Immunity: తక్షణ రోగనిరోధక శక్తికి ఈ ఆహారాలు సూపర్‌.. ఏంటంటే..?

These foods are super for instant immunity
x

Immunity: తక్షణ రోగనిరోధక శక్తికి ఈ ఆహారాలు సూపర్‌.. ఏంటంటే..?

Highlights

Immunity: తక్షణ రోగనిరోధక శక్తికి ఈ ఆహారాలు సూపర్‌.. ఏంటంటే..?

Immunity: ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధకశక్తి కచ్చితంగా కావాలి. లేదంటే వెంటనే రోగాలబారిన పడుతాడు. కరోనా లాంటి విపత్కర సమయంలో ఇమ్యూనిటీ అనేది చాలా ముఖ్యం. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆధునిక జీవన శైలిలో చెడు అలవాట్ల వల్ల చాలామంది రోగనిరోధక శక్తిని కోల్పోతున్నారు. మద్యం తాగడం, సిగరెట్‌కాల్చడం, జంక్‌ ఫుడ్‌ తినడం మొదలైనవాటివల్ల ఇమ్యూనిటీ క్షీణిస్తోంది. అందుకే నాణ్యమైన ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం.

1. వెల్లుల్లి

వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా భారతీయ ఇళ్లలో తప్పకుండా ఉంటుంది. వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది వివిధ రకాల క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. అల్లిన్ అనే రసాయనం రోగాలను రాకుండా కాపాడుతుంది. ఇది ఘాటైన రుచి వాసనను కలిగి ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడేవారికి వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది.

2. క్యారెట్

ఇది రూట్ వెజిటేబుల్ ఇమ్యూనిటీని రెండింతలు వేగంగా పెంచుతుంది. నిజానికి క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కొంతకాలం తర్వాత విటమిన్ ఎగా మారుతుంది. విటమిన్ ఎ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి పని చేస్తుందని నిపుణులు చెబుతారు.

3. వేరుశనగ

వేరుశెనగలో యాంటీఆక్సిడెంట్ విటమిన్ E సమృద్ధిగా లభిస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుకోవడానికి మీరు వేరుశెనగలను తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా నానబెట్టిన వేరుశెనగను తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది. అంతే కాదు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వేరుశెనగలో కనిపిస్తాయి. దీని కారణంగా మీ మెదడు షార్ప్‌గా ఉంటుంది. ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది.

4. పెరుగు

ప్రోబయోటిక్ ఆహారాలలో పెరుగు ఉత్తమమైనది. ఇందులో ఉండే సూక్ష్మజీవులు మన శరీరానికి మేలు చేస్తాయి. పెరుగు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాదు పెరుగులో క్యాల్షియం, విటమిన్ బి-2, బి-12, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories