Health Tips: చుండ్రు క్లీనింగ్‌ కోసం పెరుగు ట్రై చేయండి.. సూపర్‌ రిజల్ట్‌ ఉంటుంది..!

Try Curd for Dandruff Cleaning Super Result
x

Health Tips: చుండ్రు క్లీనింగ్‌ కోసం పెరుగు ట్రై చేయండి.. సూపర్‌ రిజల్ట్‌ ఉంటుంది..!

Highlights

Health Tips: నేటికాలంలో మారుతున్న వాతావరణం వల్ల జుట్టు మొత్తం పాడవుతుంది.

Health Tips: నేటికాలంలో మారుతున్న వాతావరణం వల్ల జుట్టు మొత్తం పాడవుతుంది. సాధారణంగా శీతాకాలంలో తలలో మురికి పేరుకుపోయి చుండ్రు, దురద సమస్యలు ఎదురవుతాయి. క్యూటికల్స్ మురికితో మూసుకుపోతాయి. దీని కారణంగా జుట్టు నాణ్యత క్షీణిస్తుంది. ఈ పరిస్థితిలో జుట్టును లోతుగా శుభ్రపరచడం అవసరం. ఇలాంటి సమయంలో పెరుగు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చనిపోయిన చర్మ కణాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఇందులో పెద్ద మొత్తంలో ప్రొటీన్ లభిస్తుంది. ఇది మీ జుట్టుకు బలాన్ని చేకూరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి పెరుగు హెయిర్ ప్యాక్‌ ఎలా తయారుచేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

పెరుగు హెయిర్ ప్యాక్‌ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. అందులో 1 కప్పు పెరుగు, 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని కలపాలి. తరువాత ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్‌ చేయాలి. పేస్టులా మార్చాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలపై పూర్తిగా అప్లై చేయాలి. తరువాత చేతులతో తలపై మసాజ్ చేయాలి. దీనిని సుమారు 30 నుంచి 40 నిమిషాల వరకు అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలి. తరువాత జుట్టును నీటితో శుభ్రం చేసుకోవాలి. తేలికపాటి షాంపూ సహాయంతో శుభ్రంగా కడగాలి. ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ప్రయత్నించాలి. జుట్టు మృదువుగా, శుభ్రంగా కనిపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories