Health: కడుపు పై భాగంలో నొప్పి.. దేనికి సంకేతమో తెలుసా.?

Health: కడుపు పై భాగంలో నొప్పి.. దేనికి సంకేతమో తెలుసా.?
x

Health: కడుపు పై భాగంలో నొప్పి.. దేనికి సంకేతమో తెలుసా.?

Highlights

Stomach Pain Reasons: కడుపు నొప్పి సర్వసాధారణంగా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే సమస్యే.

Stomach Pain Reasons: కడుపు నొప్పి సర్వసాధారణంగా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే సమస్యే. అయితే కడుపు నొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అపెండిసైటిస్‌, క్యాన్సర్‌, పేగుల్లో మంట, జీర్ణ సంబంధిత సమస్యలు వంటి సమస్యల కారణంగా కడుపు నొప్పి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయినా కడుపు నొప్పి వేధిస్తుంటుంది. అయితే కడుపు నొప్పి ఏ భాగంలో వస్తుందన్న దాని బట్టి అది ఏ వ్యాధికి సంకేతమో అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కడుపులో ఎగువ భాగంలో నొప్పి వస్తే అది దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.

* గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ కారణంగా కూడా కడుపు పై భాగంలో నొప్పిగా ఉంటుంది. యాసిడ్‌ రిఫ్లక్స్‌ కారనంగా అన్నవాహిక లైనింగ్ దెబ్బతింటుంది. దీంతో కడుపు నుంచి ఛాతీకి గ్యాస్ పెరగడం వల్ల నొప్పి ఎక్కువుతుంది. కడుపు ఎగువ భాగంలో నొప్పికి ఇదే కారణంగా చెప్పొచ్చు.

* పిత్తాశయంలో ఏర్పడే రాళ్ల కారణంగా కూడా కడుపు నొప్పి వేధిస్తుంటుంది. పొత్తి కడుపు కుడి భాగంలో ఎడమవైపు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి వస్తుంటే దానికి పిత్తాశయంలో ఏర్పడే రాళ్లే కారణమని అర్థం చేసుకోవాలి.

* పిత్తాశయం కూడా కడుపు ఎగువ భాగంలో నొప్పిని కలిగిస్తుంది. దీని వల్ల గాల్ బ్లాడర్ కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. కాలేయంలో పిత్తాశయం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.

* ఆహారం తీసుకునే సమయంలో పిత్తాశయం సంకోచిస్తుంది. చిన్న ప్రేగు (డ్యూడెనమ్) లోకి పిత్తాన్ని ఖాళీ చేస్తుంది. ఈ పిత్తం అధికంగా ఉత్పత్తి కావడం ప్రారంభించి రాళ్ల రూపంలోకి మారుతుంది. దీంతో కడుపు ఎగువ భాగంలో నొప్పి ఉంటుంది. డయాఫ్రాగమ్ ద్వారా కడుపులో కొంత భాగం పైకి నెట్టినప్పుడు, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కూడా నొప్పికి దారి తీస్తుంది. కాబట్టి ఎలాంటి కడుపు నొప్పైనా సరే ఒక్క రోజుకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories