Sea Food In Rainy: వర్షాకాలంలో ఇలాంటి చేపలు తినొద్దు..తింటే ఇక హాస్పిటల్‌కే

Sea Food In Rainy
x

Sea Food In Rainy: వర్షాకాలంలో ఇలాంటి చేపలు తినొద్దు..తింటే ఇక హాస్పిటల్‌కే

Highlights

Sea Food In Rainy: చేపలు చాలా ఆరోగ్యకరం. చికెప్, మటన్ కంటే కూడా చేపలు శరీరానికి చాలా మంచిది. వారానికి ఒకసారైనా చేపలు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.

Sea Food In Rainy: చేపలు చాలా ఆరోగ్యకరం. చికెప్, మటన్ కంటే కూడా చేపలు శరీరానికి చాలా మంచిది. వారానికి ఒకసారైనా చేపలు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే వర్షాకాలంలో చేపలు తినేముందు కాస్త ఆలోచించండి. ఎందుకంటే వర్షాకాలంలో కొన్ని సార్లు చేపలు బాగా కలుషితమైపోతాయి. వీటిని తినడం వల్ల హాస్పిటల్‌ పాలయ్యే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే మార్కెట్లోకి వెళ్లి కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

చేపలు ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు గుండె, మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే కచ్చితంగా చేపలను తినాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే వానాకాలంలో చేపలు తినేముందు కాస్త జాగ్రత్తపడాలి.

వాన నీరు

వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడతాయి కాబట్టి చేపలు పెరిగే ప్రాంతంలో వర్షపు నీళ్లు పడి ఎక్కువ కాలం చేపలు ఆ నీటిలోనే ఉండిపోతాయి. అయితే ఇలా వర్షపు నీటిలో ఎక్కువ కాలం చేపలు ఉంటే వాటి పోషకాలు తగ్గుతాయి. సహజంగా చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, మినరల్స్ వంటి శాతం తగ్గిపోతుంది. దీంతో ఆ చేపలు ఎక్కువగా పాడైపోతాయి అందుకే జాగ్రత్తగా చూసి చేపలన కొనాలి.

కలుషితమైన నీరు

ఈ కాలంలో ఎక్కడ బడితే అక్కడ వర్షపు నీరు. అదేవిధంగా డ్రైనేజీలు పొంగు పొర్లుతాయి. చివరకు ఈ నీళ్లు కాలువల ద్వారా చేపలను పెంచే చెరువుల్లోకి కూడా వచ్చి చేరతాయి. ఈ కలుషితమైన నీటిలో చేపలు ఎక్కువ రోజులు ఉండలేవు. ఇలా అక్కడ చచ్చిపోయిన చేపలను మార్కెట్లోకి తీసుకొచ్చి ఆమ్మేస్తూ ఉంటారు. అందుకే కొనేటప్పుడు లైవ్ ఫిష్‌లను మాత్రమే కొనాలి.

పురుగుల మందు నీరు

ఇక ఈ కాలంలోనే పొలాల్లో పురుగుల మందులను రైతులు వేస్తారు. ఒక పక్క పురుగుల మందు, మరోపక్క వర్షపు నీరు ఈ రెండు కలిసి చేపలున్న చెరువుల్లోకి చేరిపోతుంది. దీనివల్ల కూడా చేపలు పాడైపోతాయి.

ఎలాంటి చేపలు కొనాలి?

వానాకాలంలో ఎక్కువగా లైవ్ ఫిష్ మాత్రమే తినడం మంచిది. అంతేకాదు, చేపను పట్టుకునే గడ్డిగా ఉండాలి. ఒకవేళ చేప చాలా మెత్తగా ఉంటే అది చనిపోయి చాలా సేపయిందని అర్ధం. అలాంటి చేపలు తినకూడదు. చేపల కళ్లు, చేపల రెక్కలు ఎర్రగా ఉన్నాయో లేదో చూడాలి. ఎర్రగా ఉన్నవాటినే కొనాలి. కొంతమంది ఈ మధ్య రెక్కల ప్రాంతంలో ఎర్రరంగును పూసి చేపలను అమ్ముతున్నారు. కాబట్టి అది సరైనదో కాదో చూసి చేపలను కొనాలి.

చెడిపోయిన చేపలు తింటే ఏం జరుగుతుంది?

ఈ కాలంలోచెడిపోయిన చేపలను తింటే హాస్పిటల్‌కు వెళ్లాల్సిందే. కడుపులో పాయిజన్ అవుతుంది. జ్వరం. వాంతులు, విరేచనాలు అవుతాయి. ఒక్కోసారి అది డయేరియాకు దారి తీస్తుంది. జీర్ణవ్యవస్థపైన కూడా ప్రభావం చూపుతుంది. అందుకే బతికి ఉన్న చేపలను మాత్రమే ఈ కాలంలో తినాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories