వరల్డ్ టెలివిజన్ డే : కష్టాలతో ఆవిష్కరణ.. ఇష్టాల వినోదం.. టెలివిజన్!

వరల్డ్ టెలివిజన్  డే : కష్టాలతో ఆవిష్కరణ.. ఇష్టాల వినోదం.. టెలివిజన్!
x
Highlights

వినోదం లో విప్లవం టెలివిజన్. సాధారణంగా విప్లవం అనే దానికి కొంత పరిమితి ఉంటుంది. కానీ ఈ వినోద విప్లవానికి మాత్రం పరిమితి లేదు.

వినోదం లో విప్లవం టెలివిజన్. సాధారణంగా విప్లవం అనే దానికి కొంత పరిమితి ఉంటుంది. కానీ ఈ వినోద విప్లవానికి మాత్రం పరిమితి లేదు. కాలంతో పాటు ఈ విప్లవమూ పరుగులు తీస్తూనే ఉంటుంది. వీధి నాటకాలే వినోదం అనే స్థాయి నుంచి సినిమాగా.. టెలివిజన్ గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం టెలివిజన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఈరోజు(నవంబర్ 21) వరల్డ్ టెలివిజన్ డే! ఈ సందర్భంగా టెలివిజన్ కథా కామామీషూ మీకోసం!

ప్రయత్నాలు అప్పుడే ప్రారంభం..

టెలివిజన్ ఆవిష్కరణ 1922 లో జరిగింది. అయితే, దీనికి ప్రయత్నాలు మాత్రం 1842 లోనే మొదలయ్యాయి. టెలిగ్రాఫ్ పధ్ధతి కనుగొన్న సమయంలోనే అసలు టెక్స్ట్ బదులుగా చిత్రాల్ని కూడా ఇలా పంపంచడానికి వీలవుతుందా అని స్కాట్లాండ్ శాస్త్రజ్ఞుడు అలెగ్జాండర్ బెయిన్ కు వచ్చినా ఆలోచనే టెలివిజన్ ఆవిష్కరణకు మూలంగా చెబుతారు. ఆయన ఈ దిశలో చిన్న యంత్రాన్ని రూపొందించాడు. దానిని అయిదేళ్ల తరువాత బేక్ వెన్ అనే అయన అభివృద్ధి చేశాడు. ఇవి రకరకాలుగా సాగాయి. అయితే 1883 లో బెర్లిన్ విశ్వవిద్యాలయం లోని పోల్ నివ్ కో అనే విద్యార్థి రూపొందించిన మొదటి స్కానింగ్ పరికరం పెద్ద ముందడుగుగా నిలిచింది. తరువాత ఎన్నో ప్రయత్నాలు కొనసాగాయి. కానీ చివరికి అవన్నీ పూర్తి స్థాయి టెలివిజన్ గా రూపాంతరం చెందడానికి చాలా ఏళ్ళు పట్టింది.

విసుగులేని ప్రయత్నాల ఆవిష్కరణ టెలివిజన్!

ఎన్నో ఏళ్ళు టెలివిజన్ ఆవిష్కరణ వెనుక గడిచిపోయాయి. 1907 లో ఈ దిశలో కీలక ముందడుగు పడినా తరువాత ఎక్కడిదక్కడే అన్నట్టుగా ఆగిపోయింది. ఈ క్రమంలో స్కాట్లండ్ కి చెందిన ఓ క్రైస్తవ మతాధికారి కొడుకు జాన్ లోగీ బెయిర్డ్ పట్టు వదలని విక్రమార్కుడిలా చేసిన ప్రయత్నాలు అతి కష్టం మీద ఫలించాయి. ఇంజనీరింగ్ చదువుతున్న బెయిర్డ్ తన తండ్రి అనారోగ్య కారణాలతో చదువు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, టెలివిజన్ కనిపెట్టాలన్న ఆసక్తితో 1922 నుంచి తన పరిశోధనలు మొదలు పెట్టాడు. ఈ దిశలో ఆటను ఎదుర్కోని కష్టం లేదు. అనారోగ్యం.. కావలసిన డబ్బులు లేకపోవడం వంటి సమస్యలతో.. మేడమీది చిన్న చీకటి కొట్టులాంటి గదిలో తన పరిశోధనలు కొనసాగించాడు. ఎలక్ట్రికల్ వ్యాపారస్తుడి దగ్గర మూలపడ్డ ఓ పాత ఎలక్ట్రిక్ మోటారుని కొన్నాడు. చిన్న అట్టముక్క నుంచి నివ్‍కో ఫలకాన్ని తయారు చేశాడు. సైకిల్ షాప్ లో కొన్ని కటకాలను కొన్నాడు.మిలిటరీ స్టోర్ లో మూల పడేసిన పాత వైర్‍లెస్ టెలిగ్రాఫ్ పరికరాన్ని సంపాదించాడు. టార్చ్ బ్యాటరీలు, సూదులు, కొయ్యముక్కలు, కాస్త లక్క, దారాలు, జిగురు, గదిలో ఎక్కడ చూసినా పడిఉండే తీగలు - ఇవీ అతని ప్రయోగశాలలోని పరికరాలు! వీటితోనే అద్భుతాన్ని సృష్టించాడు. రెండేళ్లు శ్రమించి కొన్ని ఆకారాల్ని కొన్ని అడుగుల దూరం దాకా ప్రసారం చేయగలిగాడు. ఈ ఆవిష్కరణ చూసిన ఒక ఎలక్ట్రిక్ షాపు యజమాని తన దుకాణంలో ఈ పరికరంతో రోజుకు మూడు సార్లు ప్రసారాలు చేసేలా బెయిర్డ్ ని వినియోగించుకున్నారు. అఆకలి..డబ్బు అవసరం తో తొలుత ఆ పని చేసినా అయన లోని తృష్ణ చావలేదు.దాంతో ఆ దుకాణం విడిచిపెట్టి తిరిగి మరింత మెరుగైన టీవీ ప్రసారాల కోసం ప్రయత్నాలు కొనసాగించాడు.

ఆ తపన ఫలించి తొలిసారిగా 1925 అక్టోబరు 2 వ తేదీన ఓ కంపెనీలో పనిచేసే అబ్బాయి ముఖాన్ని ప్రసారం చేయగలిగాడు. ఇదే మొదటి టెలివిజన్ ప్రసారంగా చెప్పుకోవచ్చు. బీబీసీ ద్వారా తన పరికరాన్ని మరింత మెరుగు పరచాలని బెయిర్డ్ చేసిన ప్రయత్నాలు నాలుగేళ్ల తరువాత 1929 లో ఫలించాయి. బీబీసీ ఆ సంవత్సరం తొలిసారిగా ప్రయోగాత్మకంగా టీవీ ప్రసారాలు మొదలు పెట్టింది.

ఇక అక్కడి నుంచి టెలివిజన్ మెల్లగా వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. నలుపు తెలుపు ల నుంచి రంగుల్లోకి.. అక్కడ నుంచి వీడియో రికార్డింగ్ పరికరాలు కూడా వేగంగా తమ పరిధిని విస్తృత పరుచుకోవడంతో ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ టెలివిజన్ ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది.

వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా టీవీ కొనుక్కోవాలనుకునే వారికోసం ప్రముఖ ఆన్లైన్ సంస్థలు టీవీల రేట్లపై భారీ ఆఫర్లు ప్రకటించాయి..

ఫ్లిప్‌కార్ట్ 2018 నవంబర్ 21 నుండి నవంబర్ 25 వరకు ప్రపంచ టీవీ డే సంబరాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా గూగుల్ భాగస్వామ్యంతో వినియోగదారులకు పాత టీవీలకు బదులుగా కొత్త టీవీలను ఇచ్చే ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రకటించింది.

- CRT టీవీల పై 3 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ ఇస్తోంది.

- 24-అంగుళాల కంటే తక్కువ మోడల్స్ పై ఆరువేల వరకూ డిస్కౌంట్ ప్రకటించింది.

- 32-అంగుళాల కంటే తక్కువ మోడల్స్ పై ఎనిమిది వేల వరకూ డిస్కౌంట్ అందించనుంది.

- 43-అంగుళాల కంటే తక్కువ మోడల్స్ పై పన్నెండువేల వరకూ తగ్గింపు సౌకర్యాన్ని ప్రకటించింది.

- 55-అంగుళాల కంటే తక్కువ మోడల్స్ పై ఇరవై వేల వరకూ డిస్కౌంట్ ఇవ్వనుంది.

- 56-అంగుళాల కంటే తక్కువ మోడల్స్ పై ఇరవైఎనిమిది వేల వరకూ ఏక్స్చేంజి ఆఫర్ ప్రకటించింది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories