Rice Water: రైస్‌ వాటర్‌తో ముఖం మెరిసే.. అందంగా కనిపించాలంటే ఇలా చేయండి..!

Rice Water Brings Glow to the Face Learn how to use it
x

Rice Water: రైస్‌ వాటర్‌తో ముఖం మెరిసే.. అందంగా కనిపించాలంటే ఇలా చేయండి..!

Highlights

Rice Water: వర్షాకాలంలో ముఖం జిగటగా, నిస్తేజంగా మారుతుంది. ఈ సీజన్‌లో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది.

Rice Water: వర్షాకాలంలో ముఖం జిగటగా, నిస్తేజంగా మారుతుంది. ఈ సీజన్‌లో మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు చర్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాతావరణంలోని తేమ వల్ల కొంతమందికి ఎలర్జీ, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటి సమయంలో మీరు కొన్ని చిట్కాలని పాటించాలి. బియ్యం నీటిని ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది. అయితే బియ్యం నీళ్లతో ఫేస్ మాస్క్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

బియ్యం నీటితో ఫేస్‌మాస్క్‌

1. ముందుగా మీరు బియ్యాన్ని కడిగి ఉడికించాలి. ఎక్కువ నీరు వేసి ఎక్కువసేపు ఉడికించాలి. తర్వాత అది పేస్ట్ లాగా మారుతుంది.

2. ఇప్పుడు బియ్యం నీరు, బియ్యం కలపడం ద్వారా పేస్ట్ సిద్దమవుతుంది.

3. మీరు దీనికి తేనె, పచ్చి పాలు జోడించాలి.

4. దీనిని ముఖం మొత్తం అప్లై చేయండి. ఆరిన తర్వాత నీటితో కడగాలి.

5. ఇది మీ మొటిమల సమస్యను తొలగిస్తుంది, చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.

నిజానికి రైస్ వాటర్ లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల స్కిన్ కేర్ రొటీన్ కి మంచి ఎడిషన్ అవుతుంది. రైస్ వాటర్‌లో ఉన్న మినరల్స్, విటమిన్స్, అమినో ఆసిడ్స్ వల్ల స్కిన్ ఎంతో హెల్దీ గా ఉంటుంది. వయసు వల్ల వచ్చే మార్పులతో చర్మం మీద అక్కడక్కడా కొంచెం స్కిన్ కలర్ మారవచ్చు. అలాంటివాటికి రైస్ వాటర్ మంచి మందు. ఒక టీ స్పూన్ రైస్ వాటర్ లో కొన్ని చుక్కలు జొజోబా ఆయిల్ వేసి ముఖానీకీ, మెడకీ మసాజ్ చేస్తున్నట్లుగా అప్లై చేస్తే ముఖం మెరిసిపోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories