Health Tips: కంటిచూపు బలహీనంగా మారిందా.. వేసవిలో ఈ డైట్‌ పాటించండి..!

These Foods Increase Eyesight in Summer Definitely Include in the Diet
x

Health Tips: కంటిచూపు బలహీనంగా మారిందా.. వేసవిలో ఈ డైట్‌ పాటించండి..!

Highlights

Health Tips: నేటి రోజుల్లో చిన్న వయస్సులోనే కంటి చూపు బలహీనంగా మారుతుంది.

Health Tips: నేటి రోజుల్లో చిన్న వయస్సులోనే కంటి చూపు బలహీనంగా మారుతుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువ సమయం ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లపైనే గడుపుతున్నారు. మరోవైపు కంటిచూపు మందగించినప్పుడు కళ్లద్దాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే కంటి చూపు పెరగాలంటే ఆహారంపై శ్రద్ధ వహించాలని గుర్తుంచుకోండి. విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు కంటి చూపును పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా కొన్ని వేసవి ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

పుల్లని ఆహారాలు

పుల్లటి ఆహారాలలో విటమిన్ సి లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. వీటిని డైట్‌లో చేర్చుకుంటే చర్మానికి మేలు జరుగుతుంది. అలాగే కంటి చూపు మెరుగవుతుంది. అంతేకాకుండా ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చుకోవాలి. ఇందుకోసం నారింజ, ద్రాక్ష, బొప్పాయి, టమోటో వంటివి తీసుకోవాలి.

పుచ్చకాయ తినాలి

వేసవి కాలంలో పుచ్చకాయను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో 90 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరానికి, కళ్ళకు మేలు చేస్తుంది. అదే సమయంలో పుచ్చకాయలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కళ్ళకు చాలా మంచిది. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.

ఆకు కూరలు

ఆకు కూరలు చలికాలంలోనే కాకుండా వేసవిలో కూడా తినాలి. వీటిని తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. అనేక రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. అదే సమయంలో ఆకు కూరలు తినడం వల్ల కంటిశుక్లం నివారించవచ్చు. కంటి చూపును పెంచడంలో ఆకుకూరల పాత్ర అధికంగా ఉంటుందని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories