Stress: చిన్నప్పుడు ఒత్తిడికి గురైతే.. పెద్దయ్యాక ఆ సమస్య తప్పదు.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..!

Stress in Young Age May Impact on Mental Health
x

Stress: చిన్నప్పుడు ఒత్తిడికి గురైతే.. పెద్దయ్యాక ఆ సమస్య తప్పదు.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..! 

Highlights

Stress: ఒత్తిడి.. ఒకప్పుడు అసలు ఇలాంటి ఓ సమస్య ఉంటుందని కూడా ఎవరూ ఊహించు ఉండే వారు కాదు.

Stress: ఒత్తిడి.. ఒకప్పుడు అసలు ఇలాంటి ఓ సమస్య ఉంటుందని కూడా ఎవరూ ఊహించు ఉండే వారు కాదు. శారీరక ఒత్తిడి స్థానంలో మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. మనిషి శరీరంతో చేసే పని కంటే మెదడుతో చేసే పనులు పెరిగిపోయాయి. ఇక ఈ గజిబిజీ జీవితంలో మానసిక ఒత్తిడి కూడా క్రమంగా పెరుగుతోంది. స్కూలుకు వెళ్లే పిల్లలు సైతం ఒత్తిడి ఎదుర్కోవాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే చిన్నతనంలో ఎక్కువ ఒత్తిడి వాతావరణంలో పెరిగిన వారిలో పెద్దయ్యాక పలురకాల ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి చిన్నతనంలో స్థాయికి మించి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ వంటి సమస్యలు పెద్దాయ్యక వారి జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. న్యూయార్క్ సైకాలజిస్టులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చిన్నతనంలో ఒత్తిడి ఎదుర్కొన్న వారిలో పెద్దయ్యాక అల్జీమర్స్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బిజీ జీవితం, పేదరికం, ఆర్థిక సమస్యలు, ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం వంటివి 30 ఏళ్లలోపు వారిలో ఒత్తిడి, ఆందోళనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక 18 ఏళ్లలోపు వారిని చదువుకునే సమయంలో పేదరికం, సామాజిక ఒంటరితనం వంటివి మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయని, ఇది కొందరిలో డిప్రెషన్‌కు కారణమవుతుందని అధ్యయనంలో వెల్లడైంది. ఇలాంటి వారు వృద్ధాప్ంలో మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని అటున్నారు.

చిన్నతనంలో ఎదుర్కొన్న మానసిక సమస్య జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తాయని ఫ్రాన్స్‌లోని బోర్డిఎక్స్ యూనివర్సిటీ నిపుణులు తెలిపారు. స్టడీలో భాగంగా ఎంపిక చేసిన కొందరి వ్యక్తులకు సంబంధించిన నిద్ర, ఆకలి, ఏకాగ్రత, సోషల్ ఐసోలేషన్ ,డిప్రెషన్, సామర్థ్యం, విచారం, వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. యవ్వనంలో డిప్రెషన్‌తో బాధపడినవారు మధ్య వయస్సులో బలహీనమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఒత్తిడిని స్వీకరిచే విధానంపై కూడా పరిణామాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories