రాక్‌ సాల్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Rock Salt: ఉపవాస సమయంలో రాక్ సాల్ట్‌ను చాలామంది ఉపయోగిస్తారు. అయితే దీనిని సాధారణ రోజుల్లో ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Arun Chilukuri
Published on: 17 Feb 2022 5:08 PM IST
There are Many Benefits to Using Rock Salt
X

రాక్‌ సాల్ట్‌తో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Rock Salt: ఉపవాస సమయంలో రాక్ సాల్ట్‌ను చాలామంది ఉపయోగిస్తారు. అయితే దీనిని సాధారణ రోజుల్లో ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో సానుకూల ప్రభావాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి చక్కటి నివారణగా చెప్పవచ్చు. వాటి గురంచి తెలుసుకుందాం.

రాతి ఉప్పు తినడం వల్ల శరీరంలో మెలటోనిన్, సెరోటోనిన్ హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది, దీని కారణంగా టెన్షన్ తగ్గుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు రాతి ఉప్పును తినాలి. ఎందుకంటే ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రాతి ఉప్పు తినడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. దీని వల్ల కండరాల తిమ్మిరి సమస్య ఉండదు. నిమ్మరసంలో రాళ్ల ఉప్పు కలిపి తాగితే శరీరంలో రాళ్లు కరుగుతాయి.

రోజువారీ ఆహారంలో రాక్ సాల్ట్‌ను చేర్చుకోవడం ద్వారా జీవక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రోజంతా శక్తి ప్రసారం చేస్తుంది. తెల్ల ఉప్పు కంటే రాతి ఉప్పు ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. రాక్ సాల్ట్ దగ్గు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గోరువెచ్చని నీటిలో కొంచెం వేసి పుక్కిలిస్తే ఉపశమనం కలుగుతుంది. రాక్ సాల్ట్ మీ దంతాలను బలపరుస్తుంది. చిగుళ్ళ కుళ్ళిపోకుండా కాపాడుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story