Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 01 సెప్టెంబర్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం చతుర్దశి (ఉ.8-47 వరకు) తదుపరి పూర్ణిమ, ధనిష్ఠ నక్షత్రం (సా. 4-55 వరకు) తదుపరి శతభిషం, అమృత ఘడియలు (ఉ.6-04 నుంచి 7-44 వరకు) వర్జ్యం (రా. 12-23 నుంచి 2-15 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా.10-51 నుంచి 11-37 వరకు) రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49; సూర్యాస్తమయం: సా.6-13
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 1 Sept 2020 12:01 PM IST
Vizianagaram district updates: జిల్లా వైద్య ఆరోగ్య పర్యవేక్షణాధికారి లక్ష్మునాయుడు కరోనాతో మృతి..
విజయనగరం...
-జిల్లా వైద్య ఆరోగ్య పర్యవేక్షణాధికారి లక్ష్మునాయుడు కరోనాతో మృతి
-గత పదిహేను రోజులుగా కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందిన లక్ష్ము నాయుడు..
-పరిస్థితి విషమించడంతో గతరాత్రి మృతి
-లక్ష్మునాయుడు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన జిల్లా వైద్య అధికారులు.
- 1 Sept 2020 11:35 AM IST
Anantapur district updates: మడకశిర నియోజకవర్గం లో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు..
అనంతపురం :
-మడకశిర నియోజకవర్గం లో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు..
-పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..
-రోళ్ల లో స్కూల్ బిల్డింగ్, దేవాలయాలలో కి చేరిన వరద నీరు..
- 1 Sept 2020 11:30 AM IST
Amaravati updates: సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 'స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు'పై సమీక్ష..
అమరావతి....
-సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన 'స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు'పై సమీక్ష..
-సమావేశానికి హాజరవనున్న పరిశ్రమల శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖా ఉన్నతాధికారులు..
- 1 Sept 2020 11:24 AM IST
Kakinada rain updates: కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండ భారీగా వర్షo..
తూర్పు గోదావరి....
కాకినాడ....
-కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండ భారీగా వర్షo..
ఉరుముల మెరుపులతొ భయం. భయవాతావరణం..
-పట్నంలో అనేక పళ్లపు ప్రాంతాలు ముoపు..
- 1 Sept 2020 11:09 AM IST
Vijayawada updates: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ..
విజయవాడ....
-ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శంకరనారాయణ..
-రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి..
- 1 Sept 2020 10:21 AM IST
Krishna district updates: అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్..
కృష్ణా జిల్లా..
-విసన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పోలవరం చెక్ పోస్ట్ వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
-తెలంగాణ నుండి ఆంధ్రా కు బైక్ పై మద్యం తరలింపు
-టీ షర్టు లోపల కవర్లలో 101 బాటిల్స్ పెట్టుకొని వెళ్తుండగా పట్టుకున్న ఎక్స్సైజ్ పోలీసులు
-అనుమానం వచ్చి చాకచక్యంగా పట్టుకున్న ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ బాలాజీ
-నిందితులు దేవర కొండ శ్రీనివాస్.. దేవరకొండ రాజేష్..గా గుర్తింపు
-ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నుండి కృష్ణా జిల్లా గన్నవరం కు తీసుకెళ్తు న్నట్టు గుర్తించిన పోలీసులు
-ఒక బైక్ సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
- 1 Sept 2020 10:16 AM IST
Amaravati updates: శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్..
అమరావతి..
-శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్
-హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షరీఫ్
- 1 Sept 2020 10:12 AM IST
Vizianagaram updates: జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న ఫించన్ల పంపిణీ కార్యక్రమం....
విజయనగరం:
-జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్న ఫించన్ల పంపిణీ కార్యక్రమం....
-తెల్లవారు ఝామున 5-30 గంటల నుండే ఫించన్ దారుల ఇళ్లకు వెళ్లి ఫించన్ మొత్తాలు అందజేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లు
-జిల్లాలో ఉదయం 8 గంటలకు 36.01 శాతం మందికి ఫించన్లు పంపిణీ చేసిన వాలంటీర్లు
-మొత్తం 3.37 లక్షల ఫించను దారుల్లో 1.21 లక్షల మందికి ఫించన్లు పంపిణీ చేసి రెండవ స్థానంలో నిలిచిన విజయనగరం జిల్లా
- 1 Sept 2020 8:35 AM IST
Amaravati updates: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభం
అమరావతి....
-రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభం
-రాష్ట్ర వ్యాప్తంగా 61.68 లక్షల మంది లబ్ధిదారులు
-రూ.1496.07 కోట్లు విడుదల చేసి ప్రభుత్వం
-ఈనెలలో కొత్తగా 90,167 మందికి పెన్షన్
-కొత్త పెన్షన్‌దారుల కోసం రూ.21.36 కోట్లు
-లబ్ధిదారుల చేతికే పెన్షన్ అందిస్తున్న 2.68 మంది వాలంటీర్లు
-బయోమెట్రిక్ తోనే పెన్షన్ల పంపిణీ
- 1 Sept 2020 8:31 AM IST
Rajahmundry updates: గోదావరికి మళ్ళీ వరదలు....
తూర్పుగోదావరి -రాజమండ్రి....
-గోదావరికి మళ్ళీ వరదలు
-వణికిపోతున్న దేవీపట్నం ముంపు గ్రామాల ప్రజలు
-గోదావరి ఎగువ కాలేశ్వరం. లక్ష్మి బ్యారేజ్ లను దిగువకు విడుదలవుతున్న 8లక్షలకు పైగా వరద నీరు
-ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీవర్షాలకు భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద నీటిమట్టం
-పోలవరం కాఫర్ డ్యాం వద్ద క్రమేణా పెరుగుతున్న వరద
-ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్లను ఎత్తి అఖండ గోదారి బేసిన్ ను ఖాళీ చేస్తున్న ఇరిగేషన్ అధికారులు
-ధవలేశ్వరం వద్ద ప్రస్తుతం గోదారినీటిమట్టం 5.20 అడుగులు
-ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా 2లక్షల 25వేల క్యూసెక్కుల సముద్రంలోకి విడుదల
-సాయంత్రానికి ధవలేశ్వరం వద్ద పెరగనున్న వరదనీటిమట్టం
-భద్రాచలం వద్ద ప్రస్తుతం వరద నీటిమట్టం 34.90 అడుగులు మొదటివార్నింగ్ వరకూ చేరుకునే అవకాశం













