస్తుతం : 83.7182. టిఎంసీలు

    - ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Print Article
Next Story
More Stories