Lord Shiva: శివుడు శ్మశానంలో ఉండటానికి అనేక కారణాలు.. అవేంటో తెలుసుకోండి!

Lord Shiva: శివుడు శ్మశానంలో ఉండటానికి అనేక కారణాలు.. అవేంటో తెలుసుకోండి!
x
Highlights

Lord Shiva: మనం పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటాము. శివుడు శ్మశానవాసి అని పురాణాల్లో ఉంది. ఆయన శ్మశానంలో నివసిస్తాడని నమ్ముతుంటాము. దీనికి...

Lord Shiva: మనం పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటాము. శివుడు శ్మశానవాసి అని పురాణాల్లో ఉంది. ఆయన శ్మశానంలో నివసిస్తాడని నమ్ముతుంటాము. దీనికి ఆంతర్యం ఎంతో లోతైన ఆధ్యాత్మికతతో నిండి ఉంది. శివుడు శ్మశానంలో ఉండటానికి కారణాలు ఎన్నో ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

శివుడు ఆదిగానీ, అంతుగానీ లేని పరమాత్మ స్వరూపం. బ్రహ్మ, విష్ణు, రుద్ర తత్వాలను కలిగిన పరబ్రహ్మ పరమేశ్వరుడు అని పండితులు చెబుతున్నారు. శివుడు శూన్య తత్వాన్ని సూచిస్తాడు. అంటే ఎలాంటి ఆకారము లేకున్నా..సమస్త జగత్తుని తనలో కలిపిన పరిపూర్ణ తత్వం. అందుకే శివుడు నిరాకార పరబ్రహ్మంగా కూడా పూజించబడుతాడు. ఈ స్రుష్టిలో అన్ని జీవరాశులు చివరికి పాటించాల్సిన మూలం శివతత్వమే.

శివుడు శ్మశానంలోనే ఎందుకు ఉంటాడు?

శివుడిని శ్మశానవాసి అని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడని నమ్ముతుంటాము. దీనికి ఆంతర్యం ఎంతో లోతైన ఆధ్యాత్మికతతో నిండి ఉంది. శివుడు శ్మశానంలో ఉండటానికి కారణాలెన్నో ఉన్నాయి. బ్రహ్మ స్రుష్టిని చేస్తాడు. విష్ణువు పోషిస్తాడు. కానీ శివుడు లయకారకుడు. శ్మశానం అంటే జీవితంలోని చివరి స్థానం. అక్కడికి చేరుకున్న ప్రతి జీవి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి పరమతత్వంతో కలుస్తుంది. అందుకే శివుడు అక్కడ ఉండి ఆత్మలను మోక్ష మార్గంలోకి నడిపిస్తాడు.

మనుషులు జీవితంలో ఎన్నో విషయాలకు అహంకారం పెంచుకుంటుంటారు. ధనం, పదవి, బంధుత్వాలు. కానీ శ్మశానం అందరినీ సమానంగా చూసే ప్రదేశం. శివుడు అక్కడ ఉండటం వల్ల ఈశ్వర సమనత్వాన్ని సూచిస్తాడు. జీవితం తాత్కాలికమని, చివరికి అంతా భస్మమైపోతుందని గుర్తు చేస్తాడు. అందుకే శివుడు భస్మధారణం చేస్తాడు. ఇది అహంకార రహిత జీవన విధానానికి ప్రతీకం.

శివుడు సంపద, భోగభాగ్యాలను కోరుకోడు. ఆయన శ్మశాన వాసి కావడంతో పాటు భిక్షాటన చేయడాన్ని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. శివుడు శ్మశానంలో నివసించడం వల్ల అహంకారం భయాన్ని తొలగించుకోవడం, జీవితపు తాత్కాలికతను గుర్తించడం, శివ తత్వాన్ని గ్రహించడం వంటి ఎన్నో గొప్ప సందేశాలను మనం పొందగలుగుతామని పండితులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories