Health Tips: ఈ పండ్లు తినకుంటే రోగాలని తట్టుకోలేరు.. జాగ్రత్త..!

Vitamin C Rich Fruits Help Strengthen the Immune System
x

Health Tips: ఈ పండ్లు తినకుంటే రోగాలని తట్టుకోలేరు.. జాగ్రత్త..!

Highlights

Health Tips: శీతాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ అనేక వ్యాధులని మోసుకొస్తుంది.

Health Tips: శీతాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ అనేక వ్యాధులని మోసుకొస్తుంది. అందుకే ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం అవసరం. చలికాలంలో అనేక రకాల పండ్లను ఆహారంలో చేర్చుకోవచ్చు . ఇవి వైరల్ వ్యాధుల ప్రమాదాన్ని నివారించడానికి పని చేస్తాయి. విటమిన్లు పుష్కలంగా ఉండే పండ్లను రోజూ తీసుకోవాలి. ఇవి వింటర్ సీజన్‌లో రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి. ఆహారంలో ఏ పండ్లను చేర్చుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

నారింజ

నారింజలో విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

జామ

జామపండులో విటమిన్ సి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా రక్షించడానికి పని చేస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. జామపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

దానిమ్మ

దానిమ్మపండును జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. దానిమ్మలో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షించడానికి పనిచేస్తుంది. అనేక ఇతర వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

సీతాఫలం

ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇందులో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షించడానికి ఇవి పనిచేస్తాయి.

యాపిల్‌

చలికాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులని నివారించడానికి పనిచేస్తుంది. మలబద్దకాన్ని తొలగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories