Live Updates: ఈరోజు (సెప్టెంబర్-01) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 01 సెప్టెంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం, 01 సెప్టెంబర్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం చతుర్దశి (ఉ.8-47 వరకు) తదుపరి పూర్ణిమ, ధనిష్ఠ నక్షత్రం (సా. 4-55 వరకు) తదుపరి శతభిషం, అమృత ఘడియలు (ఉ.6-04 నుంచి 7-44 వరకు) వర్జ్యం (రా. 12-23 నుంచి 2-15 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-17 నుంచి 9-07 వరకు తిరిగి రా.10-51 నుంచి 11-37 వరకు) రాహుకాలం (సా. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం: ఉ.5-49; సూర్యాస్తమయం: సా.6-13
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 1 Sept 2020 3:59 PM IST
తూర్పుగోదావరి జిల్లా..
రంపచోడవరం ఏజెన్సీలో వున్న 11 మండలాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చేందుకు రైట్స్ వాచ్ సంస్థ అధ్యక్షులు అక్కిస బాలు ఆధ్వర్యంలో రంపచోడవరం జిల్లా సాధన సమితి పేరుతో కమిటీ సమావేశం
రంపచోడవరం జిల్లా ఇచ్చేవరకు పోరాటం చేయాలని నిర్ణాయం
- 1 Sept 2020 2:09 PM IST
Rajahmundry updates: బొమ్మన రాజకుమార్ అకాల మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..
తూర్పుగోదావరి-రాజమండ్రి:
-బొమ్మన రాజకుమార్ అకాల మృతిపట్ల ప్రగాఢ సంతాపం .
-వారు కుటుంబ సభ్యులకు సానుభూతి
-ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నాను
-కాపు కార్పొరేషన్ ఛైర్మన్ ,ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..
- 1 Sept 2020 2:03 PM IST
Rajahmundry updates: వైసీపీ నేత బొమ్మన రాజకుమార్ అనారోగ్యంతో మృతి!
తూర్పుగోదావరి-రాజమండ్రి:
-ప్రముఖ వస్త్ర వ్యాపారి, జాంపేట బ్యాంకు ఛైర్మన్ , వైసీపీ నేత బొమ్మన రాజకుమార్ అనారోగ్యంతో మృతి
-గత ఇరవై రోజులుగా హైదరాబాద్ లో స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బొమ్మన రాజకుమార్
-అస్వస్థతకు గురికావడంతో రాజమండ్రి- నుంచి హైదరాబాద్ స్టార్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన కుమారులు
-బొమ్మన రాజకుమార్ ఆకస్మిక మృతితో సంతాప సూచించగా దుకాణాల బంద్ పాటిస్తున్న రాజమండ్రి- ఛాంబర్ ఆఫ్ కామర్స్ ....
- 1 Sept 2020 1:59 PM IST
Anantapur district updates: రొళ్ల మండలం టీడీపల్లి లో విషాదం..
అనంతపురం:
-రొళ్ల మండలం టీడీపల్లి లో విషాదం..
-వేరుశనగ రాశి వేసుకుని పొలంలో నిద్రిస్తున్న చెల్లూరప్ప(62) అనే రైతు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మృతి.
-రాత్రి భారీగా కురిసిన వర్షానికి పక్కనే ఉన్న వంక తెగడం తో భారీగా వచ్చిన వరద ప్రవాహం.
- 1 Sept 2020 1:54 PM IST
Amaravati updates: సామాజిక మాధ్యమాల్లో..హైకోర్టులో దాఖలైన కేసులో జరిగిన విచారణ..
అమరావతి....
-సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులు,న్యాయస్థానాలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై హైకోర్టులో దాఖలైన కేసులో జరిగిన విచారణ
-కౌంటర్ ధాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు
-తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసిన ధర్మాసనం
- 1 Sept 2020 12:39 PM IST
Guntur District updates: సిపిఎస్ రద్దు చేయాలంటు యుటిఎఫ్ అధ్వర్యంలో బ్రాడీపేటలో సత్యగ్రహాలు..
గుంటూరు..
-సిపిఎస్ రద్దు చేయాలంటు యుటిఎఫ్ అధ్వర్యంలో బ్రాడీపేటలో సత్యగ్రహాలు..
-సిఎం జగన్ ఎన్నికల సమయంలో సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు....
-ఇచ్చిన హామీని నిలబెట్టకోవాలి....
-కేంద్ర నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చి రద్దు చేయవచ్చు...
-సిపిఎస్ రద్దు చేసే పోరాటం కోనసాగిస్తాం.....
-ఇప్పటికే కొన్ని రాష్ట్రాలో ఆమలు చేస్తున్నారు.... ఇదేమె గోంతేమ కోర్కే కాదు....
-టీచర్స్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు..
- 1 Sept 2020 12:34 PM IST
East Godavari District updates: కాట్రేనికోన మం . చేయ్యేరు అగ్రహారంలో దారుణం...
తూర్పుగోదావరి...
-కాట్రేనికోన మం. చేయ్యేరు అగ్రహారంలో దారుణం.
-భర్త ఉచ్చుల నరసింహమూర్తి (45)ని హతమార్చి సాధారణ మరణంగా చిత్రీకరించిన భార్య.
-రెండు రోజుల క్రితం అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు.
-గ్రామస్థులు నిలదీయడంతో భర్తను తానే హత్యచేసినట్లు ఒప్పుకున్న భార్య.
-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన.
-సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన అమలాపురం డిఎస్పీ షేక్ మాసుం భాషా.
- 1 Sept 2020 12:29 PM IST
Anantapur District updates: జిల్లా లో 859.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు.
అనంతపురం:
-జిల్లా లో 859.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు.
-జిల్లా లో సగటు వర్షపాతం 13.6 మిల్లీమీటర్లు.
-జిల్లాలో 22 మండలాల్లో వర్షపాతం నమోదు.
-అత్యధికంగా రొళ్ళ మండలం లో 180.08 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు
- 1 Sept 2020 12:17 PM IST
Kadapa district updates: అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలో ని అంబేద్కర్ కూడలిలో నిరసన...
కడప:
-అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలో ని అంబేద్కర్ కూడలిలో నిరసన...
-రాష్ట్రంలో దళితలపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన కరిక్రమం చేపట్టిన అఖిలపక్ష పార్టీ నాయకులు...
-పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, టీడీపీ,కాంగ్రెస్ నాయకులు...
- 1 Sept 2020 12:12 PM IST
Rajahmundry updates: మాజీ ఎమ్మెల్యే పాటంశెట్టి అమ్మిరాజు (86) అనారోగ్యంతో మృతి..
తూర్పుగోదావరి -రాజమండ్రి..
-మాజీ ఎమ్మెల్యే పాటంశెట్టి అమ్మిరాజు (86) అనారోగ్యంతో మృతి
-కడియం నియోజకవర్గం నుంచి 1978 లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన పాటంశెట్టి అమ్మిరాజు(86)
-కేవలం రూ.62 వేల ప్రజల విరాళాలతో ఎన్నికలలో ఖర్చు పెట్టి గెలిచిన రికార్డు అమ్మిరాజుకు వుంది
-ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు
-అమ్మిరాజు మృతి పట్ల రాష్ట్ర కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, ఎంపి మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, జనసేన అధికార ప్రతినిధి కందుల దుర్గేష్,మాజీ ఎంపి గిరజాల వెంకటస్వామి నాయుడు, రూరల్ వైకాపా కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు,రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు












