Weight Loss Tips: బ‌రువు త‌గ్గాలనుకుంటున్నారా? అయితే.. ఈ టిప్స్ పాటించండి.

Weight Loss Tips: బ‌రువు త‌గ్గాలనుకుంటున్నారా? అయితే.. ఈ టిప్స్ పాటించండి.
x
weight loss tips
Highlights

Weight Loss Tips: ప్రస్తుత ఉరుకుల ప‌రుగుల జీవితంలో ప్ర‌తి వ్య‌క్తి ఒత్తిడి, టెన్షన్ ల‌కు లోన‌వుతున్నారు. దీని ప్ర‌భావం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, లావుగా కావ‌డం జ‌రుగుతుంది. ఇదే స‌మ‌స్య ఆడ‌వాళ్ల‌కు త‌లెత్తితే.. చాలా ఒత్తిడికి లోనైతారు.

Weight Loss Tips: ప్రస్తుత ఉరుకుల ప‌రుగుల జీవితంలో ప్ర‌తి వ్య‌క్తి ఒత్తిడి, టెన్షన్ ల‌కు లోన‌వుతున్నారు. దీని ప్ర‌భావం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, లావుగా కావ‌డం జ‌రుగుతుంది. ఇదే స‌మ‌స్య ఆడ‌వాళ్ల‌కు త‌లెత్తితే.. చాలా ఒత్తిడికి లోనైతారు. కాస్త ఒళ్లు వ‌స్తే కంగారు ప‌డ‌తారు, స‌న్న‌గా నాజుగ్గా అవ్వాలని కోరుకుంటారు, ఒళ్లు వ‌చ్చినా పొట్ట వ‌చ్చినా చాలా ఇబ్బంది ప‌డ‌తారు, అయితే కొంద‌రికి బ‌రువు త‌గ్గాలని ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం ఉండ‌దు. స‌న్న‌గా అవ్వాలని ఎంతగానో ప్ర‌య‌త్నిస్తారు. అందులో భాగంగా తిండి మానెయ్యడం,వ్యాయామాలు చేయడం,బరువు తగ్గడానికి మందులు వాడడం లాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అయి‌తే చిన్న చిన్న పొర‌పాట్లు చేయ‌డం వ‌ల్ల కూడా బ‌రువు పెరుగుతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మనసు ప్రశాంతంగా ఉంచుకొని... నేను బరువు తగ్గుతున్నాననే సానూకూల దృక్ఫ‌‌థం ఉంటే చాలు.. ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారని పరిశోధనలు అంటున్నారు.

మీ కోసం కొన్ని టిప్స్‌:

- కోడిగుడ్లలో అధికంగా ల్యూసిన్‌ అనే అమైనో యాసిడ్ ఉంటుందట‌.. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందట. అయితే ఉడికించిన కోడిగుడ్డు మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉడికించిన కోడిగుడ్డులో పై భాగం తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించి, కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దీంతో ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేం.

- దానిమ్మ కూడా బ‌రువు త‌గ్గ‌డంలో స‌హ‌య ప‌డుతుంది. ఇందులో ఉండే పీచును కొద్దిగా తిన్న‌గానే పొట్ట నిండిన ఫీలింగ్‌ వస్తుంది. అందుకే ఎక్కువ తిన్నా బరువు పెరుగుతామేమోనన్న భయం ఉండదు.

- అలాగే ఆలివ్‌ ఆయిల్ ‌కూడా కోలెస్ట్రాల్ త‌గ్గించ‌డంలో మేలు చేస్తుంది. ఇందులోని మోనో శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ చెడు కొల్రెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ ను కాపాడతాయి. కాబట్టి బరువు పెరిగే సమస్య ఉండ‌దు.

- బ‌రువు త‌గ్గ‌డంలో చేప‌లు కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి ఇతర మాంసాల జోలికి పోకుండా వీలైనంత ఎక్కువగా చేపలు తింటే చాలా బెట‌ర్‌.

- బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ప్రోటీన్స్ ఉండేలా చేసుకోవాలి. తద్వారా రోజంతా తక్కువ ఆహారం తీసుకుంటారు. రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఓ కప్పు కాటేజ్ వెన్న, ఓ గిన్నెడు గ్రీక్ యోగర్ట్ వంటివి తీసుకుంటే... ప్రోటీన్స్ పెరుగుతాయి.

- వెజిటబుల్‌ సూప్స్‌ వల్ల కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. పైగా భోజనం ముందు వాటిని తాగితే కడుపు నిండినట్టు అనిపించి ఎక్కువ తినం. కాబట్టి వెజిటబుల్‌ సూప్స్‌ తాగడం మంచిదనేది పరిశోధనలు చెపుతున్నాయి .

- భోజనానికి ముందు ఓ నాలుగు బాదం పప్పులు, జీడిపప్పు వంటివి తింటే... అవి పొట్ట ఫుల్లైన ఫీల్ కలిగిస్తాయి. తద్వారా భోజనం ఎక్కువ తినకుండా ఉంటాం. పైగా... అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చెడు కొవ్వును తగ్గించి, మంచి కొవ్వును పెంచుతాయి. బాడీకి కావాల్సిన ఎనర్జీ, ఫైబర్, మెగ్నీషియం వంటివి అందిస్తాయి.

-భోజనానికి ముందు సలాడ్ రూపంలో కూరగాయల్ని తీసుకోండి. ఇది మీ పొట్ట నిండేలా చేస్తుంది. పైగా ఎంతో ఆరోగ్యం కూడా. సలాడ్‌లో ఎక్కువ కేలరీలు ఉండని ఆకుకూరలు, కూరగాయల్ని వాడాలి. సలాడ్లు ఆకలిని తగ్గిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories