Brain Health: మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్‌ తీసుకోవాల్సిందే..

Brain Health
x

Brain Health: మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఫుడ్‌ తీసుకోవాల్సిందే..

Highlights

Brain Health: మనం తీసుకునే ఆహారం మన మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. మంచి పోషకాలు మెదడును చురుకుగా, స్పష్టంగా ఆలోచించేలా చేస్తాయి.

Brain Health: మనం తీసుకునే ఆహారం మన మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. మంచి పోషకాలు మెదడును చురుకుగా, స్పష్టంగా ఆలోచించేలా చేస్తాయి. అదే సమయంలో అనారోగ్యకరమైన ఆహారం జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. అందుకే మెదడును ఆరోగ్యంగా ఉంచేందుకు సరైన ఆహారం మరియు సప్లిమెంట్లు అవసరం. క్యాలిఫోర్నియాలోని బ్రెయిన్ ఆప్టిమైజేషన్ క్లినిక్ వ్యవస్థాపకురాలు, న్యూరోకాగ్నిటివ్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ హీథర్ శాండిసన్, 15 ఏళ్ల అధ్యయనం తర్వాత మెదడును ఆరోగ్యంగా ఉంచే 5 ముఖ్యమైన సప్లిమెంట్లను సూచించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూట్రోపిక్స్:

న్యూట్రోపిక్స్ మానసిక సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, అమైనో ఆమ్లాలు, మూలికలు వంటి పోషకాలు ఉంటాయి. కొన్నింటిలో కొంత కెఫిన్ కూడా ఉంటుంది. ఇవి ఏకాగ్రత, మానసిక స్థితి, నిద్ర నాణ్యత మెరుగుపరచడంలో ఉపయోపడతాయి.

విటమిన్ D, K:

విటమిన్‌ D, K మెదడు ఆరోగ్యానికి కీలకం. విటమిన్ D మెదడు కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. విటమిన్ K మాత్రం కాల్షియాన్ని సరైన విధంగా శరీరంలో పంపిణీ చేసి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రెండు విటమిన్లు కలసి మెదడుకు రక్షణగా నిలుస్తాయి.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు:

ఒమేగా-3 న్యూరో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో, గుండె జబ్బుల అవకాశాలను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె, మెదడు ఒకదానికొకటి అనుసంధానమై ఉండటం వల్ల, ఒమేగా-3 ప్రయోజనాలు రెండింటికీ వర్తిస్తాయి. ఇవి మెదడు కణాల్లో కలిసిపోయి మెదడును చురుగ్గా ఉంచుతాయి.

ప్రోబయోటిక్స్:

ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గట్ మైక్రోబయోమ్, మెదడు పనితీరు మధ్య బలమైన సంబంధం ఉంది. మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచి, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తి ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

జీర్ణ ఎంజైములు:

వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి తగ్గుతుంది. ఇది ఆహారాన్ని సరిగ్గా జీర్ణించేందుకు అవసరం. జీర్ణ ఎంజైములు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణమై, పోషకాలు పూర్తిగా అందుతాయి. ఇది మెదడుకు కావలసిన శక్తిని అందించడంలో సహాయపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories