Health Tips: సాక్స్‌ ధరించి నిద్రించడం మంచిదే.. కానీ ఈ ఒక్క విషయం నివారించండి..!

Sleeping Wearing Socks is Good but Avoid this one Thing
x

Health Tips: సాక్స్‌ ధరించి నిద్రించడం మంచిదే.. కానీ ఈ ఒక్క విషయం నివారించండి..!

Highlights

Health Tips: చలికాలంలో చాలామంది రాత్రిపూట సాక్స్‌లు ధరించి నిద్రపోతారు.

Health Tips: చలికాలంలో చాలామంది రాత్రిపూట సాక్స్‌లు ధరించి నిద్రపోతారు. ఇవి పాదాలు, అరికాళ్ళను వెచ్చగా ఉంచుతాయి. ఇది కాకుండా సాక్సులు ధరించి నిద్రించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటివల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. సాక్స్ ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. లేదంటే అది ఆరోగ్యంపై భారంగా ఉంటుంది. సాక్స్ ధరించి నిద్రించడం వల్ల కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.

సాక్స్ ధరించి నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది శరీరాన్ని వేడి చేస్తుంది. చలికాలంలో చలి కారణంగా త్వరగా నిద్రపోవడం కష్టం. కానీ సాక్స్ ధరించి నిద్రపోవడం వల్ల శరీరం వేడెక్కుతుంది. సులువుగా నిద్రపడుతుంది.

తిమ్మిర్లు తగ్గుతాయి

చలి కారణంగా చేతులు, కాళ్లు బిగుసుగా మారుతాయి. దీని కారణంగా శరీరంలో తిమ్మిరి సమస్యలు ఎదురవుతాయి. సాక్స్ ధరించి నిద్రించడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. ఇది రేనాడ్స్ సిండ్రోమ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.

పగిలిన మడమలు నయం

సాక్స్‌తో నిద్రించడం వల్ల పాదాలు దుమ్ము, గాలికి దూరంగా ఉంటాయి. ఇలా పడుకోవడం వల్ల పాదాలు పగుళ్లు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ మడమలు పగులుతున్నట్లయితే పాదాలకు క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేసి తర్వాత సాక్స్ ధరించాలి. దీనివల్ల పాదాలు, మడమలు మృదువుగా మారుతాయి.

ఈ తప్పు చేయవద్దు

సాక్స్ ధరించి నిద్రించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కానీ ఒక పొరపాటు చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సాక్స్ బిగుతుగా ఉంటే అది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇది కాకుండా సాక్స్ ధరించేటప్పుడు శుభ్రంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. మురికి సాక్స్ పాదాలకు హాని కలిగిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories