Health Tips: గుడ్లతో పాటు ఈ ఆహారాలు తీసుకుంటే ఆస్పత్రికే.. జాగ్రత్త..!

These Foods Should not be Eaten Along With Eggs Health Problems Will Occur
x

Health Tips: గుడ్లతో పాటు ఈ ఆహారాలు తీసుకుంటే ఆస్పత్రికే.. జాగ్రత్త..!

Highlights

Health Tips: గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Health Tips: గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్-బి, విటమిన్ బి12, రైబోఫ్లావిన్, బయోటిన్, థయామిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుడ్లు తినడం వల్ల ఎముకలు, మెదడు, కళ్లు, కండరాలు, వెంట్రుకలు బలపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అయితే గుడ్లతో కొన్ని ఆహారాలని కలిపి తినకూడదు. చాలా ప్రమాదం ఫుడ్‌ పాయిజన్‌ జరిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఫుడ్స్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

టీ

చాలా మంది టిఫిన్‌గా గుడ్లు తింటారు. అయితే ఆ సమయంలో టీ కూడా తాగుతారు. గుడ్లతో టీ తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇది మలబద్ధకం, అజీర్ణానికి కారణమవుతుంది. కాబట్టి గుడ్డు, టీ కలిపి తీసుకోవడం మానేయాలి.

పుల్లని ఆహారాలు

గుడ్లతో పాటు పుల్లటి ఆహారాలు తినడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

సోయాబీన్ ఉత్పత్తులు

సోయాబీన్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గుడ్లతో పాటు సోయాబీన్‌తో చేసిన వాటిని తినడం వల్ల ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

పచ్చి పాలు

పచ్చి పాలను గుడ్లతో కలిపి తినకూడదు. పచ్చి పాలలో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా గుడ్లలో కలపడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఫుడ్‌ పాయిజనింగ్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది.

తీపి పదార్థాలు

గుడ్లతో కలిపి తీపి పదార్థాలు తినడం మానుకోండి. గుడ్డులో ఉండే అమినో యాసిడ్‌లు తీపి పదార్థాలతో కలసి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందుకే ఈ కాంబినేషన్‌ మంచిది కాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories