పల్లెబాట పట్టిన నగరవాసులు

తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్నారు. సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి జంటనగరాల

admin1
Updated on: 12 Jan 2020 1:23 PM IST
పల్లెబాట పట్టిన నగరవాసులు
X

తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్నారు. సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి జంటనగరాల ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. తెల్లవారుజాము నుంచే వాహనాలు హైదరాబాద్‌ నుంచి పల్లె బాట పట్టాయి. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద టోల్‌ ఫీజు చెల్లించేందుకు వాహనదారులు భారీగా క్యూకట్టారు. టోల్ గేట్ సిబ్బంది విజయవాడ వైపు నాలుగు కాష్ అండ్ క్యారీ, ఐదు ఫాస్ట్ ట్యాగ్ లో వెళ్లే విదంగా ఏర్పాటు చేసినప్పటికి వందల సంఖ్యలో వాహనాలు రావడంతో.. ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు.

ఉదయం ఆరు గంటల నుంచే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ ఫీజు చెల్లించేందుకు సుమారు గంట వరకు వెయిట్ చేయాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. ఒకే సమయంలో వాహనాలు అధికంగా రావడం, ఫాస్టాగ్‌ ట్రాక్ లోకి.. క్యాష్ చెల్లించే వాహనాలు రావడంతో ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. ఫాస్టాగ్‌ ఉన్న వాహనదారులు కూడా ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకోవాల్సి వస్తోంది. ఆదివారం కూడా కావడంతో.. గత రెండు రోజులు కన్నా ఇవాళ రద్దీ మరింత పెరిగిందని అధికారులు అంటున్నారు. సాధారణ రోజుల్లో 25 వేల వరకు వాహనాలు వెళ్తుండగా.. ఇవాళ ఒక్క రోజే సుమారు 50వేలకు పైగా వాహనాలు వెళ్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

admin1

admin1

Next Story