గంటల తరబడి ఏసీ గదిలో ఉంటున్నారా.. ఇక అంతే సంగతులు..!

Spending too Much Time in AC is Very Dangerous for Health
x

గంటల తరబడి ఏసీ గదిలో ఉంటున్నారా.. ఇక అంతే సంగతులు..!

Highlights

AC Side Effects: దేశవ్యాప్తంగా వర్షాకాలం ముగిసినట్లే.

AC Side Effects: దేశవ్యాప్తంగా వర్షాకాలం ముగిసినట్లే. అయినప్పటికీ ప్రజలు ఏసీ నుంచి బయటకు రావడం లేదు. ఇళ్లు, కార్యాలయాలు, వాహనాల్లో ఏసీని నడుపుతున్నారు. జనం ఏసీలో ఉండడానికి బాగా అలవాటు పడ్డారు. అయితే ఏసీలో ఎక్కువ సమయం గడపడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల ఇన్ఫెక్షన్, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో తెలుసుకుందాం.

1. పొడి కళ్ళు

ఎక్కువ సేపు ఏసీలో ఉండడం వల్ల కళ్లు దెబ్బతింటాయి. ఏసీలో ఉండటం వల్ల కళ్లు పొడిబారతాయి. మీ కళ్ళలో దురద, మంట ఏర్పడుతాయి. అందువల్ల డ్రై ఐ సిండ్రోమ్ ఉన్నవారు ఏసీలో ఎక్కువ సమయం గడపకూడదు.

2. పొడి బారిన చర్మం

కళ్లు పొడిబారడమే కాకుండా ఏసీలో ఎక్కువ సమయం గడపడం చర్మం పొడిబారుతుంది. దీనివల్ల దురద ఏర్పడుతుంది. చర్మంపై తెల్లటి మచ్చలు, మంట వస్తాయి.

3. డీ హైడ్రేషన్‌

ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కానీ అది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. సాధారణ గదుల్లో కంటే ఏసీ గదుల్లో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి AC గదిలోని తేమను గ్రహిస్తుంది. ఇది డీ హైడ్రేషన్‌కి కారణం అవుతుంది.

4. శ్వాసకోశ వ్యాధులు

ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఏసీలో ఉండడం వల్ల గొంతు పొడిబారడం, రినైటిస్, ముక్కు మూసుకుపోవడం సమస్యలు ఎదురవుతాయి. ఇది ముక్కు శ్లేష్మ పొర వాపునకు కారణమవుతుంది.

5. తలనొప్పి

డీహైడ్రేషన్‌తో పాటు ఏసీ వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. మీరు బయటి వేడి నుంచి AC గదిలోకి అడుగు పెట్టినప్పుడు లేదా AC గది నుంచి బయటకు వెళ్లినప్పుడు మీకు ఈ సమస్య ఎదురవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories