జుట్టు తెల్లబడటానికి కారణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

జుట్టు తెల్లబడటానికి కారణాలేంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
x
Highlights

అందమైన శిరోజాలంటే అందరికీ ఇష్టమే.. కురుల సంరక్షణ కోసం చేయని పనంటూ ఉండదు.. జుట్టు నల్లగా అందంగా ఆరోగ్యంగా పెరగాలన్నా.

అందమైన శిరోజాలంటే అందరికీ ఇష్టమే.. కురుల సంరక్షణ కోసం చేయని పనంటూ ఉండదు.. జుట్టు నల్లగా అందంగా ఆరోగ్యంగా పెరగాలన్నా... ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా... సరైన పోషకాలను శిరోజాలకు అందించాల్సి ఉంటుంది... ఈ మధ్యకాలంలో చాలా మందికి తెల్ల జుట్టు పెద్ద సమస్యగా మారుతోంది. సీనియర్ సిటిజన్ అయ్యాక నెరవాల్సిన జుట్టు 30 ఏళ్లకే తెల్లబడిపోతోంది... ఈ సమస్యతొ చాలా మంది యువత బాధపడుతున్నారు. తెల్ల జుట్టు నుంచి విముక్తిని పొందేందుకు హెన్నాలని, హెయిర్ కలర్‌లని, ట్రీట్‌ మెంట్స్ అని వేలకు వేలు తగలేస్తున్నారు.. కానీ అసలు సమస్య ఎలా మొదలైందో తెలుసుకోవడంలో విఫలమవుతున్నాము.. తెల్ల జుట్టు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా విటమిన్లు లోపించడం, ఆహారంలో మార్పు రావడంతో పాటు ఒత్తిడి పెరగడం... వీటితో పాటు వంశ పారంపర్యం కూడా కారణంగా చెబుతున్నారు వైద్యులు.

వాతావరణ కాలుష్యంతో జుట్టు రాలే సమస్యతో పాటు తెల్లబడటం జరుగుతోంది. థైరాయిడ్ సమస్య, మెంటల్ టెన్షన్స్, హెయిర్ ఫాల్‌కు వాడే షాంపూల వల్ల కూడా జుట్టు తెల్లబడుతోందని నిపుణులు చెబుతున్నారు. వయస్సుతోను, కాలంతోనూ సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తోంది. మరి ఈ సమస్య నుంచి బటయపడేందుకు కొన్ని సహజ సిద్ధమైన పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా చాలా మంది నెలకో షాంపూ మారుస్తుంటారు.. మార్కెట్‌లో ఏది కొత్తగా వచ్చినా దాన్ని ట్రై చేయాలని ఉత్సాహపడుతుంటారు. అలా కాకుండా దీర్ఘకాలంలో ఒకే రకమైన షాంపూను వాడటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు . తెల్లజుట్టును నల్లబరిచేందుకు కెమికల్ కలర్స్ వాడకుండా సహజ సిద్ధమైన ఆకుకూరలతో ప్యాక్ చేసుకుని వాడినట్లైతే మంచి ఫలితం కలనిపిస్తుంది. అలాంటిదే మెంతీ ఎగ్ ప్యాక్... గుడ్డులోని తెల్లసొన తీసుకుని అందుతో మెంతి ఆకుల పేస్టుని వేసుకుని తలకు ప్యాగా వేసుకోవాలి... రెండు గంటల తరువాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు త్వరగా రాదు. వచ్చిన తెల్ల జుట్టు కూడా మెల్లిమెల్లిగా నల్లబడుతుంది. గుడ్డు సొనను ఇష్టపడని వారు మజ్జికలో మెంతి ఆకుల పేస్టును వేసుకని ప్యాక్ తాయారు చేసుకుని వెంట్రుకలకు పట్టించవచ్చు.

ఇక అందరి ఇంట్లో లభించే మందార ఆకులను తీసుకుని వాటిని మెత్తగా పేస్ట్ చేసుకుని కొబ్బరి నూనె కలిపి ప్యాక్‌లా చేసుకుని దానిని జుట్టుకి పట్టించాలి.. తరువాత 2 గంటల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే... మంచి ఫలితం ఉంటుంది. కుంకుడు కాయలతో తలస్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక మనం నిత్యం పొద్దున్నే తీసుకునే కాఫీ పౌడర్ కూడా తెల్ల జుట్టు సమస్యను పారదోలుతుందని అంటున్నారు నిపుణులు. ఓ గ్లాస్‌ నీటిలో కాఫీ పొడిని బాగా మిరిగించి చల్లార్చి తరువాత జుట్టుకు పట్టించాలి. మసాజ్ చేయాలి. 30 నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వ్లల తెల్ల జుట్టు సమస్య నుంచి తప్పించుకోవచ్చు .

ఎప్పుడూ ఒకే రకమైన షాంపూను వాడడం మంచిది. మన ఇంట్లో దొరికే వాటితో సహజమైన చిట్కాలతో తెల్ల జుట్టును ఈజీగా నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ నాలుగు టిప్స్ లో ఏ ఒక్కటి పాటించినా తెల్ల జుట్టు దెబ్బకు మాయమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. లేదంటే వారానికి ఓ టిప్ చొప్పున మార్చి మార్చి వాడినా సరే సమస్య నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories