Health Tips: ఊబకాయానికి చెక్ పెట్టాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

These Should be Included in the Diet to Check Obesity
x

Health Tips: ఊబకాయానికి చెక్ పెట్టాలంటే డైట్‌లో ఇవి ఉండాల్సిందే..!

Highlights

Health Tips: ఎల్లప్పుడు ఫిట్‌గా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. నేటి కాలంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారింది.

Health Tips: ఎల్లప్పుడు ఫిట్‌గా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. నేటి కాలంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. దీనికి కారణం అనేకం ఉండవచ్చు. ఇందులో ముఖ్యమైనవి బయట తినడం, వ్యాయామం చేయకపోవడం లాంటివి ఉన్నాయి. మీరు ఈ సమస్యతో పోరాడుతున్నట్లయితే వీలైనంత త్వరగా మీ దినచర్యలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాన్ని చేర్చుకోవాలి. దీనివల్ల సులువుగా మీరు ఊబకాయాన్ని తొలగించవచ్చు. ఇది మాత్రమే కాదు మీరు కొన్ని నెలల్లో స్లిమ్‌గా కనిపిస్తారు.

1. నీరు తీసుకోవడం: మన శరీరంలో 60% నీరు ఉంటుంది. ఒక వ్యక్తి రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. త్వరగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

2. జ్యూస్ తీసుకోవడం: కళ్ళు, చర్మం, జీర్ణశక్తిని బలోపేతం చేయడానికి మీరు రోజు ఒక గ్లాసు పండ్ల రసం తీసుకోవాలి. జ్యూస్‌లో ఉండే ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మీ అవయవాలను దృఢంగా చేస్తాయి. పొట్టలో కొవ్వు పేరుకుపోకుండా చేస్తాయి.

3. పాల ఉత్పత్తుల వినియోగం: గత కొన్ని సంవత్సరాలుగా పాల ఉత్పత్తులు మానవులకు అత్యంత ముఖ్యమైన ఆహారంగా చెప్పవచ్చు. ఉదాహరణకు- పాలు, పెరుగు, మజ్జిగ. వీటిని సమయానుకూలంగా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే క్యాల్షియం, ప్రొటీన్, పొటాషియం, ఫాస్పరస్ అనే మూలకాలు మిమ్మల్ని వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.

4. పప్పుధాన్యాల వినియోగం: భారతదేశంలో అనేక రకాల పప్పులు దొరుకుతాయి. మీరు మొలకెత్తిన పప్పులను తినవచ్చు. అలాగే ఉడికించిన తర్వాత కూడా తినవచ్చు. వీటివల్ల సులువుగా బరువు తగ్గవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories