Health Tips: ఈ ఫుడ్స్‌ రక్తం కొరతని నివారిస్తాయి.. డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే..!

These Foods Prevent Blood Deficiency Must be in the Diet
x

Health Tips: ఈ ఫుడ్స్‌ రక్తం కొరతని నివారిస్తాయి.. డైట్‌లో కచ్చితంగా ఉండాల్సిందే..!

Highlights

Health Tips: మన శరీరానికి అత్యంత ముఖ్యమైనది రక్తం.

Health Tips: మన శరీరానికి అత్యంత ముఖ్యమైనది రక్తం. ఇది సరిపడ లేకుంటే చాలా అనారోగ్యం సమస్యలు తలెత్తుతాయి. రక్తం లేకపోవడం వల్ల శరీరం బలహీనంగా మారి కళ్లు తిరగడం, అలసట, బలహీనత వంటి అనేక సమస్యలు ఏర్పడుతాయి. రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. ఈ వ్యాధిలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ స్థాయి తగ్గుతుంది. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఆహారంలో ఐరన్‌ అధికంగా ఉండే వాటిని చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

దానిమ్మ

దానిమ్మపండులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఆహారంలో దానిమ్మను చేర్చినట్లయితే హిమోగ్లోబిన్, రక్తం లోపాన్ని అధిగమించవచ్చు. ఐరన్‌తో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

బీట్‌రూట్

బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బీట్‌రూట్ తినడం వల్ల రక్తం వేగంగా పెరుగుతుంది. రక్తహీనత విషయంలో బీట్‌రూట్‌ జ్యూస్‌ తయారు చేసి తాగవచ్చు. బీట్‌రూట్‌ను సలాడ్‌గా ఆహారంలో చేర్చుకోవచ్చు. బీట్‌రూట్ తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంద. కాబట్టి ముఖంలో మెరుపు వస్తుంది.

ఆపిల్

యాపిల్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. మీ రోజువారీ ఆహారంలో ఆపిల్‌లను చేర్చుకోవడం వల్ల అనేక ఇతర వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేసే యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఉసిరి

ఉసిరికాయలో ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ సి, క్యాల్షియం పెద్దు మొత్తంలో ఉంటుంది. రక్తహీనత వ్యాధి వచ్చినప్పుడు ఉసిరికాయ తింటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరి మీ శరీరంలో రక్త కొరతను తొలగిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories