Gastric Problems: ఎసిడిటికీ చెక్ పెట్టే కొన్నిచిట్కాలు

Tips to Control Gastric Problems
x

Gastric Problems:(File Image) 

Highlights

Gastric Problems: మహిళలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా అందరిలోనూ ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు.

Gastric Problems: గతంలో ఎసిడిటీ కారణంగా కడుపులో మంట, గ్యాస్‌ వల్ల కడుపు ఉబ్బరం అనే సమస్యలు కేవలం ఒక వయసు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడవి చిన్న వయసు వారిలోనూ కనిపిస్తున్నాయి. మహిళలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఆధునిక నగర జీవనశైలి (అర్బన్‌ లైఫ్‌స్టైల్‌), మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం, తిన్న వెంటనే పడుకోవడం, ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం, ఉప్పు, కారం, మసాలాలు అధికరంగా ఉంటున్నాయి. పీచు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వంటి వాటి వల్ల ఎసిడిటీ కి దారితీస్తున్నాయి. తీవ్రమైన పని ఒత్తిడి, రాత్రిషిఫ్ట్‌లలో పని కారణంగా ఆహారపు వేళలు మారుతుండటం, అర్ధరాత్రి, అపరాత్రి వేళల్లో ఆహారం తీసుకోవడంతో వేళగాని వేళల్లో యాసిడ్‌ ఎక్కువగా ఉత్పత్తి అయి గ్యాస్ సమస్యలు వస్తున్నాయి. ఎసిడిటీ సమస్యను పూర్తిగా తొలగించలేమనే చేదు విషయాన్ని మనం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. కానీ, ఆహారం విషయం జాగ్రత్తలు పాటిస్తూ.. ఈ చిట్కాలను ప్రయత్నిస్తే.. తప్పకుండా మీకు ఉపశమనం లభిస్తుంది. అవేంటో మన "లైఫ్ స్టైల్" లో చూద్దాం.

ఎసిడిటీకి చెక్ పెట్టే కొన్ని చిట్కాలు...

ఒక్కోసారి ఉదరంలో పుట్టుకొచ్చే ఎసిడిటీ చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏమి చేసినా ఒక పట్టాన తగ్గదు. అలాంటి పరిస్థితుల్లో బాగా మగ్గిన అరటిపండును తినాలి. అందులోని పొటాషియం ఎసిడిటీని తగ్గిస్తుంది. కడుపులో ఇబ్బందులు తొలగుతాయి.

ఒక కప్పు మరిగించిన నీటిలో ఒక టేబుల్‌స్పూన్‌ సోంపు వేసి మూత పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఉదయాన్నే వడకట్టిన ఆ నీటిలో ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే ఎసిడిటీ నుండి ఉపశమనం కలుగుతుంది.

కాచి చల్లార్చిన గ్లాసుడు పాలలోకి ఒక స్పూను తేనె కలుపుకుని తాగండి. పాలలోకి అలవాటు ప్రకారం పంచదార లేదా బెల్లం, హార్లిక్స్‌ వంటివేవీ కలపకూడదు. పచ్చటి తులసి ఆకుల్ని వేడి నీటిలో మరగనివ్వండి. కాసేపయ్యాక చల్లారిన తరువాత ఆ నీటిని సేవించండి. రోజూ ఇలా చేస్తే వారం పది రోజుల్లో గ్యాస్‌ కొంతవరకైనా తగ్గుతుంది.

మజ్జిగలోని లాక్టిక్‌ ఆసిడ్‌ కడుపులోని గ్యాస్‌కు కల్లెం వేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గ్యాస్‌కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తిన్నప్పుడు మజ్జిగ తీసుకోవడం మరవొద్దు. కడుపుబ్బరం తక్షణ సమస్యకు చక్కటి పరిష్కారం తాజా కొబ్బరి బోండం తాగడం. గ్యాస్‌కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. రీఫ్రెష్‌ అవుతారు.

పూర్వం భోజనం తిన్న తరువాత ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకునేవారు పెద్దలు. ఇప్పటి తరానికి ఆ అలవాటు పోయింది కానీ.. బెల్లం వల్ల గ్యాస్‌ ఎంతగానో తగ్గుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం కూడా లభిస్తుంది. ఒక కప్పు నీటిని మరగనివ్వండి. అందులో ఒక టేబుల్‌స్పూన్‌ సోంపు వేసి కాసేపు అలాగే ఉంచండి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఆ నీటిలోకి ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే ఎసిడిటీకి పరిష్కారం లభించినట్లే.

కాచి చల్లార్చిన గ్లాసుడు పాలలోకి ఒక స్పూను తేనె కలుపుకుని తాగండి. పాలలోకి అలవాటు ప్రకారం పంచదార లేదా బెల్లం, హార్లిక్స్‌ వంటివేవీ కలపకూడదు.ఆహారం తీసుకున్న కొన్ని గంటలకు వికారంగా అనిపించినా, తల తిరుగుతున్నట్టు అనిపించినా, వామ్టింగ్ సెన్సేషన్ కలిగినా.. అది గ్రాస్ట్రిక్ ట్రబులే. ఎక్కువగా చెమటలు పడుతున్నా, గుండెల్లో మంట అనిపించినా జీర్ణ సమస్యలు తరచూ కనిపిస్తున్నా, మలబద్ధకం సమస్య ఉన్నా.. ఇవన్నీ ఎసిడిటీ లక్షణాలే. ఈ లక్షణాలు దీర్ఘకాలం ఉంటే తీవ్రమైన ఎసిడిటీగా భావించి కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి.

మనం నిత్యం వంటకాల్లో ఉపయోగించే వాములో విటమిన్లు, ఫైటో కెమికల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాము పచ్చిగా తీసుకుంటే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం దూరమవుతాయి. వామును కొద్దిగా వేయించి పొడి చేసుకుని నెయ్యి కలిపి ఈ మిశ్రమాన్ని అన్నంతో కలిపి తీసుకుంటే గ్రాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేసే గుణం వాముకు ఉంది. నిమ్మరసంలో వాము పొడి కలుపుకొని తాగితే పుల్లటి తేన్పులు తగ్గుతాయి.

సోంపు గింజలను నీటిలో మరిగించి ఆ నీటిని వేడిగా తాగితే ఎసిడిటీ సమస్య చెక్ పెట్టవచ్చు. సొంపులోని యాంటీ అల్సర్ గుణాలు ఎసిడిటీ సమస్యకు తక్షణ ఉపశమనం చూపిస్తుంది. అన్నం తిన్న వెంటనే కొన్ని సొంపు గింజలను నమిలితే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇక.. నీట్లో సొంపు గింజల్ని ఒక రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఆ నీటిలో తేనె కలిపి తాగితే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీటిని రోజుకు మూడు సార్లైనా తాగొచ్చు.

రోజూ ఓ గ్లాస్ పాలను క్రమం తప్పకుండా తాగితే గ్యాస్ ట్రబుల్ సమస్య రాదట. వేడివేడి పాలు కాకుండా చల్లటి పాలు తాగితే మరింత మంచిదట. దీని వల్ల కడుపు మంట, పుల్లటి తేన్పులు, వికారం, గుండె మంట వంటివి తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పాలలో ఉండే కాల్షియం కడుపులో అధికంగా ఉత్పత్తయ్యే యాసిడ్‌ను న్యూట్రలైజ్ చేస్తుందట. పెరుగుకు కూడా యాసిడ్‌ను కంట్రోల్ చేసే గుణం ఉంది. పెరుగు సహజమైన ప్రొబయోటిక్‌గా పడిచేస్తూ జీర్ణ ప్రక్రియ సజావుగా సాగేలా చేస్తుంది.

గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో ఓ టీస్పూన్ తేనె కలుపుకొని తాగితే ఎసిడిటీకి తక్షణ ఉపశమనం లభిస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందట. తేనెలో దాల్చిన చెక్క పొడి కలిపి లంచ్ లేదా డిన్నర్ చేయబోయే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ రానేరాదుని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అన్నింటికి తోడు సీజనల్ గా వచ్చే పండ్లు ను తీసుకుంటూ శరీరానికి తగిన వ్యాయామాలు చేస్తూ వుండాలి.

వీటికి దూరంగా...

ఊరగాయలు, చట్నీలు, వెనిగర్ వంటివి ఎంత తక్కువ తింటే అంత మంచిది. కాఫీ, టీలకు దూరంగా ఉండండి. జంక్ ఫుడ్, మసాలాలు, శీతలపానీయాల జోలికి అస్సలు వెళ్లొద్దు. సరైన వేళకి భోజనం చేస్తూ వుండాలి. దొరికింది కదా ఒక్కసారిగా పొట్టలో కుక్కేయకుండా మితంగా తింటూ వుండాలి. ఒకరోజు ఫుల్ గా లాగించేసి... మరుసటి రోజు ఆహారాన్ని స్కిప్ చేయకూడదు. రోజుకు ఎంత కావాలో అంత తింటూ వుండాలి.

పై తెలిపిన చిట్కాలను పాటిస్తూ ఎసిడిటీని పెంచే వాటికి దూరంగా వుంటే గ్యాస్ సమస్యకు పరిష్కారం దొరికనట్లే. సో ఇంకెందుకు ఆలస్యం.

Show Full Article
Print Article
Next Story
More Stories