Immunity Booster Kashayam: కషాయంతో క‌రోనాకు చెక్‌.. రోగ‌నిరోధ‌క శక్తిని పెంచుకోవ‌డానికి ఓ చిట్కా..

Immunity Booster Kashayam: కషాయంతో క‌రోనాకు చెక్‌.. రోగ‌నిరోధ‌క శక్తిని పెంచుకోవ‌డానికి ఓ చిట్కా..
x
Highlights

Immunity Booster Kashayam: చికిత్స కన్నా నివారణే మేలు. ఈ మాట అందరికీ తెలిసిందే. ఇప్పుడు కరోనా విషయంలోనూ అంతే. ఈ వైరస్ బారిన పడకుండా ఉండటమే ఇప్పుడు అందరికీ అవసరం.

Immunity Booster Kashayam: చికిత్స కన్నా నివారణే మేలు. ఈ మాట అందరికీ తెలిసిందే. ఇప్పుడు కరోనా విషయంలోనూ అంతే. ఈ వైరస్ బారిన పడకుండా ఉండటమే ఇప్పుడు అందరికీ అవసరం. దానికి ఒక్క‌టే మార్గం మ‌నలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం. కావున‌ ప్ర‌తి ఒక్క‌రూ ఇమ్యూనిటీ పెంచుకోవడంపై దృష్టి .సారించాలి. ఈ క్ర‌మంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోవచ్చని సూచిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు, రోగాల నివారణ కోసం ఆయుర్వేదం ఉపయోగపడుతుందని కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ చెబుతుంది. కాలానుగుణంగా దినచర్యలో త‌ప్ప‌నిస‌రిగా మార్పులు చేసుకోవాల‌ని, ద్వారానే ఆరోగ్య‌వంత‌మైన జీవించ‌వ‌చ్చున‌ని ఆయుష్ మంత్రిత్వ శాఖ చెబుతుంది.

ఆయుష్ సూచించిన చిట్కాల్లో ముఖ్య‌మైన‌ది క‌షాయం. రోజూ కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరిగి వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుకునే కషాయం ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకుని రోజూ తీసుకుంటే.. సీజనల్ వ్యాధులు కూడా దరిచేరవ‌ని వైద్యులు చెబుతున్నారు.

కషాయం తయారీకి కావలసిన పదార్థాలు:

ఒక్క లీట‌ర్ నీటికి.. చిన్న అల్లంముక్క, అర చెంచా తేనె, నిమ్మకాయ, తులసి ఆకులు, దాల్చిన చెక్క, ప‌ది లవంగాలు, 10 మిరియాలు, పుదీనా, ఒక్క టీ స్పూన్ ప‌సుపు,

త‌యారీ విధానం:

గిన్నెలో నీళ్లు తీసుకుని స్టౌవ్ పై పెట్టి.. ‌ ముందుగా లవంగాలు, దాల్చ‌న చెక్క, అల్లం ముక్క‌( లేక పోతే సోంటీ వాడొచ్చు), పుదీన ఆకులు, తుల‌సి ఆకులు వేసి ఇంకా కాసేపు మ‌రిగించాలి. ఆపై మిరియాలు, ధ‌నియాల కూడా కచ్చా పచ్చాగా దంచి నీళ్లలో వేయాలి. నీటి ప‌రిమాణం లీట‌ర్ నుంచి ముప్పావు లీట‌ర్‌కు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించాలి. అప్ప‌డే ఆ ప‌దార్థాల్లో ఉన్న పోష‌కాలు నీటిలోకి వ‌స్తాయి. ఆ త‌ర్వ‌త కొద్దిసేపు చ‌ల్లారించుకుని నిమ్మ‌కాయ‌, తేనే క‌లుపుకుని తాగేయ‌డమే.

ఇలా త‌యారు చేసిన క‌షాయాన్ని రోజుకు రెండు సార్లు తాగితే .. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సీజ‌న‌ల్ సమస్యలకు చక్కటి నివారిణిగా పనిచేస్తుంది. ఇందులోని పదార్థాలన్నీ యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఇంకా జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపునొప్పి, మలబద్దకం, కడుపులో మంట వంటి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని ఔషధంలాగ పనిచేస్తుంది.

వీటితో పాటు రోజంతా వేడి నీళ్లు తాగుతూనే ఉండాలి. ఇలా చేయ‌డం ద్వారా శరీరంలోని వ్యర్థాలు, మలినాలు బయటకు వెళ్లిపోతాయి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం, చేయాలి. అలాగే వంటలో ఎక్కువ‌గా పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఉపయోగించాలి. అలాగే .. రోజూ పసుపుపాలు తాగడం కూడా మంచిదని కేంద్ర‌ ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచిస్తుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories