Black Tea Benefits: 'బ్లాక్ టీ'నే సో బెట‌ర్‌.. రోగ‌నిరోధక శక్తి పెరుగుదల

Black Tea Benefits: బ్లాక్ టీనే సో బెట‌ర్‌..  రోగ‌నిరోధక శక్తి పెరుగుదల
x
BLACK TEA
Highlights

Black Tea Benefits: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అధికంగా ఇష్ట‌ప‌డే పానీయం టీ. అవును.. అతిశయోక్తి కాదేమో. ఉదయం లేవగానే ఓ టీ క‌ప్పు తాగితే.. ఆ రోజంతా ఫ్రెష్‌గా ఉంటుందని చాలా మంది భావిస్తారు.

Black Tea Benefits: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అధికంగా ఇష్ట‌ప‌డే పానీయం టీ. అవును.. అతిశయోక్తి కాదేమో. ఉదయం లేవగానే ఓ టీ క‌ప్పు తాగితే.. ఆ రోజంతా ఫ్రెష్‌గా ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇక తలనొప్పిగా ఉన్నా.. బద్ధకంగా ఉన్నా.. ఆఫీస్ పని వల్ల ఒత్తిడిగా అనిపించినా.. ఓ కప్పు టీ తాగాల్సిందే. ఈ టీ ల‌లో కూడా చాలా ర‌కాలున్నాయి. ఈ రోజుల్లో డాక్టర్ల సలహాల వల్ల చాలా మంది గ్రీన్ టీ, తులసి ఆకుల టీ, లెమన్ టీ, ఆరెంజ్ టీ, గ్రీన్ కాఫీ, మాచా టీ వంటివి కూడా తాగుతున్నారు. ఐతే... వీటితోపాటూ... రెగ్యులర్‌గా బ్లాక్ టీ కూడా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. బ్లాక్ టీలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు, ప్రయోజనాల్ని ఓ సారి తెలుసుకుందాం.

ప్ర‌యోజ‌నాలు:

- మ‌నం రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంటాం. దీనివల్ల పంటిలో క్యావిటీలు ఏర్పడతాయి. బ్లాక్ టీతో ల్ల క్యావిటీలకు చెక్ పెట్టోచ్చు. అలాగే బ్లాక్‌ టీలోని పాలిఫినాల్స్‌ పళ్ల పిప్పిని తొలగిస్తుంది.

- వ‌య‌స్సు పెరిగిన కొద్ది ఎముక‌లు సాంద్ర‌త త‌గ్గుతుంది. ఈ స‌మ‌స్య 30 యేండ్ల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే రోజూ బ్లాక్‌ టీ తాగడం వల్ల ఎముకలు బలంగా మారే వీలుంటుంది. అంతేకాదు అర్థరైటిస్‌ వంటి వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎముకలను బలంగా ఉండేలా చేస్తాయి.

- ప్రస్తుత పోటీ ప్ర‌పంచంలో ... వ‌య‌స్సుతో సంబంధ‌లేకుండా డయాబెటిస్‌ వచ్చేస్తోంది. కానీ రీసర్చ్‌ ప్రకారం మీరు రోజూ ఒకటి లేదా రెండు కప్పుల బ్లాక్‌ టీ తాగితే 70 శాతం మేర డయాబెటిస్‌ వచ్చే ముప్పు తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు టైప్‌ 2 డయాబెటిస్‌ని రాకుండా చేస్తుంట‌.

- ప్రస్తుతం బిజీ లైఫ్‌ స్టైల్‌ వల్ల ప్రతి ఒక్కరూ ఒత్తిడితోనే జీవిస్తున్నారు. బ్లాక్‌ టీలోని లిథినైన్‌ యాసిడ్‌.. ఒత్తిడితో పాటు అలసటను కూడా తగ్గిస్తుంది.

- బ్లాక్‌ టీ రోగ నిరోధక శక్తిని పెంచి.. వివిధ రకాల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మనకు సహాయ పడతాయి. జీర్ణ వ్యవస్థను కాపాడేందుకు ఇది తోడ్పడుతుంది.

- బ్లాక్ టీ లో ఉన్న ఆల్కైలమీన్ యాంటిజెన్స్, టానిన్స్ రోగనిరోధక శక్తి ని పెంచి జీర్ణకోశాన్ని బలోపేతం చేస్తాయి.

- కొంతమందికి కాలాలు (వానాకాలం, ఎండాకాలం, చలికాలం) మారగానే అలెర్జీలు వస్తుంటాయి. అలాంటి వాళ్లు రోజుకు రెండు, మూడు బ్లాక్ టీలను తాగాలి. దాంతో అలెర్జీలకు చెక్ పెట్టినట్లవుతుంది.

- జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న సమస్యలను కూడా ఇది ఇట్టే తగ్గించేస్తుంది. అలాగే మన శరీరంలోని వైరస్‌, బ్యాక్టీరియాలను బయటకు పంపడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

- పేగుల్లో వ్యర్థాలపై బ్లాక్ టీ యుద్ధం చేస్తుంది. ఫలితంగా పేగుల్లో మంట, నొప్పి వంటివి తగ్గుతాయి. ఇందుకోసం బ్లాక్ టీలో తేనె కలుపుకొని తాగితే, డయేరియా (విరేచనాలు) తగ్గుతుంది.

- బ్లాక్ టీలో పాలిఫినాల్స్ అనే యాంటీ-ఆక్సిడెంట్స్ పుష్కలం గా ఉంటాయి. దీంతో మెటబాలిజం బూస్ట్ అయి అరుగుదల బాగుంటుందని అంటారు. పాలీఫెనాల్స్ బరువుని తగ్గించడంలో తోడ్పడుతాయి అంటారు, గుండెకు కూడా మేలు చేస్తుంది.

బ్లాక్ టీ తయారీ విధానం:

బ్లాక్‌ టీని కూడా మామాలు టీ మాదిరిగానే తయారుచేయవచ్చు. కాకపోతే ముందుగా నీటిని మరిగించి అందులో టీ పౌడర్‌ వేసుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. అలాగే యాలకులు, అల్లం లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.

మార్కెట్లో చాలా రకాల టీ బ్యాగ్స్‌ అందుబాటులో ఉంటాయి. వీటిని వివిధ పదార్థాలతో కలిపి తయారుచేస్తారు. మనం ఇంట్లో నీటిని వేడి చేసి అందులో టీ బ్యాగ్స్‌ వేసి నిమిషం పాటు ఉంచాలి. తర్వాత బ్లాక్‌ టీ ని తాగేయడమే..

Show Full Article
Print Article
Next Story
More Stories