AP Panchayat Elections 2021 Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికలు లైవ్
AP Panchayat Elections 2021 Fourth Phase Polling Live Updates: ఏపీ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ లైవ్ అప్ డేట్స్
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగిసింది. నాలుగో విడతగా ఎన్నికల్లో 2,743 సర్పంచి, 22,423 వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం 6.30 గంటలకు మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ జరిగింది. దీంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన 13,097 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. పంచాయతీ ఎన్నికల నలుగోదశ పోలింగ్ అప్ డేట్స్ ఎప్పటి కప్పడు hmtv live updates అందిస్తోంది.
Live Updates
- 21 Feb 2021 8:10 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
శ్రీకాకుళం :
* నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగం గ్రామంలో తొలి ఓటు వేసిన డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్.
- 21 Feb 2021 8:09 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
కృష్ణాజిల్లా:
* నూజివీడు డివిజన్లో 14 మండలాల్లో నాలుగోదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
* నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, ఏ కొండూరు, బాపులపాడు, గంపలగూడెం, గన్నవరం, పమిడిమొక్కల, రెడ్డిగూడెం, తిరువూరు, ఉంగుటూరు, విస్సన్నపేట, ఉయ్యురు మండలాల్లో ఎన్నిక
* బరిలో 275 పంచాయతీ సర్పంచ్, 2990 వార్డు మెంబర్ స్థానాలు
* నూజివీడు డివిజన్ 14 మండలాల్లో మొత్తం ఓటర్లు 6,35,564
* వారిలో పురుషులు 3,11,199.. మహిళలు 3,24,332
* డివిజన్ వ్యాప్తంగా 2931 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నిర్వహిస్తున్న అధికారులు
* పోలింగ్ సిబ్బంది, ఓటర్లకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్
* పోలింగ్ అనంతరం కౌంటింగ్ స్టేషన్ల వద్ద 339 వెబ్ కెమెరాలు
* పోలింగ్ నిర్వహణ, పర్యవేక్షణ నిమిత్తం 8608 మంది, మధ్యాహ్నం నుండి ఓట్లు లెక్కింపుకు 6885 కౌంటింగ్ సిబ్బంది
* నూజివీడు డివిజన్లో 1660 సమస్యాత్మక గ్రామాలు
* పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు
- 21 Feb 2021 8:07 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
అనంతపురం:
* మూడో విడత లో వాయిదా పడిన ఉరవకొండ పంచాయతీ లో ని మూడో వార్డుకి నేడు ఏన్నికలు.
- 21 Feb 2021 8:07 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
అనంతపురం :
* నాల్గోవిడతలో లేపాక్షి మండలం కోడిపల్లిలో రెండవ వార్డులో బిసి మహిళకు రిజర్వ్ అయిన చోట పురుషులకు అనుమతించిన అధికారులు.
* పొరపాటును ఆలస్యంగా గుర్తించిన అధికారులు.
* సర్పంచు ఎన్నిక యథాతథం. వార్డు ఎన్నిక వాయిదా
- 21 Feb 2021 8:04 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
తూ.గో.జిల్లా:
రాజోలు
* రాజోలు నియోజకవర్గంలో ప్రారంభమైన నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
* మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరగనున్న పోలింగ్
* సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
- 21 Feb 2021 7:39 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
అనంతపురం:
* మూడో విడత లో వాయిదా పడిన ఉరవకొండ పంచాయతీ లో ని మూడో వార్డుకి నేడు ఏన్నికలు.
- 21 Feb 2021 7:38 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
అనంతపురం:
* నాల్గోవిడతలో లేపాక్షి మండలం కోడిపల్లిలో రెండవ వార్డులో బిసి మహిళకు రిజర్వ్ అయిన చోట పురుషులకు అనుమతించిన అధికారులు.
* పొరపాటును ఆలస్యంగా గుర్తించిన అధికారులు.
* సర్పంచు ఎన్నిక యథాతథం. వార్డు ఎన్నిక వాయిదా
- 21 Feb 2021 7:37 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
తూర్పు గోదావరి జిల్లా:
రాజోలు
* రాజోలు నియోజకవర్గంలో ప్రారంభమైన నాల్గవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
* మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరగనున్న పోలింగ్.
* సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు.
- 21 Feb 2021 7:35 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
పశ్చిమ గోదావరి జిల్లా :
* ఏలూరు డివిజన్‌లోని 4వ దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్
* ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం మూడున్నర గంటలు వరకు పోలింగ్
* మొత్తం గ్రామపంచాయతీలు..266
* ఏకగ్రీవం..29
* ఎన్నికలు జరుగు పంచాయతీ లు..237
* పోలింగ్ కేంద్రాలు..2,211
* సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు..645
* అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు..456
- 21 Feb 2021 7:33 AM IST
AP Panchayat Elections 2021 Fourth Phase
విశాఖ:
* పెందుర్తి, భీమిలి నియోజకవర్గాలలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్