Health Tips: జామపండు తింటే కొంతమందికి కడుపునొప్పి వస్తుంది.. కారణం ఇదే..?

Why Does Eating Guava Cause Stomach Ache Know the Reason
x

Health Tips: జామపండు తింటే కొంతమందికి కడుపునొప్పి వస్తుంది.. కారణం ఇదే..?

Highlights

Health Tips: శీతాకాలంలో తినడానికి, తాగడానికి చాలా ఆహారాలు ఉంటాయి.

Health Tips: శీతాకాలంలో తినడానికి, తాగడానికి చాలా ఆహారాలు ఉంటాయి. కానీ కొన్ని పండ్లు శీతాకాలంలో మాత్రమే లభిస్తాయి. వాటిలో ఒకటి జామపండు. చలికాలంలో జామపండు తింటే కలిగే ఆనందమే వేరు. జామ ఆయుష్షు పరంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామపండులో ఉన్న చల్లటి ప్రభావం వల్ల అనేక వ్యాధులు దూరంగా ఉంటాయి. చలికాలంలో జామపండు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. జామ విత్తనాలను తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

జామపండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు కడుపునొప్పికి కారణమవుతుంది. జామపండును సరైన పద్ధతిలో తినకపోవడమే ఇందుకు కారణం. దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటే కడుపునొప్పి రాదు. చాలా మంది జామపండును తప్పుడు పద్ధతిలో తీసుకుంటారు. దీనివల్ల కడుపు నొప్పి, తిమ్మిరి మొదలవుతుంది. జామకాయలో పోషకాలతో పాటు పీచు పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండే జామపండును తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నయం అవుతుంది. దీంతో పాటు జీర్ణక్రియ ప్రక్రియ సజావుగా సాగుతుంది. జామపండును ఉప్పుతో కలిపి తింటే మంచిది. ఆయుర్వేద నిపుణులు వైద్యుల అభిప్రాయం ప్రకారం జామ పండులో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎప్పుడూ మధ్యాహ్న సమయంలోనే తినాలి. మధ్యాహ్న భోజనానికి ఒక గంట ముందు కానీ లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత కానీ జామపండు తినాలి. అప్పుడు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. జామపండు రాత్రి, ఉదయం, సాయంత్రం తినవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories