Fennel Seeds: వీరు సోంపు అస్సలు తీసుకోకూడదు.. ఏమవుతుందో తెలుసా ?

Fennel Seeds: వీరు సోంపు అస్సలు తీసుకోకూడదు.. ఏమవుతుందో తెలుసా ?
x
Highlights

Fennel Seeds: భోజనం చేసిన తర్వాత సోంపు తినడం చాలా మందికి ఉండే అలవాటే.

Fennel Seeds: భోజనం చేసిన తర్వాత సోంపు తినడం చాలా మందికి ఉండే అలవాటే. సోంపు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు మొదలు ఎన్నో లాభాలు వీటితో ఉన్నాయి. హోటల్స్‌, రెస్టారెంట్స్‌లో కూడా తిన్న వెంటనే సోంపులను అందిస్తుంటాయి. కడుపుబ్బరం మొదలు ఎన్నో రకాల జీర్ణ సంబంధిత సమస్యలకు సోంపుతో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.

సోంపు గింజల్లో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం జీర్ణ సమస్యలను మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా సోంపుతో ఉన్నాయి. అయితే కొందరికీ మాత్రం సోంపు అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు సోంపుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ సోంపు గింజలు ఎలాంటి వారు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపును ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భాశయ సంకోచాలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గర్భవతులు సోంపును అస్సలు తీసుకోకూదని చెబుతున్నారు. ఇక పాలిచ్చే తల్లులు కూడా సోంపును తక్కువగా తీసుకోవాలి. సోంపు పాల ఉత్పత్తిని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్లు సోంపును తీసుకోకపోవడమే మంచిది.

ఆపరేషన్స్‌ చేయించుకునే కొన్ని రోజుల ముందు నుంచి సోంపుకు దూరంగా ఉండాలి. సోంపును తీసుకుంటే రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. సోంపు కడుపులోని ఆమ్లాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కడుపులో పుండ్లు ఉన్న వారు, అల్సర్‌ సమస్యతో బాధపడేవారు కూడా సోంపును తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇక సోంపుతో తుమ్ములు, అలర్జీలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలున్న వారు సోంపును తక్కువగా తీసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories